హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఘనత: నంబర్‌ వన్‌ | Hyderabad Airport ranks No.1 in service quality | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఘనత

Published Wed, Oct 18 2017 3:40 PM | Last Updated on Wed, Oct 18 2017 5:51 PM

RGIA

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్‌ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌(జీహెచ్‌ఐఏఎల్‌) ఒక ప్రకటనలో వెల్లడించింది.

మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్‌ జనరల్‌ అంజెలా గిటెన్స్‌ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. ఈ గౌరవంతో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినట్లయిందని ఆయన వివరించారు. బ్రాండ్‌ హైదరాబాద్‌ ఇమేజ్‌ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement