మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ ప్రీమియర్ కోసం అక్కడికి వెళ్లిన రామ్‌చరణ్, ఉపాసన ఆ తర్వాత ఆఫ్రికాకు పయనం అయ్యారు. గురువారం వెకేషన్ నుంచి రామ్‌చరణ్ దంపతులు హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. వారి వెంట పెట్‌డాగ్ రైమ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామ్‌చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందున్న సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.
Mega Power Star @alwaysRamCharan is back in India from vacation with his wife @UpasanaKonidela💞🥰#RamCharan #UpasanaKonidela #Couplegoals #ShreyasMedia pic.twitter.com/C5LgB2SSI1
— Shreyas Media (@shreyasgroup) November 3, 2022
Comments
Please login to add a commentAdd a comment