హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా? | two more airports come to hyderabad is possible | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా?

Published Fri, Jul 11 2014 6:25 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా? - Sakshi

హైదరాబాద్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టులు సాధ్యమేనా?

హైదరాబాద్: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయంపై తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుత శంషాబాద్ విమానాశ్రయం తరహాలో నగరంలోని మరో రెండుదిక్కుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టులు అవసరమని సీఎం ఇటీవలి సమావేశంలో అధికారులతో పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ‘రాయితీల ఒప్పందం’ మేరకైతే నగరంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోం ది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీఎంఆర్ మధ్య త్రిపక్ష ఒప్పందం కుదిరింది.

దీని ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి చుట్టూ 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే జీఎంఆర్ నుంచి ఎన్‌వోసీ పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కొత్త వాటి నిర్మాణం కుదరదు. శామీర్‌పేట, ఘట్‌కేసర్ వద్ద రెండు విమానాశ్రయాలను ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఈ రెండు విమానాశ్రయాల ఏర్పాటుకు జీఎంఆర్ నిరభ్యంతర పత్రం జారీ చేయడం కష్టమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement