Hyderabad Airport
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత అదొక ఫేక్ కాల్‌గా తేల్చారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ మధ్యకాలంలో నగరంలోని స్కూళ్లకు సైతం ఇదే తరహాలో మెయిల్స్ బెదిరింపులు వస్తుండడం తెలిసిందే. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మలేసియా సంస్థ వాటా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ సంస్థ జీఎంఆర్ గ్రూప్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)కు జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్‌బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్ గ్రూప్ తెలియజేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్‌కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది. -
ఎయిర్‌పోర్ట్‌లో సమంత.. అందరి దృష్టి వాటిపైనే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఇండియా వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. సిటాడెల్ చివరి షెడ్యూల్ ముగించుకున్న సమంత తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిసింది. (ఇది చదవండి: ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్) అయితే సమంత కాస్తా డిఫరెంట్ లుక్‌లో విమానాశ్రయంలో కనిపించింది. చాలా విభిన్నమైన దుస్తుల్లో వచ్చిన సమంత ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన చెప్పులపైనే నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సమంత చాలా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు వేసుకుందని.. వాటి ధరపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. సమంత చెప్పుల విలువ దాదాపు రూ.2,58,097గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి చాలా సౌకర్యవంతంగా, తక్షణ వెచ్చదనం ఇస్తాయని.. అంతే కాకుండా ఈ చెప్పుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా లుక్‌లో సమంత చాలా ఫర్ఫెక్ట్గా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) -
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో చంద్రబోస్ కు ఘన స్వాగతం
-
జూ.ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం..కళ్లలో నీళ్లు తిరిగాయని భావోద్వేగం.
సాక్షి, హైదరాబాద్: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిందని అనౌన్స్ చేసిన క్షణంలో ఆనందం తట్టుకోలేక పోయామని ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆస్కార్ వేదిక మీద ట్రిపుల్ ఆర్ టీం చేతికి ఆస్కార్ అందించినప్పుడు అంతకు మించిన ఆనందం ఇంకోటి లేదనిపించింది. మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన అభిమానులకి, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డు చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవార్డు వచ్చిన విషయం నా ఫ్యామిలీలో మొదటగా నా వైఫ్ కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను.' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సాంగ్‌కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు యావత్ ప్రపంచాన్ని ఊర్రూతలించాయి. -
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన రామ్‌చరణ్ దంపతులు.. వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కోసం అక్కడికి వెళ్లిన రామ్‌చరణ్, ఉపాసన ఆ తర్వాత ఆఫ్రికాకు పయనం అయ్యారు. గురువారం వెకేషన్ నుంచి రామ్‌చరణ్ దంపతులు హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. వారి వెంట పెట్‌డాగ్ రైమ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందున్న సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. Mega Power Star @alwaysRamCharan is back in India from vacation with his wife @UpasanaKonidela💞🥰#RamCharan #UpasanaKonidela #Couplegoals #ShreyasMedia pic.twitter.com/C5LgB2SSI1 — Shreyas Media (@shreyasgroup) November 3, 2022 -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం లభించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డును దక్కించుకుంది. అంతేకాదు ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కూడా హైదరాబాద్ స్థానం మెరుగైంది. టాప్ 100 ఎయిర్పోర్ట్ లీగ్ జాబితాలో 2021లో 64వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానంపైకి ఎగబాకి 63వ ప్లేస్‌లో నిల్చుంది. బెస్ట్ స్టాఫ్ విభాగంతో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మరికొన్ని విభాగాల్లోనూ ప్రశంసలు దక్కాయి. బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా (ద్వితీయ), క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా (మూడవ), బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా (నాలుగవ) విభాగాల్లోనూ హైదరాబాద్‌కు టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నించింది. చదవండి: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మరో 30 ఏళ్లు జీఎంఆర్‌కే
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహాన బాధ్యతలు మరో ముప్పై పాటు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. ఈ మేరకు సివిల్ ఏవియేష్ అథారిటీ ఇందుకు సంబంధించిన పత్రాలను జీఎంఆర్‌కు అందచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 21 మిలియన్ మంది ప్రయాణిస్తుండగా 1.50 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. గతంలో బేగంపేటలో ఎయిర్‌పోర్టు ఉండగా శంషాబాద్ వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులు 2004లో ప్రారంభించారు. 31 నెలల పాటు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2008లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. పీపీపీ ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి 2038 వరకు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. తాజాగా మరో ముప్పై ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌కి కట్టబెడుతూ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2068 మార్చి 23 వరకు జీఎంఆర్ ఆధీనంలో ఉండనుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు భారీ ఎత్తున జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఏడాదికి 35 మిలియన్ మంది ప్రయాణించేలా ఇక్కడ సౌకర్యాలను మెరుగు పరుస్తోంది. చదవండి: విస్తరణ బాటలో ఫనాటిక్స్ -
Hyderabad: విమానాశ్రయంలో నిబంధనలు కఠినతరం
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఉద్ధృతి దృష్ట్యా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టారు. కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి ఫలితాలు వెలువడే వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ కేసుల నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కోవిడ్ పరీక్ష ఫలితాలు వెలువడకుండానే కోల్‌కతాకు వెళ్లిపోయాడు. అనంతరం అతనికి కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో అధికారులు గందరగోళంలో పడిపోయారు. ఈ ఉదంతం నేపథ్యంలో పరీక్షలు సమర్థంగా నిర్వహించడంతో పాటు ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్తో పాటు, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల ఫలితాలు వెంటనే వచ్చేందుకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ టెస్టు ధర ప్రస్తుతం రూ.3,900 నుంచి రూ.3,400 తగ్గించినట్లు అధికారులు తెలిపారు. (విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి) పరీక్షల సంఖ్య పెంపు.. ► అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించే కోవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచారు. ఇటీవల వరకు రాండమ్‌గా 2 శాతం మంది ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా ఇప్పుడు ఆ సంఖ్యను 5 శాతానికి పెంచారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఎయిర్‌పోర్టులో టెస్టుల సంఖ్యను పెంచారు. 2 శాతం నుంచి 5 శాతం మంది ప్రయాణికులకు రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ► పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని టిమ్స్‌కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లు గుర్తించిన దేశాల సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. బ్రిటన్, దక్షిణకొరియా, బ్రెజిల్, బోట్సువానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయిల్ దేశాలను హైరిస్క్ దేశాలుగా పరిగణిస్తున్నారు. 14 మంది హోటల్ సిబ్బందికి వైద్య పరీక్షలు సొమాలియాకు చెందిన (66)ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకి ఉండొచ్చనే అనుమానంతో ఆయన బస చేసిన హోటల్ 14 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఒమిక్రాన్ అనుమానిత బాధితున్ని టిమ్స్‌కు తరలించకుండా గాంధీలో అడ్మిట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది సహా సాధారణ రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు ఆందోళన చెందుతున్నారు. తగ్గిన ప్రయాణికుల రద్దీ.. ► ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు సగానికి పైగా తగ్గాయి. అత్యవసర ప్రయాణికులు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. ఒమిక్రాన్ కంటే ముందే హైదరాబాద్‌కు చేరుకున్నవారు తిరిగి బయలుదేరుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారిలో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో నగరానికి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ► వారం రోజుల క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 70 అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. ప్రయాణికులు సైతం రోజుకు 3 వేల నుంచి 5 వేల వరకు ఉంటున్నారు. ఇటీవల వరకు రోజుకు సుమారు 8 వేల మంది ప్రయాణం చేసినట్లు అంచనా. ► దేశంలోని వివిధ నగరాల మధ్య డొమెస్టిక్ విమానాల రాకపోకలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారం రోజుల క్రితం 55 వేల మందికిపైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలకు పడిపోయింది. విదేశీయుల కోసం ప్రత్యేక ఓపీ, ఐపీ నగరంలోని అపోలో, కేర్, ఏఐజీ, విరించి, మెడికవర్, యశోద, కిమ్స్, సన్‌షైన్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ అనుమానిత విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఓపీ, ఐపీ వార్డులను ఏర్పాటు చేశారు. అంతేకాదు వీరికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. -
ఒమిక్రాన్ వచ్చేసింది..ఇది ఫాస్ట్..మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ తెలంగాణలో ప్రవేశించింది. ఈ వేరియంట్ కేసులు రాష్ట్రంలో 3 నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం మీడియాకు తెలిపారు. ఇద్దరు హైదరాబాద్‌లో ఉండిపోగా, ఒకరు విమానాశ్రయం నుంచే పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోయారని చెప్పారు. 11, 12 తేదీల్లో నగరానికి..: ‘11న ఏడేళ్ల బాలుడితో సహా బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం కెన్యా నుంచి ఖతార్ మీదుగా హైదరాబాద్ వచ్చింది. విమానాశ్రయంలో ర్యాండమ్ పరీక్ష చేయగా బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ కుటుంబం అట్నుంచి అటే పశ్చిమబెంగాల్‌కు వెళ్లిపోగా.. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో బాలుడికి ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇలావుండగా కెన్యా, సోమాలియాకు చెందిన మరి కొందరు, ఈ నెల 12వ తేదీన వేర్వేరు విమానాల్లో అబుదబి మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారిలో కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ, సోమాలియాకు చెందిన 23 ఏళ్ల పురుషుడు కూడా ఉన్నారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేబరేటరీకి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో వారిద్దరినీ గుర్తించి టిమ్స్‌లో చేర్పించాం..’అని శ్రీనివాసరావు తెలిపారు. ఈ రెండూ రిస్క్ దేశాల జాబితాలో లేవు ‘ఇక బెంగాల్‌కు వెళ్లిన బాలుడికి సంబంధించిన వివరాలను అక్కడి ప్రభుత్వానికి పంపించాం. హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరిలోనూ ఎలాంటి లక్షణాలూ లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో దిగిన కెన్యా దేశస్థురాలు టోలిచౌకికి వెళ్లగా ఆమె అంకుల్, తండ్రికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాం. పాజిటివ్‌గా తేలితే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతాం. వారివారి ఇతర కాంటాక్టులను కూడా గుర్తిస్తున్నాం. కెన్యా, సోమాలియా ఒమిక్రాన్ రిస్క్ దేశాల జాబితాలో లేవు. కాగా ఒమిక్రాన్ ఆంక్షల అనంతరం రాష్ట్రానికి రిస్క్ దేశాల నుంచి మొత్తం 5,396 మంది వచ్చారు. అందులో 18 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా, 15 మందికి ఒమిక్రాన్ నెగటివ్‌గా తేలింది..’అని చెప్పారు. నిర్లక్ష్యం వద్దు.. పరీక్షలు చేయించుకోండి ‘ప్రస్తుతం రోజువారీ చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలను 50 వేలకు పైగా పెంచుతాం. ఎవరికి ఎలాంటి లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ జలుబు, దగ్గు అని నిర్లక్ష్యం చేయవద్దు. కోవిడ్, జలుబు లక్షణాలతో ఒమిక్రాన్ ఉంటుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే, సాధారణ లక్షణాలున్నా ఆసుపత్రులకు వెళ్లాల్సి రావొచ్చు. వ్యాక్సిన్ వేసుకున్నా ఒమిక్రాన్ సోకే అవకాశం ఉంది. అయితే సీరియస్ కాకుండా టీకా కాపాడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మాస్క్‌ల వాడకం 50 శాతానికి పెరిగింది..’అని తెలిపారు. పండుగలు కుటుంబసభ్యుల మధ్యే జరుపుకోవాలి ‘నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఒమిక్రాన్ వెలుగు చూస్తున్నందున అన్ని దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిన అవసరముందని కేంద్రానికి విన్నవించాం. జనవరి రెండో వారం నుంచి ఒమిక్రాన్ తీవ్రత పెరిగే అకాశం ఉంది. ఫిబ్రవరిలో మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాం. అందువల్ల కిస్మస్, కొత్త సంవత్సరం, సంకాంత్రి పండుగలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలి. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి వేరియంట్లు వచ్చినా లాక్డౌన్లు ఉండవు. అయితే అవసరమైనచోట ఆంక్షలు పెట్టే అవకాశముంది..’అని శ్రీనివాసరావు వివరించారు. ►మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. ఒమిక్రాన్ గాలి ద్వారా సోకుతుంది. చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. రెండు రోజుల్లోనే రెండింతలు వ్యాపించే సామర్థ్యం దీనికి ఉంది. అయితే సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. ►మాస్క్‌ల వాడకం ద్వారానే ఒమిక్రాన్‌ను తిప్పికొట్టగలం. ఇంట్లోనూ బయట మాస్క్ ధరించాలి. భోజనం తినేటప్పుడు మాత్రమే మాస్క్ తీసేయాలి. తలుపులు, కిటికీలు తెరుచుకొని ఉండాలి. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. -
హైదరాబాద్ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్‌న్యూస్ ! కరోనా టెస్ట్ ముందస్తు బుకింగ్ షురూ
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభన నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అట్ రిస్క్ కేటగిరీలో ఉన్న పదకొండు దేశాల నుంచి వచ్చే వారికి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. విదేశీ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం రిజిస్ట్రర్ చేసుకోవడం, శాంపిల్స్ ఇవ్వడం ఆ తర్వాత రిపోర్టు వచ్చే వరకు అక్కడే ఎదురు చూడాల్సి వస్తుంది. అయితే ఈ తతంగం అంతా ముగిసే సరికి చాలా సమయం పడుతోంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షల కోసం ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఈ తరహా ఇబ్బందులు తొలగించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ముందుస్తు టెస్టింగ్‌కి ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో బుకింగ్ సదుపాయం ప్రయాణికుల సౌలభ్యం కోసం ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షల ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు వెబ్సైట్ (www.hyderabad.aero) లేదా పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ ల్యాబ్ వెబ్సైట్ (http://covid.mapmygrnome.in) ద్వారా టెస్ట్ స్లాట్ణి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లలో లాగిన్ అయిన తర్వాత ఏ దేశం నుంచి వస్తున్నారు.. హైదరాబాద్ ఎప్పుడు చేరుకుంటారు, వ్యాక్సినేషన్ అయ్యిందా లేదా తదితర విషయాలు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. ఆర్టీ పీసీఆర్ పరీక్షకు రూ. 750, ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షకు రూ.3900 వరకు ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే నేరుగా శాంపిల్స్ ఇచ్చి.. రిజల్ట్ కోసం ఎదురు చూస్తే సరిపోతుంది. కోవిడ్ టెస్ట్‌కి ఆన్లైన్లోనే ముందుగా బుక్ చేసుకోవడం ద్వారా ఎయిర్‌పోర్టులో వెయిటింగ్ టైం తగ్గిపోతుంది. వెయిటింగ్ ఏర్పాట్లు టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్టీపీసీఆర్ రిపోర్టు వచ్చేందుకు 6 గంటలు, ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టు కోసం 2 గంటల వరకు సమయం పడుతుంది. రిపోర్ట్సు వచ్చే వరకు ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు సౌకర్యవంతంగా గడిపేందుకు వీలుగా ప్రత్యేక వెయిటింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..! -
ప్రయాణికులకు ఊరట.. ఆర్టీపీసీఆర్ @రూ. 750
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షల ధరలు తగ్గాయి. కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరీక్షల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాప్ మై జినోమ్ సంస్థ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షల ధరలను తగ్గించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ధర గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు రూ.3,900కు తగ్గించారు. సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఇప్పటి వరకు రూ.999 ఉండగా తాజాగా రూ.750కి తగ్గించారు. ఎయిర్‌పోర్టులో చార్జీలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నగరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కేవలం రూ.500 ఉన్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ సంస్థ ధరలను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ.. ►కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ దేశాల నుంచి ప్రతి రోజు సుమారు 5వేల మంది ప్రయాణికులు నగరానికి చేరుకుంటున్న ట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం యూరప్ దేశాలు, న్యూజిలాండ్, సింగపూర్, తదితర 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. ►ఈ 11 దేశాల నుంచి ప్రతి రోజు వచ్చే సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఆయా దేశాల నుంచి బయలుదేరే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకొన్నప్పటికీ ఎయిర్‌పోర్టులో మ రోసారి పరీక్షించి నెగెటివ్ వచి్చన వారిని ఇళ్లకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. సమర్థంగా పరీక్షలు... ►ఐసీఎంఆర్ ఆమోదించిన మ్యాప్ మై జినోమ్ సంస్థ గతేడాది నవంబరు నుంచి ఎయిర్‌పోర్టు లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తోంది. నమూనాలు సేకరించిన అర్ధ గంట వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకొనేందుకు ర్యాపిడ్ ఆరీ్టపీసీఆర్ దోహదం చేస్తోంది. ►ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం కొంత సమయం పట్టవచ్చు. సుమారు 200 మంది టెక్నీషియన్లు మ్యాప్ మై జినోమ్ లేబొరేటరీలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, బెంగళూర్ తదితర విమానాశ్రయాల్లోనూ మ్యాప్ మై జినోమ్ సేవలందజేస్తోంది. -
ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది?
Rapid PCR Test Cost And Result Time Details at Hyderabad Chennai Airport: ఒమిక్రాన్ వేరియింట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. బుధవారం నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ రకమైన పరీక్షలు చేస్తున్నారు ? రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుందనే అంశాల పట్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎదురు చూస్తున్నారు. రోజుకు 5000ల మంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా దేశంలోని వివిధ నగరాలు, విదేశాల నుంచి నిత్యం 5000ల మంది ప్రయాణికులు రాష్ట్రంలోకి వస్తున్నారు. వీరిలో కేంద్రం పేర్కొన్న అట్ రిస్క్ జాబితాలో ఉన్న 12 దేశాల నుంచి ఇంచుమించు 500ల మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కి పంపిస్తున్నారు. రెండు నుంచి ఆరు గంటలు ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఆర్టీ పీసీఆర్ పరీక్షకు సుమారు 6 గంటల సమయం పడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రిజల్ట్ రెండు గంటలలోపు వస్తుంది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ధర రూ.999 ఉండగా ర్యాపిడ్ కిట్ ధర రూ.4,500లుగా ఉంది. టిమ్స్‌కి ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు రిజల్ట్ వచ్చే వరకు ఎదురు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 400ల మందికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టులో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అక్కడ హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. చెన్నైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు విదేశీ ప్రయాణాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు హైదరాబాద్ తర్వాత ఎక్కుగా చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను ఉపయోగించుకుంటారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.700 ఛార్జ్ చేస్తుండగా రిజల్ట్ కోసం ఆరు గంటల సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.3500 ఛార్జ్ చేస్తుండగా 30 నిమిషాల నుంచి రెండు గంటలలోపు రిజల్ట్ అందిస్తున్నారు. చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! -
అక్కడ కోవిడ్ టెస్ట్ బహు ఖరీదు.. ఏకంగా రూ.4500
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాంటిజెన్ పరీక్ష ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రయాణానికి 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకున్నప్పటికీ విమానాశ్రయంలో ఫ్లైట్ బయలుదేరడానికి ముందు యాంటిజెన్ పరీక్ష తప్పనిసరిగా మారింది. దీంతో కనీసం రూ.150 కూడా విలువ చేయని యాంటిజెన్ పరీక్షలకు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.4500 వరకు వసూలు చేస్తున్నారు. కోవిడ్ నెగెటివ్ నినేదికతో బయలుదేరిన ప్రయాణికులు సైతం యాంటిజెన్ పరీక్ష చేసుకోవలసి రావడంతో చిన్న టెస్టు కోసం రూ.వేలల్లో వసూలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో పాటు పలు దేశాలు కోవిడ్ ఆంక్షలను సడలించడంతో అంతర్జాతీయ రాకపోకలు పెరిగాయి. దీంతో ఎయిర్‌పోర్టులో యాంటిజెన్ టెస్టులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘టెస్టుల పేరిట ఇలా దోచుకోవడం అన్యాయమని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు’. ‘ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లేందుకు ఇంకా ఫ్లైట్లు అందుబాటులోకి రాలేదు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి చేరుకొనే వరకు కనీసం మూడు,నాలుగు సార్లు యాంటిజెన్ టెస్టులు చేసుకోవలసి వస్తుంది.’ అని ఒక ప్రయాణికుడు తెలిపారు. ఆంక్షలు సడలించాక..... కోవిడ్ దృష్ట్యా నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఎయిర్‌లైన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు, గతంలో కుదిరిన ఎయిర్‌బబుల్ ఒప్పందం మేరకే పలు ఎయిర్‌లైన్స్ పరిమితంగా విమానాలను నడుపుతున్నాయి. ఒక్క అమెరికాకే కాకుండా యూరోప్ దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి. ప్రత్యేకించి ఎక్కువ మంది బ్రిటన్‌కు బయలుదేరి వెళ్తున్నారు.అలాగే దుబాయ్, దోహ, షార్జా తదితర దేశాలకు సైతం రాకపోకలు పెరిగాయి. అక్టోబర్‌లో హైదరాబాద్ నుంచి లక్ష మందికి పైగా వివిధ దేశాలకు రాకపోకలు సాగించగా ఆ సంఖ్య ప్రస్తుతం 1.6 లక్షలు దాటినట్లు అంచనా. ఇదే సమయంలో దేశంలోని 65 నగరాలకు హైదరాబాద్ నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో జాతీయ ప్రయాణికుల రద్దీ పెరిగింది. అమెరికాకు వెళ్లవలసిన వాళ్లు బెంగళూరు, ముంబయి, దిల్లీ నుంచి బయలుదేరుతున్నారు. దేశీయ ప్రయాణికులు కూడా 9.35 లక్షల నుంచి ఇంచుమించు 10 లక్షల వరకు చేరుకున్నట్లు అంచనా. మరో 2 నెలలు ఇలాగే... మరో 2 నెలల పాటు యాంటిజెన్ పరీక్షలు తప్పనిసరి కావచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ తుదిదశకు చేరుకుంది. జనవరి నాటికి అందరూ వ్యాక్సిన్లు తీసుకోవచ్చు. ఆ తరువాత యాంటిజెన్ తప్పనిసరి వంటి నిబంధనలు ఉండకపోవచ్చునని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
Covid Crisis : ‘శంషాబాద్’ నుంచి కేంద్రం అవుట్
హైదరాబాద్: పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల ఉపసంహారణ పట్ల కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. నలువైపులా విమర్శలు వస్తోన్నా... ముందుకే వెళ్తోంది. తాజాగా శంషాబాద్‌తో పాటు బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ఉన్న వాటాల విక్రయానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ఏఏఐ వాటా సిలిక్యాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, హైటెక్ సిటీ హైదరాబాద్‌లలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వాటాలు విక్రయించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఈ రెండు ఎయిర్‌పోర్టుల్లో ఏఏఐకి 13 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటాను కూడా అమ్మేసి ఎయిర్‌పోర్టుల నిర్వాహాణ వ్యాపారం నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటోంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తమ వాటా విలువను మదింపు పనుల్లో ఏఏఐ బిజీగా ఉంది. అప్పులు తీర్చేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు ఏఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో వాటాలు అమ్మకం ద్వారా నిధులు సమీకరించి అప్పులు తీర్చే పనిలో ఏఏఊ ఉంది. ముందుగా బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న వాటాలు విక్రయించి తర్వాత ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నిర్వహాణ నుంచి కూడా తప్పుకోనుంది. ప్రభుత్వ వాటా 13 శాతమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ గ్రూపు ప్రధాన వాటా దారుగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ కంపెనీ 63 శాతం వాటాతో మెజార్టీ షేర్ హోల్డర్‌గా ఉంది. కాగా మలేషియన్ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ సంస్థకి 11 శాతం వాటాలు ఉన్నాయి. మొత్తంగా 74 శాతం వాటాలు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. కేవలం ఏఏఐ 13 శాతం, తెలంగాణ ప్రభుత్వం 13 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. తాజాగా ఏఏఐ కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో శంషాబాద్‌లో ప్రభుత్వ వాటా కేవలం 13 శాతానికే పరిమితం కానుంది. బెంగళూరు విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి : రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
హైదరాబాద్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: స్వీటీ అనుష్క తన అభిమానులను సర్‌పప్రైజ్ చేశారు. కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్న దేవసేనా.. ఆకస్మాత్తుగా హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత స్వీటీ హైదరాబాద్‌లో కనిపించడంతో మీడియా తమ కెమెరాలకు పనిచెప్పారు. దీంతో అనుష్క ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నిశ్శబద్దం తర్వాత ఇప్పటి వరకు అనుష్క ఏ మూవీకి సంతకం చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వీటీ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే అనుష్కను వెండితెరపై చూసే అవకాశం ఉందంటూ ఖుషి అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. దీంతో పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన నటనతో మెప్పించిన అనుష్క.. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు. -
ఎయిర్పోర్ట్ సిటీలో ఎడ్యుపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిరొట్రోపొలిస్ లిమిటెడ్ (జీహెచ్‌ఏఎల్) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే సెయింట్‌మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ‘ఎడ్యుపోర్ట్’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. అన్ని వయసులు, నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులను ఇందులో అందుబాటులోకి తెస్తారు. ఓ నాలెడ్జ్ హబ్‌గా.. ఇక ఈ ఎడ్యుపోర్ట్ను ఓ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. లెర్నింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, ఇన్నొవేషన్ సెంటర్‌గా ఈ ఎడ్యుపోర్ట్లో బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఏవియేషన్ అకాడమీ, ఎయిరోస్పేస్ ఇంజ నీరింగ్, ఫ్లైట్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఇంజిన్ మెయింటెనెన్స్ వంటి వాటిలో బోధన, శిక్షణ ఉంటాయి. ఇక ఈ ఎడ్యుకేషన్ క్లస్టర్లో చిన్మయ విద్యాలయ, షూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ, ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్, సీఎఫ్ఎం సౌత్ ఏసియా ట్రైనింగ్ సెంటర్, ప్రాట్ అండ్ విట్నీ ఇండియా ట్రైనింగ్ సెంటర్ వంటి సంస్థలు భాగం పంచుకోనున్నాయి. మరోవైపు రెసిడెన్షియల్ అకడమిక్ సదుపాయం కలిగిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ సొసైటీతో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమని జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు బిజినెస్ మేనేజర్ జీబీఎస్ రాజు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు. ఎయిర్‌పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈవో అమన్‌కపూర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇది. ప్రపంచస్థాయి విద్య, పరిశోధనా సంస్థలను నెలకొల్పి, ఉన్నత విద్యను అందించే వ్యవస్థను నెలకొల్పాలన్న మా లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. -
ఎగిరొస్తున్న బంగారం!
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి ఏటా భారీ స్థాయిలో బంగారం అక్రమంగా ‘ఎగిరొస్తోంది’! పుత్తడి డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దుబాయ్‌లో కొన్న బంగారాన్ని విమానాల్లో తమ మనుషుల ద్వారా అక్రమంగా దేశంలోకి తెప్పిస్తున్నారు. దుబాయ్‌లో అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న ఈ వ్యాపారులు.. మన దేశంలో మాత్రం దిగుమతి సుంకం ఎగ్గొడుతున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని వక్రమార్గాల్లో తెప్పించుకుంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గణాంకాల ప్రకారం ఏటా 150 నుంచి 200 టన్నుల బంగారం దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తోంది. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో సీటు పైపుల్లో దాచిన 14 కిలోల బంగారం పట్టుబడిన కేసులో అక్రమార్కులు ఎగ్గొట్టజూసిన సుంకం విలువ సుమారు రూ. 70 లక్షలు కావడం గమనార్హం. హైదరాబాదే ఎందుకు..? వాస్తవానికి దేశంలోని మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణా చాలా తక్కువ. కొచ్చి, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో నిఘా అధికమైనప్పుడు మాత్రమే స్మగ్లర్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టును ఎన్నుకుంటున్నారు. డీఆర్ఐ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల కళ్లుగప్పేందుకే వారు హైదరాబాద్‌ను వాడుకుంటున్నారు. అయితే చాలా కేసుల్లో హైదరాబాద్ విమానాశ్రయంలో పట్టుబడుతున్న వారెవరూ హైదరాబాదీలు కాదు. స్థానిక డీఆర్ఐ అధికారులకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిలో భారతీయులతోపాటు విదేశీయులు కూడా పట్టుబడుతున్నా వారి వెనుక ఉన్న వ్యాపారులు మాత్రం తమ దందా సాగిస్తుండటం గమనార్హం. అయితే కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లకు ఏ రూపాల్లో బంగారం ఎలా వచి్చనా అంతా చేరుతున్నది మాత్రం ముంబైకే. రూపుమార్చి... ఏమార్చి డీఆర్ఐ అధికారులను బోల్తా కొట్టించి విమానాశ్రయం నుంచి బంగారాన్ని బయటకు తీసుకురావడం మాటలు కాదు. పుత్తడిని రహస్యంగా తరలించేందుకు కొందరు తమ శరీరాన్నే వాడుతున్నారు. కడుపులో, విగ్గుల్లో ఎవరికీ అనుమానం రాకుండా బంగారం తీసుకువస్తున్నారు. ఇంకొందరు బంగారాన్ని పౌడరులా మార్చి షాంపూలు, పేస్టుల్లో నింపి పట్టుకొస్తున్నారు. ఇంకొందరు బంగారం బిస్కెట్ల ఆచూకీని స్కానర్లు పట్టుకోకుండా వాటికి కార్బన్ ఫిలింలను అంటిస్తున్నారు. ఇంకొందరు విమానం సీట్ల పైపుల్లో, స్వీటు బాక్సుల్లో, లగేజీ హ్యాండిళ్లలోనూ తరలిస్తున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక స్కానర్ల కారణంగా ఎక్కువశాతం కేసుల్లో పట్టుబడుతున్నారు. ధరల్లో భారీ తేడా... దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ. 34 వేలు పలుకుతుండగా మన దేశంలో మాత్రం రూ. 39 వేలు పలుకుతోంది. అంటే 10 గ్రాముల ధరలో ఏకంగా రూ. 5 వేల వరకు వ్యత్యాసం ఉంటోంది. అదే కిలో బంగారానికి దాదాపు రూ. 5 లక్షల వరకు, ఒకేసారి పదుల కిలోల్లో తెచ్చుకుంటే రూ. కోట్లలో తేడా ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు అక్కడ భారీగా కొనుగోళ్లు జరిపి అక్రమంగా దేశంలోకి బంగారాన్ని తరలిస్తున్నారు. గణనీయంగా తగ్గిన కేసులు శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో క్రమంగా బంగారం స్మగ్లింగ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. 2017–18లో అత్యధికంగా 151 కేసులు నమోదవగా ఆ తరువాత ఏడాది 97, ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆధునిక బాడీ స్కానర్లు, డీఆర్ఐ, కస్టమ్స్ నిఘా, వేగుల సమాచారం ఆధారంగా శంషాబాద్ ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాకు అధికారులు చెప్పుకోదగ్గ స్థాయిలో ముకుతాడు వేయగలిగారు. ఈ ఏడాది గణనీయంగా తగ్గిన కేసులే ఇందుకు నిదర్శనం. అయితే పట్టుబడ్డ బంగారం మాత్రం భారీగా పెరిగింది. -
స్వీట్ బాక్సుల్లో రూ.1.48 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా రవాణా చేస్తున్న దుబాయ్ కరెన్సీని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కరెన్సీని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న మిఠాయి బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. అలాగే ఎయిరిండియా విమానం నుంచి దిగిన మరో ప్రయాణికుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న ఉస్మానియా బిస్కెట్‌బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. భారత కరెన్సీలో వీటి విలువ రూ.1,48,75,000 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరు ఈ మొత్తాన్ని దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్నందుకు వీరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రండి..పేకాట ఆడుకోండి!
కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సాగని ఆటలు! ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. కమీషన్ ఏజెంట్ల హవా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌ల కన్నా కర్ణాటకలోని క్లబ్‌లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్‌లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్‌ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్ ముట్టడం విశేషం. ఆట తప్ప అంతా ఫ్రీ పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్‌చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్‌లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ నుంచి క్లబ్ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్‌లకు లాభాల పంట పండిస్తోంది. -
టాప్ టెన్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్ 20లో కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్, కెనడాలోని బిల్లీ బిషప్ విమానాశ్రయాలు నిలిచాయి. ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. విమాన ప్రయాణికుల హక్కులు, పరిహారాలు, కేసులు, విమానాల ఆలస్యం, రద్దు తదితర అంశాలపై ఎయిర్‌హెల్ప్ సేవలందిస్తోంది. ఖతార్ రెండోసారి.. ఇక ఎయిర్‌లైన్స్ సేవల్లో కూడా ఖతార్ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిరోమెక్సికో, ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్ ఎయిర్‌లైన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో ర్యానైర్ ఎయిర్వేస్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, యూకేకు చెందిన ఈస్ట్ జెట్, థామస్ కుక్ టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. టాప్ టెన్ ఎయిర్‌పోర్టులు.. 1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - ఖతర్ 2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - జపాన్ 3. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - గ్రీస్ 4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ 5. డాన్సిక్ లెచ్ వాటెసా ఎయిర్‌పోర్టు - పోలెండ్ 6. మాస్కో షెరెమ్త్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - రష్యా 7. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్ 8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా 9. టెనెరిఫ్ నార్త్ ఎయిర్‌పోర్టు - స్పెయిన్ 10. విరాకోపోస్/కాంపినాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ -
ఎయిరిండియా ఉద్యోగి వద్ద భారీగా బంగారం
సాక్షి, శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఎయిరిండియా ఉద్యోగి హస్తం ఉందని గుర్తించారు. దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ఈ బంగారాన్ని ఎయిరిండియా ఉద్యోగి ద్వారా మరో ఇద్దరు వ్యక్తులు బయటికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ముందస్తు సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం ప్రాంగణంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి టేపులతో చుట్టి ఉన్న రెండు పార్శిళ్లను తెరిచి చూడగా అందులో 4.194 కేజీల బరువున్న 36 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.కోటీ 34 లక్షల వరకు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. వీటితోపాటు నిందితుల వద్ద పట్టుబడిన 3.60 లక్షల భారత కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎయిరిండియా ఉద్యోగితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు నెలల కిందట కూడా ఎయిరిండియాకు చెందిన ఓ ఉద్యోగి అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడంలో మధ్యవర్తిగా పనిచేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా పట్టుబడిన అక్రమ రవాణాలో కూడా ఎయిరిండియా ఉద్యోగి పాత్ర ఉండటం గమనార్హం. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఘనత: నంబర్ వన్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఒక ప్రకటనలో వెల్లడించింది. మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్ జనరల్ అంజెలా గిటెన్స్ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్ఐఏఎల్ సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. ఈ గౌరవంతో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినట్లయిందని ఆయన వివరించారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
హైజాక్ ముప్పు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు హైఅలర్ట్!
ముంబై, చెన్నై విమానాశ్రయాలకు కూడా.. న్యూఢిల్లీ: ఏకకాలంలో విమానాలను హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైదరాబాద్‌తోపాటు, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఏకకాలంలో హైజాక్‌లు చేస్తామని ఆరుగురు చర్చించుకుంటుండగా ఓ మహిళ విన్నదంటూ ఈమెయిల్ వచ్చింది. ఇది బూటకపు ఈమెయిల్ అయ్యే అవకాశముంది. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం. విమానం ఎక్కే సందర్భంలో భద్రతను ముమ్మరం చేశాం. అత్యవసర ప్రణాళికను అందుబాటులోకి తెచ్చి ఎయిర్‌పోర్టు బాధ్యులందరితో చర్చించాం’ అని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. ముంబై డీసీపీకి ఈ ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. దేశంలోని విమానాశ్రయాల భద్రతను సీఐఎస్ఎఫ్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపు ఈమెయిల్, నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం నేపథ్యంలో విమానాశ్రయాల్లో జాగిలాల దళాలను రంగంలోకి దించి.. సత్వర ప్రతిస్పందన బృందాలు కూడా అందుబాటులో ఉంచామని, విమానాయాన సంస్థలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచినప్పటికీ, ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగని సాధారణ వాతావరణమే ఎయిర్‌పోర్టులలో కొనసాగుతుందని ఓ సీనియర్ విమానాశ్రయ భద్రతాధికారి తెలిపారు. -
ఎయిర్ పోర్ట్‌లో ప్రీమియం సర్వీసులు ప్రారంభం
-
ఊహాగానాలకు చెక్ పెట్టిన జీఎమ్ఆర్
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటా అమ్మక వార్తలపై జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఖండించింది. కంట్రోలింగ్ వాటాను అమ్మడం లేదని వెల్లడించింది. కానీ ఫండ్స్ ను సేకరించడానికి అవకాశాలను అన్వేషిస్తున్నామని జీఎమ్ఆర్ ప్రకటించింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను జీఎమ్ఆర్ అమ్మేస్తుందని, సంప్రదింపులు అడ్వాన్స్ డ్ దశలో ఉన్నాయని ఊహాగానాలు జోరందుకోవడంతో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా స్పందించింది. 'హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కంట్రోలింగ్ వాటాను అమ్మే విషయాన్ని మేము పూర్తిగా కొట్టివేస్తున్నాం.. అయితే జీఎమ్ఆర్ గ్రూపుకు అవసరమైన ఫండ్స్ కోసం మాత్రం అవకాశాలను అన్వేషిస్తున్నాం..' అని జీఎమ్ఆర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, బీఎస్ఈకి నివేదించింది. 2016 మార్చి 31 త్రైమాసిక ముగింపుకు కంపెనీ రూ.953.5 కోట్ల ఏకీకృత నికర నష్టాలను నమోదుచేసింది. అంతకముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టం రూ.891.9 కోట్లగా ఉంది. నిర్వహణ పరంగా వచ్చిన మొత్తం ఆదాయాలు 29.12శాతం పెరిగి, రూ.3,708.37గా నమోదయ్యాయి. గతేడాది ఈ ఆదాయాలు రూ.2,872.01 కోట్లగా ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వాటాను అమ్మడం లేదని కంపెనీ బీఎస్ఈకి నివేదించిన తర్వాత ఉదయం ట్రేడింగ్ లో జీఎమ్ఆర్ ఇన్ ఫ్రా షేర్లు 1.49శాతం పెరిగాయి. -
విమానయానానికి జై
రెక్కలు విచ్చుకుంటున్న మధ్యతరగతి ♦ దేశ, విదేశీ ప్రయాణాలకు మొగ్గు ♦ ఆకట్టుకునే ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలు ♦ గణనీయంగా పెరుగుతున్న ఫ్లైట్ జర్నీలు.. ♦ ఆర్నెల్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 20 శాతం పెరుగుదల ♦ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ విమానాశ్రయం ♦ ప్రయాణికుల్లో ‘కోటి’ మార్కు దాటిన జీఎమ్మార్ ♦ తిరుపతి, విజయవాడ, విశాఖకు రెట్టింపైన రాకపోకలు విహారయాత్ర.. ఒకప్పుడు ఖరీదైన వ్యవహారం! కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.దేశీ, విదేశీ యాత్రలకు మధ్య తరగతి జనం కూడా జై కొట్టేస్తున్నారు! తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్ని చుట్టేసేందుకు ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటున్నారు. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఉద్యోగులకు వేల రూపాయల జీతాలు, సులువుగా అప్పులిచ్చే బ్యాంకులు అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి విమాన ప్రయాణాలు పెరిగిపోయాయి. విమానయాన సంస్థలూ బంపర్ ఆఫర్లతో వారిని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖ, గోవాలతో పాటు అమెరికా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాలకు సర్వీసులను రెట్టింపు చేశాయి. సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ, ఏపీల్లో ప్రయాణాలకు విమానయానం ఎంచుకుంటున్న వారి సంఖ్య గత ఆర్నెల్లలో 20 శాతం పెరిగింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర కాస్మోపాలిటన్ నగరాల్లో విమానయానాల సగటు 7.3 శాతం వృద్ధి మాత్రమే ఉండగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశ, విదేశాలను చుట్టి వస్తున్నారు. గడిచిన ఆర్నెల్లలో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో దక్షిణాదిన కొచ్చి (35.4 శాతం) తర్వాత అత్యధిక వృద్ధి రేటు హైదరాబాద్ విమానాశ్రయంలోనే (15.4 శాతం) నమోదైంది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన లెక్కల మేరకు దేశీయ ప్రయాణాల్లో 27.5 శాతంతో బెంగళూరు, 21.1 శాతంతో కొచ్చి, 20.4 శాతంతో హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆఫర్ల మీద ఆఫర్లు.. విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. తొంభై రోజుల ముందు రూ.2,001 చెల్లించి టికెట్ బుక్ చేసుకుంటే దేశంలో ఎక్కడికైనా విమానయానం చేయొ చ్చంటూ స్పైస్ జెట్ ఊరిస్తుంటే.. ‘‘మీ సెలవులను దుబాయ్‌లో ఎంజాయ్ చెయ్యండి.. హాలిడే సేవింగ్స్ అకౌంట్‌తో నెలకు కేవలం రూ.3,600 చెల్లిస్తే 8.25 శాతం వడ్డీ జత చేస్తాం. ఆ సొమ్ముతో దుబాయ్‌లో ఐదు రోజులు గడపవచ్చు. వచ్చే జనవరి ప్రయాణాలను ఇప్పుడే బుక్ చేస్తే 20 శాతం రాయితీ’ అంటూ ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘థామస్ కుక్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు అనేక ప్రైవేటు కంపెనీలు మొదలుకుని ప్రభుత్వ రంగ సంస్థలూ టార్గెట్లు దాటిన ఉద్యోగులకు ఫారెన్ ట్రిప్‌ను అందజేస్తున్నాయి. ‘కోటి’ దాటేసిన జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు కోటి ప్రయాణికుల మార్క్‌ను జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ దాటేసింది. 2014-15 వార్షిక సంవత్సరంలో ఈ మార్కును అధిగమించింది. మధ్యతరగతి కుటుంబాలు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగుల టూర్ ప్యాకేజీలతోపాటు ఉపాధి కోసం దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు, అమెరికా, బ్రిటన్ యూనివర్సిటీల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులు దేశంలో తెలంగాణ, ఏపీ నుంచే అత్యధికంగా ఉన్నారు. దీంతో జీఎంఆర్ ఎయిర్పోర్ట్ టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. ప్రస్తుతం ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను త్వరలో.. 2 కోట్ల ప్రయాణికులకు అనుగుణంగా విస్తరించనున్నారు. హైదరాబాద్ వైపు.. పక్క రాష్ట్రాల చూపు ప్రయాణికుల వృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉండటంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను అమాంతం పెంచేశాయి. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి 20 దేశాలకు, దేశంలో 35 ప్రధాన కేంద్రాలకు నేరుగా విమాన సర్వీసులు అందు బాటులోకి వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు మొదలుకుని సమీపంలోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రయాణికులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. తిరుపతి, విశాఖ, విజయవాడకు రద్దీ గతంతో పోలిస్తే తిరుపతి, విజయవాడ, విశాఖలకు ఫ్లైట్ జర్నీలు రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి 2014 తొలి ఆర్నెళ్లలో 1,11,169 మంది వెళ్లగా.. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో 1,70,869 మంది వెళ్లారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య 2014 తొలి ఆర్నెల్లలో 93,338 మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 1,85,246 మంది (98 శాతం వృద్ధి) పెరిగారు. విశాఖ-హైదరాబాద్ మధ్య గతేడాది 5,30,546 మంది వెళ్లగా.. ఈ ఏడాది 7,57,183 మంది రాకపోకలు (42 శాతం వృద్ధి) సాగించారు. రద్దీకి తగ్గట్టు విమాన సంస్థలూ తమ సర్వీసులను రెట్టింపు చేశాయి. అందరికీ అందుబాటులో చార్జీలు విమాన చార్జీలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ బుకింగ్‌తోపాటు వివిధ దేశాలు, పర్యాటక ప్రదేశాలపై నెట్లో సమాచారం దొరుకుతోంది. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఆదాయాలు విహార యాత్రల్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను ఇటీవల మరో నలుగురు మిత్రులతో కలసి థాయ్‌లాండ్ వెళ్లాను. విమాన టికెట్లు, తిండి, బస సహా అన్నింటికీ రూ.40 వేలు-రూ.50 వేలు ఖర్చవుతుంది. - సుకుమార్‌రెడ్డి, వ్యాపారవేత్త, హైదరాబాద్ టూర్‌కు మించిన అనుభూతి లేదు నేను అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు చూశాను. సింగపూర్ మహిళలకు చాలా సేఫ్ కంట్రీ. అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగవచ్చు. మన దేశంలో గోవా, కేరళ నాకు ఫేవరేట్. అలెప్పి బ్యాక్ వాటర్స్, గోవా బీచ్‌లు అద్బుతం. టూర్ చేయడానికి మించిన అనుభూతి లేదు. ప్రతి ఒక్కరూ కొత్త ప్రాంతాలను చూసి అనుభూతులు మూటగట్టుకోవాలి. - అర్పిత, గృహిణి, హైదరాబాద్ -
హైదారాబాద్‌లో మహిళ ఉగ్రవాది అరెస్ట్
-
'హైదరాబాద్‌లో మరో విమానాశ్రయం'
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. వచ్చే ఏడాది మెట్రోరైలు మొదటి దశ ప్రయాణాలు ప్రారంభం అవుతాయన్నారు. మెట్రోరైలు మార్గాన్ని మొత్తం 200 కిలోమీటర్ల వరకు విస్తరిస్తామని తెలిపారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలకు భాగస్వామ్యం పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. -
హైదరాబాద్, గోవాలకూ విస్తారా విమానాలు
టాటా గ్రూపు ప్రారంభించిన విస్తారా విమాన సర్వీసుల సేవలు త్వరలోనే హైదరాబాద్, గోవా ప్రాంత వాసులకూ అందుబాటులోకి రానున్నాయి. విమానాల సంఖ్యను కూడా విస్తారా పెంచుతోంది. ఫిబ్రవరి 20 నుంచి గోవా, మార్చి 1 నుంచి హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని విస్తారా తెలిపింది. తొలుత కేవలం వారానికి 68 విమానాలతోనే ఆపరేషన్లు ప్రారంభించిన ఈ సంస్థ.. మార్చి నాటికి వారానికి 164 విమానాలు నడపనుంది. ప్రారంభం నుంచే తమకు మంచి ఆదరణ లభిస్తోందని, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-గోవా విమానాలను ప్రారంభిస్తున్నామని విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫీ టీక్ యో తెలిపారు. ఈ రెండు నగరాలకు ప్రయాణికులు బాగా తిరుగుతారని, కొత్త విమానాల రాకతో దేశీయ విమానయాన రంగంలో తాము పటిష్ఠమైన స్థానంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
రాజీవ్,ఎన్.టి.ఆర్.పేర్లు కొనసాగుతాయి
-
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ!.
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందడుగుగా నూతన పౌర విమానయాన పాలసీ ముసాయిదాను రూపొందించినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. సోమవారం ఇక్కడి రాజీవ్ భవన్లో ఆయన ముసాయిదా పత్రాన్ని విడుదల చేశారు. ‘కొత్త పౌర విమానయాన పాలసీ వచ్చే జనవరి నుంచి అమలు కాబోతోంది’ అని ప్రకటించారు. ప్రజలు, విమానయాన రంగంతో సంబంధం ఉన్న వారు 3 వారాల్లో తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని చెప్పారు. తర్వాత 6 వారాల్లో విమానయాన రంగ నిపుణుల బృందాలు ఈ రంగంతో ముడిపడి ఉన్నవారితో సంప్రదింపులు జరిపి తుది పాలసీని రూపొందిస్తాయని తెలిపారు. ఈ పత్రా న్ని విమానయాన శాఖ వెబ్సైట్లో పొందుపరిచినట్టు వివరించారు. ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలను ఆ శాఖ కార్యదర్శి సోమసుందరన్తో కలిసి మీడియాకు వివరించారు. ‘విమానాశ్రయాలను మల్టీ మోడల్ హబ్స్‌గా అభివృద్ధి చేయాల్సి ఉంది. రైలు, మెట్రో, బస్సు, ట్రక్ రవాణా వసతులను విమానాశ్రయాలకు అనుసంధానించడం, వసతి సౌకర్యం ఏర్పాటుచేయడం ద్వారా ఈ మల్టీమోడల్ హబ్‌లను ఏర్పాటుచేయవచ్చు..’ అని పూసపాటి వివరించారు. విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలోనే వీటితో ముడివడి ఉన్న ఉత్పత్తి రంగం, వాణిజ్య రంగం, పర్యాటకం, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వీటిని చేపట్టాల్సి ఉందన్నారు. ఆరు మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాల్లోని విమానాశ్రయాలను భారీ అంతర్జాతీయ హబ్‌లుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రయాణాలకు ఇవి ప్రధాన విమానాశ్రయాలుగా మారుతాయన్నారు. అలాగే ప్రాంతీయ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేస్తూ పౌర విమాన యాన సేవలు పెంపొందిస్తామని వివరించారు. విమాన టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధరను హేతుబద్ధీకరించేందుకు వీలుగా ఈ ముసాయిదా పత్రం దోహదపడుతుందన్నారు. అత్యధికంగా విధిస్తున్న పన్నుల కారణంగా ఏటీఎఫ్ ధర ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో 40 నుంచి 45 శాతం అధికంగా ఉందన్నారు. అందువల్ల ఆర్థిక శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి దీనిని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. విజయవాడలో భూసేకరణ జరిగితే..: విజయవాడ ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ జరగాల్సి ఉందని తెలుగు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘సేకరణ అయిన తరువాత పనులు ప్రారంభమవుతాయి. టర్మినల్ చిన్నదిగా ఉంది. పార్కింగ్ ప్లేస్ చిన్నది. భోపాల్ దగ్గర 13 విమానాలు నిలిపేంత స్థలం ఉంది. అలా అయినా ఉండాలి. విజయవాడలో మూడే నిలుపుకోవచ్చు’ అని చెప్పారు. విశాఖ, తిరుపతిలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ విషయంలో... పీపీపీ విధానంలో తెలంగాణ రాష్ట్రంలో ఏవైనా విమానాశ్రయాలు వస్తాయా? అని ప్రశ్నించగా ‘రావొచ్చు.. ఏదైనా అడగాలి కదా.. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు చేయడానికేముంది?..’ అంటూ ప్రశ్నించారు. నిజామాబాద్, వరంగల్ల్లో ఎయిర్‌పోర్టులు, బేగంపేటలో అకాడమీ అడిగారు కదా అని ప్రశ్నించగా ‘బేగంపేటలో అకాడమీ ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతోంది. విస్తరణ చేసుకోవాలనుకుంటే ఆ రాష్ట్రం చేతుల్లోనే ఉంది..’ అని పేర్కొన్నారు. హజ్ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు రంగం చేతుల్లో పెట్టేస్తున్నారన్న ప్రశ్నకు.. మెరుగైన పనితీరు లేకుండానే మోయడం మంచిది కాదు కదా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, పవన్ హన్స్‌ల లిస్టింగ్ సంస్థాగత సంస్కరణల్లో భాగంగా ఎయిర్ ఇండియా భవిష్యత్తుపై రోడ్ మ్యాప్ రూపొందించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు అశోక్ గజపతి వివరించారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను కార్పొరేటీకరిస్తామని, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయిస్తామని.. ఇది మెరుగైన పనితీరుకు, పారదర్శకతకు దోహదం చేస్తుందని వివరించారు. అలాగే పవన్ హన్స్‌ను కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయిస్తామని తెలిపారు. పనితీరులో సమర్థత, పారదర్శకత పెంచేందుకే మినీ రత్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), పవన్ హన్స్ హెలికాప్టర్స్ (పీహెచ్హెచ్ఎల్) సంస్థలను లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. అయితే, లిస్టింగ్ ఎప్పుడు చేసేదీ, ఎంత శాతం వాటాలు విక్రయించేదీ వంటి విషయాలపై నిర్దిష్టంగా నిర్ణయం ఏమీ తీసుకోలేదని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఎయిరిండియా కూడా లిస్టయితే సంతోషమే.. ఏఏఐ, పీహెచ్హెచ్ఎల్ తరహాలోనే ఎయిరిండియాను కూడా స్టాక్‌మార్కెట్లలో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అలా చేయగలిగితే అందరికన్నా ఎక్కువగా సంతోషించేది తానేనని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. సంస్థ భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు అంతర్గతంగా నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎయిరిండియాను గట్టెక్కించడం అవసరమన్నారు. కంపెనీని ప్రైవేటీకరించాలని కొన్ని వర్గాలు, కూడదంటూ మరికొన్ని వర్గాలు, ప్రొఫెషనల్స్ చేతిలో పెట్టాలని ఇంకొన్ని వర్గాలు అంటున్నాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం సమస్యల తుట్టెను కదపకూడదని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భంలో అన్ని అవకాశాలను పరిశీలించి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏది ఏమైనప్పటికీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే వాటాల విక్రయమా లేక ప్రొఫెషనల్స్ చేతికి అప్పగించడమా అన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు చెప్పారు. పీహెచ్హెచ్ఎల్ ఇప్పటికే రిజిస్టర్డ్ కంపెనీ అయినందున లిస్టింగ్ ప్రక్రియకు ఆరు నెలల కాలం సరిపోగలదని ఆయన పేర్కొన్నారు. దీనిపై డిజిన్వెస్ట్‌మెంట్ విభాగంతో కలిసి పనిచేస్తామన్నారు. -
హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా?
హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయంపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయం తరహాలో నగరంలోని మరో రెండుదిక్కుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులు అవసరమని సీఎం ఇటీవలి సమావేశంలో అధికారులతో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ‘రాయితీల ఒప్పందం’ మేరకైతే నగరంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోం ది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీఎంఆర్ మధ్య త్రిపక్ష ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే జీఎంఆర్ నుంచి ఎన్వోసీ పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త వాటి నిర్మాణం కుదరదు. శామీర్‌పేట, ఘట్కేసర్ వద్ద రెండు విమానాశ్రయాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు జీఎంఆర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడం కష్టమే. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం స్వాధీనం
-
ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం
-
ఎయిర్ పోర్ట్‌లో 2 కిలోల బంగారం స్వాధీనం
-
భారీ జీతం.. మత్తెక్కించిన మద్యం.. ఆపై వీరంగం
విక్రమ్ (శంషాబాద్): అమ్మానాన్నలకు ఒక్కర్తే కూతురు. అల్లారుముద్దుగా పెంచి మంచి చదువు చదివించారు. బాగా చదవడంతో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అది కూడా అలాంటి, ఇలాంటి ఉద్యోగం కాదు. నెలకు దాదాపు లక్ష రూపాయల జీతం తెచ్చిపెడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం. హైటెమ్ సిటీలో ఉద్యోగం చేసుకుంటోంది. ఇంకా పెళ్లి కాలేదు. జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తోంది. ఆమె పేరు దీప్తి (25). కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు విశాఖపట్నం ప్రాంతానికే చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన మేనమామ కొడుకులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో మద్యం తాగారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత శంషాబాద్‌లో జరుగుతున్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దాడిలో ఎవరికీ గాయాలు కాకపోవడం వల్ల నాన్ కాగ్నిజబుల్ కేసుగా నమోదు చేశారు.