Ram Charan And Upasana Flew To Maldives For Holiday - Sakshi

Ram Charan -Upasana : మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్‌,ఉపాసన

Apr 9 2023 7:15 AM | Updated on Apr 9 2023 11:31 AM

Ram Charan And Upasana Flew To Maldives For Holiday - Sakshi

హీరో రామ్‌చరణ్‌ విహారయాత్ర కొనసాగుతూనే ఉంది. తన భార్య ఉపాసనతో కలిసి రామ్‌చరణ్‌ ఇటీవల దుబాయ్‌ వెళ్లారు. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో అక్కడ ఉపాసన బేబీ షవర్‌ సెలబ్రేషన్స్‌ ముగించుకుని ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. తాజాగా రామ్‌చరణ్, ఉపాసన కలిసి శనివారం మాల్దీవులకు పయనమయ్యారు. ఈ షార్ట్‌ వెకేషన్‌ను ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన తర్వాత ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌లో పాల్గొంటారు చరణ్‌.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, ఎస్‌జే సూర్య, జయరాం, సునీల్, నవీన్‌చంద్ర కీ రోల్స్‌ చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలపై త్వరలో ఓ స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement