Samantha Fancy Chappals That Come With an Insane Price Tag - Sakshi
Sakshi News home page

Samantha: హైదరాబాద్‌కు సమంత.. వాటి ధర అన్ని లక్షలా..!

Published Mon, May 29 2023 9:07 PM | Last Updated on Tue, May 30 2023 2:09 PM

Samantha fancy chappals that come with an insane price tag  - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఇండియా వర్షన్ సిటాడెల్‌లో కనిపించనుంది. సిటాడెల్ చివరి షెడ్యూల్ ముగించుకున్న సమంత తాజాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిసింది. 

(ఇది చదవండి: ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్)

అయితే సమంత కాస్తా డిఫరెంట్‌ లుక్‌లో విమానాశ్రయంలో కనిపించింది. చాలా విభిన్నమైన దుస్తుల్లో వచ్చిన సమంత ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన చెప్పులపైనే నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సమంత చాలా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు వేసుకుందని.. వాటి ధరపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. సమంత చెప్పుల విలువ దాదాపు రూ.2,58,097గా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇవి చాలా సౌకర్యవంతంగా, తక్షణ వెచ్చదనం ఇస్తాయని.. అంతే కాకుండా ఈ చెప్పుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా లుక్‌లో సమంత చాలా ఫర్‌ఫెక్ట్‌గా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement