Chappals
-
నిజంగానే..చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాడు! ఇంట్రస్టింగ్ స్టోరీ
చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు. తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె -
చెప్పులు పోయాయని పోలీసులకు కాల్ చేసి...
యశవంతపుర: ఎక్కడైనా చెప్పులు పోతే, కొత్తవి కొనుక్కుంటారు. కానీ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. కారు స్ట్రీట్‌లోని బాలంభట్ట హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి చెప్పులు పోయాయి. దీంతో అతడు పోలీసు సహయవాణికి ఫోన్ చేశాడు. దగ్గరలో గస్తీలో ఉన్న హొయ్సళ పోలీసులు వచ్చి వెతికినా చెప్పులు దొరకలేదు. దీంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని అతనికి సూచించారు. మరో ఘటనలో.. కారు, లారీ ఢీ.. ముగ్గురి మృతి కంప్లి: కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద లారీ, కారు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కంప్లి పట్టణానికి చెందిన శరత్(35), ఎమ్మిగనూరుకు చెందిన శ్రీరామ్(28) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న శరణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శరణ(28) కూడా మృతి చెందాడు. ఈ ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి Prostitution Racket Busted: వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని -
జీఎస్టీ దెబ్బ: కనుమరుగవుతున్న హవాయి చెప్పులు..
పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ధరించే హవాయి చెప్పులు జీఎస్టీ దెబ్బకు కనుమరుగవుతున్నాయి. పెరిగిన జీఎస్టీతో వందలాది తయారీ కేంద్రాలు మూతపడుతున్నాయి. జీఎస్టీ పెంపు కారణంగా దాదాపు 325 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు మూతపడ్డాయని జలంధర్ రబ్బర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తాజాగా తెలిపింది. ఏడేళ్ల క్రితం ఒక్క జలంధర్‌లోనే 400 హవాయి చప్పల్ తయారీ యూనిట్లు ఎంఎస్ఎంఈ పరిశ్రమలుగా ఉండేవి. జీఎస్టీని పెంచడం, అదే సమయంలో ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో వీటిలో దాదాపు 325 యూనిట్లు మూతపడ్డాయని అసోసియేషన్ పేర్కొంటోంది. జీఎస్టీ పెంపే కారణం హవాయి చెప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడమే యూనిట్ల మూసివేతకు కారణమని ఆయా పారిశ్రమల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. జలంధర్ రబ్బర్ గూడ్స్ తయారీదారుల సంఘం కార్యదర్శి రాకేష్ బెహల్ మాట్లాడుతూ.. ‘2017 జూలై 1న జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న పాదరక్షలు, వస్త్రాలను 5 శాతం జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచాలని నిర్ణయించారు. ఆ తరువాత జీఎస్టీ 7 శాతం పెంచి 12 శాతం శ్లాబ్ కిందకు చేర్చారు. దీని ప్రభావం దేశవ్యాప్తంగా హవాయి చప్పల డిమాండ్, సరఫరాపై తీవ్రంగా పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఈ ఉత్పత్తులపై వ్యాట్ రేటు చాలా రాష్ట్రాల్లో సున్నా లేదా కొన్ని రాష్ట్రాల్లో 0.5 శాతం ఉండేది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ధరించే తక్కువ ధర హవాయి చప్పలపై 12 శాతం జీఎస్టీ అస్సలు సమర్థనీయం కాదని, వెంటిలేటర్‌పై ఉన్న హవాయి చెప్పుల పరిశ్రమను బతికించాలని పరిశ్రమల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదీ చదవండి: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
వాళ్లంతే! చెప్పులేసుకోరు.. ఆ ఊరికి కలెక్టర్ వెళ్లినా అదే పరిస్థితి..
సాక్షి, తిరుపతి: ఇంట్లో సైతం పాదరక్షలు ధరించి తిరుగుతున్న ఈ రోజుల్లో.. ఆ ఊరి వాసులు ఎక్కడికి వెళ్లినా చెప్పులు ధరించరు. ఆకలేస్తే ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటున్న ప్రస్తుత తరంలో.. ఆ ఊరి వాళ్లు బయటి ప్రాంతాలకు వెళితే మంచినీళ్లు కూడా ముట్టరు. ఆచారాలు, సంప్రదాయాలకు విలువనిచ్చే ఆ గ్రామం పేరు ‘వేమన ఇండ్లు’. తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో ఉంది. వేమన ఇండ్లు గ్రామంలో ఉంటున్న వారంతా ‘పాలవేకరి’ కులస్తులుగా, దొరవార్లుగా చెప్పుకుంటున్నారు. వీరంతా బీసీ జాబితాలో ఉన్నారు. వీరి ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి. గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజుకో కుటుంబం పూజలు చేస్తుంది. గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి, గంగమ్మను కూడా పూజిస్తారు. విలువలు.. కట్టుబాట్లకు పెద్దపీట ఈ ఊళ్లో ఉన్న అందరూ ఒకే వంశం వారు. తమ కులం వారితో మాత్రమే వీరు సంబంధాలు కలుపుకుంటున్నారు. వేమన ఇండ్లు గ్రామానికి ఎవరొచి్చనా.. ఊరి బయటే చెప్పులు విడిచి గ్రామంలోకి అడుగుపెట్టాలి. ఇంట్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా స్నానం చేయాల్సిందే. లేదంటే ఇంటి బయటే ఉండాలి. కలెక్టర్ అయినా గ్రామ ఆచార సంప్రదాయాలు పాటించాల్సిందేనని స్థానికులు తేల్చిచెబుతున్నారు. ఈ గ్రామస్తులు ఎన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా చెప్పులు మాత్రం ధరించరు. శ్రీ వెంకటేశ్వరుడిపై భక్తితో పాదరక్షలు ధరించడం మానేశామని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే వారు సైతం చెప్పులు లేకుండానే వెళ్లివస్తారు. ఒకరిద్దరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా గ్రామ ఆచార సంప్రదాయాలను తప్పక పాటిస్తున్నారు. బయట తిండి ముట్టరు వేమన ఇండ్లకు చెందిన వారు ఏదైనా పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే.. బయట తిండి ముట్టరు. మంచినీరు కూడా తీసుకోరు. ఇంటి నుంచే క్యారియర్‌లో భోజనం, బాటిల్లో మంచినీరు తీసుకెళ్తారు. విద్యార్థులు స్కూల్లో పెట్టే మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి నుంచి ఇంటికి వచ్చినా.. స్నానం చేసి బట్టలు మార్చుకోనిదే గడప తొక్కరు. అది కూడా చన్నీళ్ల స్నానమే. చిన్నారులైనా చన్నీటితోనే స్నానం చేయిస్తారు. బంధువులు ఇంటికి వచ్చినా.. గ్రామంలో ఈ ఆచార సంప్రదాయాలు పాటించాల్సిందే. చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు ఆ వారం రోజులు మహిళలు ఊరి బయటే నెలసరి మహిళల కోసం ఊరికి అవతల ప్రత్యేకంగా రెండు పక్కా గృహాలు నిర్మించారు. పీరియడ్స్ వచ్చిన మహిళలు వారం రోజులపాటు వాటిలోనే ఉండాలి. అప్పటివరకు ఇంటి యజమానే వంట వార్పు చేస్తారు. వంటచేసి భార్యకు తీసుకెళ్లి ఇచ్చి వచ్చేస్తారు. ఆస్పత్రుల మొహం ముఖం చూడలేదు గ్రామస్తులకు జబ్బు చేసినా.. చివరకు పాము కరచినా ఆస్పత్రికి వెళ్లరు. పాము కరిస్తే పుట్టచుట్టూ తిరిగితే నయం అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. గర్భిణులు సైతం ఆస్పత్రిలకు వెళ్లిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలోనూ వీరెవరూ ఆసుపత్రికి వెళ్లలేదు. కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే పక్కా గృహాలొస్తున్నాయ్ నాలుగేళ్లుగా ఆ గ్రామస్తులకు రేషన్ సరఫరా చేస్తున్నాను. గతంలో ఈ ఊర్లో పక్కా గృహాలే లేవు. తడికలు ఏర్పాటు చేసుకుని దానిపై పట్టా కప్పుకుని జీవించేవారు. టీడీపీ హయాంలో ఒకే ఒక్క ఇల్లు మంజూరు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం 12 ఇల్లు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చింది. – బాబురెడ్డి, రేషన్ డీలర్ -
ఎయిర్‌పోర్ట్‌లో సమంత.. అందరి దృష్టి వాటిపైనే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఇండియా వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. సిటాడెల్ చివరి షెడ్యూల్ ముగించుకున్న సమంత తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిసింది. (ఇది చదవండి: ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్) అయితే సమంత కాస్తా డిఫరెంట్ లుక్‌లో విమానాశ్రయంలో కనిపించింది. చాలా విభిన్నమైన దుస్తుల్లో వచ్చిన సమంత ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన చెప్పులపైనే నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సమంత చాలా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు వేసుకుందని.. వాటి ధరపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. సమంత చెప్పుల విలువ దాదాపు రూ.2,58,097గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి చాలా సౌకర్యవంతంగా, తక్షణ వెచ్చదనం ఇస్తాయని.. అంతే కాకుండా ఈ చెప్పుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా లుక్‌లో సమంత చాలా ఫర్ఫెక్ట్గా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) -
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ ఇవ్వలేదని ఆక్రోశంతో పౌర కార్మికుడు పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం వేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ పౌర కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్ప పీడీఓ శివరాజ్‌ను దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ అడిగాడు. అయితే పీడీఓ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కృష్ణప్ప సోమవారం రాత్రి కార్యాలయానికి వెళ్లి చెప్పుల హారం వేసాడు. తాలూకా పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ పౌర కార్మికులతో సమావేశమై వారికి సర్ది చెప్పారు. అనంతరం చెప్పుల హారాన్ని తొలగించారు. -
పంచాయతీ అధ్యక్షురాలు వీరంగం.. అందరూ చూస్తుండగా చెప్పుతీసుకుని..
రాయచూరు రూరల్(బెంగళూరు): పారిశుధ్యం సరిగా లేదని ఫిర్యాదు చేసినందుకు మస్కి తాలూకా తోరణదిన్ని పంచాయతీ అధ్యక్షురాలు చందమ్మ వీరంగం చేసి గ్రామస్తుడిపై దాడికి యత్నించింది. వివరాలు.. కాలనీలో చెత్త సేకరించే వాహనానికి డ్రైవర్‌గా పంచాయతీ అధ్యక్షురాలు తన బంధువును నియమించింది. ఇతను చెత్త సేకరించడం లేదని, దీంతో కాలనీలో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయని గ్రామానికి చెందిన బసవరాజ్ గురువారం అధ్యక్షురాలు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆమె ఒక్కసారిగా చెప్పు తీసుకొని అతనిపై దాడికి యత్నించింది. స్థానికులు అడ్డుకొని సర్దిచెప్పారు. చదవండి: ‘మహా’ సంక్షోభం: షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
ఇదేం హోలీ సెలబ్రేషన్స్ రా నాయనా!.. నవ్వులు పూయిస్తున్న వీడియో
హోలీ ఎలా ఆడుతారు? అదేం ప్రశ్న అంటారా? రకరకాల రంగులు, గుడ్లు, టొమాటోలు, పూలు, మన్ను బురద నీళ్లు.. ఓ ఇలా చెప్తూ పోతే బోలెడు. మన దేశంలో ఒక్కోచోట ఒక్కో పేరుతో మాత్రమే కాదు.. రకరకాల పద్ధతుల్లోనూ చేసుకుంటారు జనాలు. కానీ, ఇప్పుడు చెప్పబోయే తరహా హోలీ సెలబ్రేషన్స్ మాత్రం ఇంతకు ముందు చూసి ఉండరు. హోలీకి ఓ రోజు ముందుగానే.. అంటే మార్చి 17వ తేదీన చోట్టి హోలీ పేరుతో ఓ వీడియో ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యింది. గులాల్‌తో నిండిపోయిన ఓ వాటర్ పూల్‌లో.. రంగులకు బదులు చెప్పులు విసురుతూ కనిపించారు కొందరు. Chappal Maar Holi చాలా సందడిగా జరగ్గా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది. #WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7 — ANI_HindiNews (@AHindinews) March 17, 2022 బిహార్ రాజధాని పాట్నాలోని ఓ వాటర్ పార్క్‌లో ఈ సరదా వేడుకలు జరిగాయి. ఇంటర్నెట్లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కామెంట్లు అంతే హిలేరియస్‌గా వస్తున్నాయి. కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా గ్రాండ్‌గా హోలీ వేడుకలకు ఛాన్స్ దొరికింది. ఈ నేపథ్యంలో ఇలా కొందరు యువకులు.. చెప్పుల హోలీతో సరదా వాతావరణం క్రియేట్ చేశారు. స్పెయిన్కేమో టొమాటోలు.. మనకేమో ఇలా చెప్పులన్నమాట!. -
బిగ్‌బాస్: చెప్పుతో కొట్టింది..
బుల్లితెరపై గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రియాలిటీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ 13 హిందీ సీజన్లో అయితే ఈ గొడవలకు లెక్కే లేదు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. వీకెండ్లో వారి తగాదాలకు పరిష్కరించడానికే సమయం సరిపోతుంది. అలా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బిగ్‌బాస్ షోలోని నిన్నటి ఎపిసోడ్లో పార్టిసిపెంట్లకు మళ్లీ లొల్లయింది. కానీ ఈ సారి ఏకంగా ఓ పార్టిసిపెంట్ తోటి కంటెస్టెంట్‌ను చెప్పు తీసుకుని కొట్టడం వివాదాస్పదమయింది. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విశాల్ ఆదిత్య, మధురిమా తులి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఉన్న వీరిద్దరు తగవులాడుకున్నారు. విశాల్ కోపంతో మధురిమను నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఆవేశానికి లోనైన మధురిమ విశాల్‌కు చెప్పుదెబ్బ రుచి చూపించింది. తన చెప్పుతో కొట్టి అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరినీ కన్ఫెషన్ రూంకు పిలిచాడు. తొలుత విశాల్ మాట్లాడుతూ శారీరక హింసకు పాల్పడేవాళ్లను ఇంట్లో ఇనుమతిస్తారా? అని ప్రశ్నించాడు. అనంతరం మధురిమతో కలిసి తాను ఈ ఇంట్లో ఉండలేనని తేల్చి చెప్పాడు. మధురిమ మాట్లాడుతూ.. చెప్పుతో కొట్టడం తప్పేనని విశాల్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఈ గొడవలో అతని తప్పు కూడా ఉందని ఎత్తిచూపింది. ఈ గొడవలో ఇరువైపులా తప్పు ఉండటంతో బిగ్‌బాస్ ఇద్దరినీ మందలించాడు. శారీరక హింసకు పాల్పడినందుకుగానూ మధురిమను రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి వివాదాస్పద వక్త -
తినే మ్యాగీ కాళ్ల కింద; నలిగిపోయిందా?
రెండు నిమిషాల్లో స్నాక్స్ సిద్ధం కావాలంటే మ్యాగీ ఉండాల్సిందే. నోరూరించే మ్యాగీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లదాకా అందరికీ ఇష్టమే. తాజాగా మ్యాగీ వార్తల్లోకెక్కింది. ఏంటి? మ్యాగీలో మళ్లీ ఏదైనా కెమికల్స్ కలుపుతున్నారా అని ఆందోళన చెందకండి. అదేమీ లేదు, ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ కొత్త సంవత్సరం కలెక్షన్స్ అంటూ.. నూడిల్స్‌తో పాటు ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అదే దీనంతటికీ కారణమైంది. ఇక ఈ ఫొటోలో ఓ యువతి మ్యాగీ చెప్పులను ధరించింది. దాని పక్కన మ్యాగీ ఫొటో కూడా ఉండటంతో అది మ్యాగీతో చేసిందేనని అందరూ భావించారు. ‘తినే మ్యాగీ కాళ్లకింద నలిగిపోయిందే..’ అని తెగ ఫీలయ్యారు. కానీ అసలు విషయం తెలిశాక నవ్వకుండా ఉండలేకపోయారు. ఆ యువతి ధరించిన చెప్పులు మ్యాగీ డిజైన్‌ను పోలి ఉన్నాయి తప్పితే మ్యాగీతో తయారు చేసినవి కాదు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బాగుందంటూ నవ్వుకుంటుంటే. ఏడ్చినట్టు ఉంది నీ బ్రాండ్ అని తిట్టిపోస్తున్నారు. ‘వేడినీళ్లు తగిలితే చెప్పులు దెబ్బతినవు కదా? అని కొందరు చమత్కార కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చెప్పులు సొంతం చేసుకోవాలంటే సుమారు రూ.లక్ష వెచ్చించాల్సిందే. -
‘చెప్పులకు కాపలాగా ఇద్దరు గన్మెన్లు’
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వస్తువులను వినియోగించాలని ఆశపడటం సహజమే. సంపన్నులే కాకుండా మధ్యతరగతి జీవులు సైతం నెలనెలా వాయిదా పద్ధతుల్లో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఊహించిన ధరలతో మార్కెట్లోకి వచ్చే వస్తువులు.. అత్యంత పేలవంగా ఉంటే ఎలాంటి కామెంట్లు వచ్చిపడతాయో..! ఈ చెప్పుల జత గురించి చదివి తెలుసుకుందాం.. వాలెంటినో, హవాయినస్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఓ చెప్పుల జత ధర అక్షరాల రూ.45 వేలు. ధర ఇంత భారీగా ఉంటే ఆ చెప్పులు మరెంత సౌకర్యవంతంగా ఉంటాయోననీ ఊహించుకోకండి. అదంతా వట్టి ట్రాష్ అని ఈ ‘ఖరీదైన’ చెప్పుల జతపై కామెంట్లు పేలుతున్నాయి. అమెజాన్ వెబ్సైట్ ద్వారా వీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్న పలువురు అసహనంతో కూడిన జోకులు విసురుతున్నారు. ఫన్నీ కామెంట్లు.. ‘మీకెవరి మీదనైనా పగ తీర్చుకోవాలి అనుకుంటే వారి వివరాలతో క్యాష్ ఆన్ డెలివరీపై చెప్పులను ఆర్డర్ చేయండి. 45 వేలు కట్టలేక వాళ్లు కళ్లు తేలేస్తారు. ఇక పీడ విరగడవుతుంది. మళ్లీ మీ జోలికి రారు. ఖరీదైన చెప్పులు కాబట్టి గుళ్లూ, గోపురాలకు వెళ్లినప్పుడు కాపలాగా ఇద్దరు సాయుధులను వాటికి కాపలాగా పెడుతున్నాను. మా బాస్ ఆఫీస్‌కి ఎప్పుడూ ఆలస్యంగా వస్తావ్ అంటూ రొద పెడతాడు. ఇప్పుడు ఈ చెప్పుల కారణంగా ఎక్కడా నిముషం కూడా ఆగకుండా పరుగెత్తుకుంటూ ఆఫీస్‌కు చేరుతున్నాను’ ఇది ఓ వినియోగదారుడి వ్యథ. ఇక.. ఈ చెప్పులు కొనేందుకు బైక్‌ను అమ్ముకున్నానంటూ ఒకరు.. మారుతి 800 అమ్ముకున్నానని మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ చెప్పినట్టు చెప్పులు గొప్పగా ఏం లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి మామూలు చెప్పులేననీ, కాకపోతే కాస్త సౌకర్యవంతంగా ఉన్నాయని అంటున్నారు. ఆర్మీ ఉత్పత్తుల్లో వాడే మెటీరియల్, ఫుచియా రబ్బర్‌తో వీటిని తయారు చేశారు. ఒక వ్యక్తి మూడు జతలు మాత్రమే ఆర్డర్ చేయాలని అమెజాన్ తన వెబ్సైట్లో పేర్కొనడం కొసమెరుపు. విశేషమేమంటే ఈ చెప్పులు పురుషుల వాడకం కోసం తయారు చేశారు. -
చెప్పుల్లో కెమెరా పెట్టి...
-
ఫంక్షన్‌కు వెళ్లి కెమెరా ఎక్కడ పెట్టాడో తెలిస్తే షాకే..
సాక్షి, తిరువనంతపురం : లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లు కూడా తెలివి మీరారు. ప్రత్యక్షంగా వేధింపులకు అవకాశం దొరకడం లేదని పరోక్ష వేధింపులకు ప్లాన్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో వారు మహిళలను టార్గెట్ చేస్తున్నారు. సీక్రెట్ కెమెరాలను ఆశ్రయిస్తూ వాటితో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు. కేరళలో ఓ వ్యక్తి మహిళల స్కర్ట్స్ వీడియోలను చిత్రీకరించాలనే దుర్బుద్ధితో ఏకంగా తన చెప్పులకు రంధ్రాలు చేసి అందులో మినీ వీడియో కెమెరా పెట్టి రికార్డింగ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. బైజు అనే వ్యక్తి త్రిశూర్ జిల్లాలోని కాలోల్సావం అనే ప్రాంతంలో ఓ వేడుకకు హాజరయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన చెప్పులకు రంధ్రం చేసి అందులో కెమెరా పెట్టి ఆ వేడుక మొత్తం కలియ తిరగడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్కర్ట్స్ వేసుకున్నవారి వద్దకు వెళడం అక్కడ కొద్ది సేపు ఉండటం తర్వాత మరొకరి దగ్గరకు వెళుతుండటం చేశాడు. దాంతోపాటు ఎక్కువమంది ఉన్నచోటుకు వెళ్లి వారి మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా కెమెరా ఉన్న చెప్పును పెట్టడం దూరంగా వెళ్లి గమనించడం చేశాడు. అయితే, అదే వేడుకలో ప్రత్యేక నిఘాతో ఉన్న పోలీసులు అతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి చెప్పులో కెమెరా ఉన్నట్లు తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇలాంటి వ్యక్తిని, చర్యను తాము ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. -
ఆ చెప్పుల ధర 425 రూపాయిలు... అయితే
సాక్షి, పుణే : అవసరంలేని చోట హడావుడి ఎక్కువ అంటూ పుణే పోలీసులను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. అందుకు కారణం ఇక్కడ మనం ‘చెప్పు’కోబోయే వ్యవహారమే. తమకు అన్యాయం జరిగిందంటూ ఆశ్రయిస్తే పోలీసులు ఎంత త్వరగతిన స్పందిస్తారో మనకు తెలీదుగానీ... ఇక్కడ ఓ వ్యక్తి ఫిర్యాదు విషయంలో పోలీసులు చేసిన పనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఖేద్ మండలం రక్షవేది గ్రామానికి చెందిన విశాల్ కలేకర్(36) అక్టోబర్ 3న తన చెప్పులు పోయాయంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంటి బయట విడిచిన చెప్పులు ఎవరో ఎత్తుకెళ్లారని అందులో పేర్కొన్నాడు. ఉదయం 3 నుంచి 8 గంటల మధ్యలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని ఆయన అనుమానించాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రదీప్ జాదవ్ తెలిపారు. అయితే గతంలో ఇలాంటి ఫిర్యాదులెప్పుడూ తన దృష్టిలోకి రాలేదని.. ఇదే మొదటిసారి అని ఆయన అంటున్నారు. దొంగలెవరో గుర్తించటం కష్టతరంగా మారిందన్న ఆయన సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని కలేకర్‌కు ఇచ్చినట్లు జాదవ్ చెప్పారు. 425 రూపాయల విలువైన చెప్పులను చోరీ చేసిన ఈ కేసులో బాధితుడి ఆవేదనను ఖేద్ పోలీసులు త్వరగా అర్థం చేసుకున్నారంటూ ఓవైపు.. పోలీసులు చేస్తోంది తప్పేం కాదంటూ మరోవైపు ఇలా సోషల్ మీడియాలో పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వొదిలెళ్లిన జోళ్లు
కథ: ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ‘‘జోళ్లు మాట్లాడుకోవటం ఏమిటి? నాతో అంటే అన్నారు కాని, ఇంకెవ్వరితో అనకండి. మీకు పిచ్చి పట్టిందని వాళ్లకు తెలిసిపోతుంది’’ అనింది మా ఆవిడ. అంటే నేను పిచ్చివాడినని మా ఆవిడ ఫిక్స్ అయినట్టుంది. ఇక తనతో ఈ విషయం మాట్లాడటం దండగ అనిపించింది. నాలాగే మా తాత ఉండేవాడంట. కాదు కాదు ఆయనలాగే నేను ఉన్నానంటేనే నాకు ఇష్టం. చిన్నప్పుడు నాకు మా తాతే అన్నీ. ఆయన చెప్పిన చిట్టి చిట్టి కథలు అన్నీ జ్ఞాపకాలే. అసలు చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, ఆ జోళ్ల మూలంగానే. ఓసారి సెలవలకు మా అమ్మమ్మ వాళ్ల వూరికి వెళ్లా. ఏమీ తోచక పాత అల్మరా సర్దుతుంటే మా తాత వాడిన జోళ్లు కనబడ్డాయి. చూడగానే తెలియని అనుభూతి. గుర్తుగా వుంటాయిలే అని నాతో పాటే తెచ్చుకున్నా. అక్కడి నుండి మొదలైంది అసలు కథ. ఎర్రటి ముదురు రంగు తోలు, దాని చుట్టూ తెల్లటి దారంతో కుట్టిన అంచు, బాగా వాడిన తరువాత పుట్టే అందం, ఒక మూలన పడేసిన మా ఆవిడ నిర్లక్ష్యం... వాటి మాటెవ్వరు పట్టించుకోని తీరులో అవి అక్కడే ఉంటాయి. ఆ జోళ్లను చూసినప్పుడల్లా ఏవో గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజమే ఏదో గుసగుస. నాకు అర్థం కాని గుసగుస. కాని ఎవరితో చెప్పను! ఎవరితో అన్నా వీడికి పిచ్చిపట్టిందంటూ గొడవ చేస్తారని భయం. ఏది నమ్మినా, నమ్మకపోయినా ఒక మనిషి పిచ్చివాడంటే ఇట్టే నమ్మేస్తుంది లోకం. ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ఒకసారి మా అమ్మమ్మను అడిగా: ‘‘అమ్మమ్మ... తాతయ్య ఏం చేసేవాడు?’’ అని. అమ్మమ్మకు ప్రశ్న వేస్తే చేస్తున్న పని ఆపి చేతులు కొంగుకు తుడుచుకుంటుంది. ఆ రోజు కూడా అలానే తుడుచుకుంటూ ‘‘మాట్లాడేవాడ్రా’’ అంది. ‘‘ఏంటీ... మాట్లాడటం కూడా ఒక పనా?’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘మరి?’’ అని కొనసాగించింది. ‘‘ఆయన తాను పండించిన పైరుతో మాట్లాడేవాడు. తాను నడిచే దారితో మాట్లాడేవాడు. తాను చేతిలో పెట్టుకున్న బెల్లం ముద్దను మా రాముడికి, అంటే ఒక కర్రెద్దులే, దానికి తినిపిస్తూ మాట్లాడేవాడు. పువ్వుతో మాట్లాడేవాడు. పెరట్లో గుమ్మడి పిందె కనిపిస్తే దానితో మాట్లాడేవాడు. ఇప్పుడెక్కడివి? తెచ్చిన వడ్లరాశిని గాదెలో నింపుతున్నప్పుడు పిచ్చుకలు ఎన్ని వచ్చేవని? వాటితో మాట్లాడేవాడు. ఆఖరుగా నాతో మాట్లాడేవాడు. అట్టా... ఆయన మాట్లాడటం వింటుంటే మాట్లాడటం కూడా ఇంత మంచిపనా? అనిపించేది’’ అంది. నేను కుతూహలంగా ‘‘ఇంకా...?’’ అన్నాను. మా అమ్మమ్మ చాలా దయగా నవ్వి, ‘‘అన్నీ నేనే చెప్పేస్తే నువ్వేం తెలుసుకుంటావురా సన్నాసి’’ అంది. ఆ తర్వాత నేను తాత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏమీ తెలియలేదు. కనీసం ఈ చెప్పులైనా ఎంతోకొంత చెప్పకపోవా...? అని నా పిచ్చి. రోజురోజుకు ఈ జోళ్ల మీద ఆసక్తి మరీ ఎక్కువైపోతుంది. ఆఫీస్‌కు వెళ్తూ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నా. ఎప్పుడు ఖాళీ దొరికినా జోళ్ల గుసగుస వినడమే. అప్పటికే ఆఫీస్‌లో అందరూ నాకు ఏమైందన్నట్టుగానే కొత్తగా వింతగా చూస్తున్నారు. ఇంట్లో పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకొని పడుకుంటున్నా. దుప్పటి ముసుగుతన్ని నేను, నా పక్కలో జోళ్లు. రాత్రంతా ఒకటే ఆశ. చెవులు రెండు రిక్కించి మరీ వినడం. ఏదో గుసగుస అర్థం కాదు. నా పద్ధతి చూసి మా ఆవిడ నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. రోజులు గడుస్తున్నాయ్. ఆ రోజు ఎందుకో జోళ్లు తొడుక్కోవాలి అనిపించి, నా రెండు కాళ్లకు తొడిగి చూసుకున్నా, అంతే! నాలో తెలియని ఉత్సాహం, ఉద్వేగం...రెండు అడుగులు వేశానంతే. ఈ ప్రపంచాన్ని చుట్టానన్న తృప్తి. నాలుగో అడుగుకు శరీరం అంతా చాలా తేలికగా గాల్లో ఎగురుతున్నట్టుంది. గాల్లో ఎగురుతున్నట్టు కాదు గాల్లోనే ఉన్నా. గాలిపటంలా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతున్నా. ఎక్కడికో వెళ్తున్నా. అంతుచిక్కడం లేదు. దూరంగా నున్నగా కొండలు కనబడుతున్నాయి. ఆ కొండల నడుమ నారింజ రంగులో ఉదయిస్తున్న సూర్యుడు. ఒకదాని మీద ఒకటి వెండి పరుపులా పరుచుకొని ఉన్న మేఘాలు. మేఘాల అంచులు నారింజ రంగుతో కొత్త సరిగ చీర అంచుల్లా ఉన్నాయి. నారింజ వర్ణంలో కనిపించేంత మేర పరుచుకున్న నీళ్లు... ఒక అద్భుతం... చూసి తీరాల్సిందే. దట్టంగా పొగమంచు కప్పుకొని ఉంది. కనుచూపు మేరలో మనుషులు గాని, ఇళ్లు గాని ఏమీ లేవు. బహుశ అడవిలో ఉన్నట్టున్నా. నెమ్మదిగా అక్కడ దిగా. చుట్టూ మహావృక్షాలు మంచును చీలుస్తూ. చెట్టుకు వేలాడుతున్న ఊడలు. దూరంగా మినుక్ మినుక్మంటూ ఏదో వెలుగు. అటువైపుగా నడిచా. దగ్గరికి వచ్చేసరికి మంటలా అనిపించింది. అది చలిమంటలా ఉంది. ఎవరో మనుషులు కూడా ఉన్నట్టున్నారు, నలుగురు మనుషులు. ఒక ఆడ, మగ, ఇద్దరు పిల్లలు చలిమంట చుట్టూ కూర్చొని ఉన్నారు. పిల్లలేమో దబ్బపళ్లలా భలే ఉన్నారు. మగ మనిషేమో తల ఎత్తకుండా చలిమంట వైపు చూస్తున్నాడు, ఆడ మనిషేమో లేచి ఇంట్లోకెళ్లి ఓ బుట్టతో వచ్చింది. ఆ బుట్టలో ఏవో కాగితాల్లా ఉన్నాయి. చలిమంట కోసం లావుంది. పిల్లలిద్దరికీ గుప్పెడు గుప్పెడు కాగితాలిచ్చింది. వాళ్లేమో ఇష్టంగా మంటలో వేస్తున్నారు. కొద్దిగా దగ్గరికి వచ్చి చూశా. అంతే! ఆశ్చర్యం... ఆమె బుట్ట నిండా డబ్బుల నోట్లు. కుటుంబం అంతా ఇష్టంగా కాలుస్తున్నారు. వీళ్లు చేస్తున్న పనికి నాకు నోట మాట రావడం లేదు. తెలతెలవారుతోంది. నలుగురూ లేచి ఇంట్లోకి వెళ్లారు. వాళ్లు నన్ను గమనించినట్టు లేరు. ఇల్లు కూడా భలే వింతగా ఉంది. తలుపులు లేవు, కిటికీలకు ఊచలు లేవు. చూస్తే పేకలతో కట్టిన ఇల్లులా ఉంది. సూర్యుడు ఒకే ఊపులో అలా పైకి లేచాడు. చుట్టూ పచ్చదనం చిక్కటి ఆకుల వనంలా ఉంది. వాటి మధ్యలో అక్కడక్కడా పేకలతో కట్టిన ఇళ్లు. ఇక్కడ మనుషులంతా ఒకే వర్ణం... నారింజ రంగు. మనలా నలుపు, తెలుపు, చామనచాయ వర్ణాలు కాదు. అందరూ ఒకటే వర్ణం... నారింజ రంగు. మనుషులు కూడా ఆరు అడుగుల ఎత్తు, గాజుకళ్లు లాంటి కళ్లు. ఆడవాళ్లు అయితే అదొక తెలియని అందం. పిల్లలైతే దబ్బపళ్లలా ఉన్నారు. అదేమి విచిత్రమో, అందరూ నారింజ రంగు వర్ణంలో ఉన్నారు. ఆడా మగ అందరూ ప్రకృతితో మిళితమైన పనులు చేస్తున్నారు. ఒకడు నాగలి పట్టి దుక్కి దున్నుతున్నాడు. కొంతమంది ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. ఇద్దరేమో ఆవుల్ని తోలుకెళ్తున్నారు. తెల్లని ఆవుల మంద ఆకుపచ్చని వనంలో కళ్లు మిరిమిట్లు గొలుపుతోంది. ఆ ఆవులతో ఒకడేదో మాట్లాడుతున్నాడు. అదీ వాడితో మాట్లాడుతోంది. ఏంటి విచిత్రం! ఒకడు చెట్లెక్కి పండ్లు కోస్తున్నాడు. చూడ్డానికి ఆ పండ్లు మెరుస్తూ భలే వింతగా ఉన్నాయి. పిల్లలందరూ అరుగు మీద కూర్చున్న పేదరాసి పెద్దమ్మ చెప్పే కథలు వింటున్నారు. ఇద్దరేమో మట్టిని కువ్వలా పేర్చి, చెరోపక్క కూర్చొని చుకుచుకు పుల్ల ఆట ఆడుతున్నారు. ఆడపిల్లలేమో జట్టుగా కూర్చొని అచ్చంగాయ్ ఆడుతున్నారు. ఇంతలో జుయ్య్మంటూ ఒక సీతాకోకచిలుక ఒక బుడ్డోడిని వీపునేసుకొని పువ్వుపై వాలి, తేనె లాగి వాడి నోట్లో పోస్తోంది. నేనేమో ఈ వింతలన్నీ వింతగా చూస్తుండిపోయా. మరికాసేపటికి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అందరూ హాయిగా చెట్ల నీడలో వంట చేసే కార్యక్రమం మొదలెట్టారు. పిల్లలేమో ఆకుకూరలు, కాయగూరలు అవీ ఇవీ కోసుకొని వస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు వండేదానికి సిద్ధం అవుతున్నారు. ఊరందరికీ సరిపడ పెద్ద బానలో బియ్యం వేస్తున్నారు. పిల్లలు తెచ్చిన కూరగాయలను పేదరాసి పెద్దమ్మ, వయసు పైబడినవాళ్లు కడిగి ముక్కలు కోస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు తయారుచేశారు. బాదంచెట్టు ఆకుల్లా పెద్దగా ఉన్నాయి... వాటిల్లో పెట్టుకొని భోజనాలు చేశారు. మళ్లీ ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు. సాయంత్రానికి ఏటిగట్టు మీద వయసు కుర్రాళ్లు చేరి ఈతలు కొడుతున్నారు. ఒక్కొక్కరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి దూకుతున్నారు. వయసుకొచ్చిన కన్నెపిల్లలేమో ధైర్యంగా అబ్బాయిల ముందు నుంచే నీళ్లు తోడుకెళ్తున్నారు. పిల్లలేమో పిల్లకాలువ దగ్గర కాగితపు పడవలొదులుతున్నారు... అదీ ఎందుకూ పనికిరాని పచ్చనోట్లతో! చీకటిపడుతున్న వేళ అందరూ ఇళ్లకు చేరారు. ఆడాళ్లేమో దీపాలు వెలిగించారు. ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. చంటిపిల్లలను ఎత్తుకొన్న అమ్మలేమో ఆకాశం నుంచి నక్షత్రాలను చేత్తో పట్టుకొని చంటాళ్లకు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. నక్షత్రాల వెలుగుకి తల్లి, పిల్లాడు వెండి వెలుగులో మెరుస్తున్నారు. ఊరంతా ఒక దగ్గర చేరి చలిమంట వేసుకున్నారు. అందరూ తెచ్చిన పచ్చనోట్లతో మంటను వెలిగించారు. ఒక్కొక్క నోటు చాలాసేపు మండుతోంది. ఆ వెలుగులో ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆ పాటే నన్ను తలకిందుల చేస్తోంది. నాకు ఆ పాట అర్థం కావట్లేదు. కాని వెన్నెలంతా చినుకులై వర్షంలా కారుతోంది. నాలో తెలియని ఆవేదనంతా తడిసి చల్లారిపోయింది. అందరూ పాటలు పాడుకొని, ఎవరిళ్లకి వారు వెళ్లారు. నేను మాత్రం వెన్నెల వానలో తడుస్తూనే ఉన్నా. మెలకువ రాగానే కళ్లు నలుపుకొని చూశా. బెడ్ లైట్ కాంతిలో అంతా ప్రశాంతంగా ఉంది. కాళ్లవైపు చూసుకున్నా. కాళ్లకి జోళ్లు లేవు. మూలగా చూశా. అవి అక్కడే ఉన్నాయి. ఈ మధ్య నాకు పిచ్చి ముదిరిందని మా ఆవిడ పక్క రూమ్‌లో పడుకుంటోంది. టైమ్ చూస్తే 5.30 అయ్యింది. జోళ్ల గుసగుసలు ఏమైనా వినబడుతాయేమోనని జోళ్ల దగ్గరకు వెళ్లా. అంతా నిశ్శబ్దంగా ఉంది. తెలవారబోతోంది. పొగ మంచు. ఇంట్లో నుంచి బయటకువచ్చా. అంతా నిర్మానుష్యంగా ఉంది. మంచుని చీల్చుకు కనబడుతున్న కాంతి. మసగ్గా టీ బంక్‌లా ఉంది... చుట్టూ నలుగురు ఉన్నారు. నేను టీ తాగాలని జేబులో చూశా. డబ్బులు లేవు. డబ్బు లేకుంటే ఈ లోకంలో ఏదీ నీ సొంతం కాదు... ఆఖరికి టీ కూడా, అని మనసులో అనుకుంటూ నడుస్తున్నా. తెల్లారింది. అలా నడుచుకుంటూ సిగ్నల్ దగ్గర ఆగా. ట్రాఫిక్ పెరిగింది. సిగ్నల్ పడింది. నేను నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా, ఆగిన బెంజ్ కార్. అందులో సూట్ వేసుకొని కూర్చున్న బిజినెస్‌మ్యాన్. కార్ పక్కనే బైక్‌పైన భార్య, భర్త ఆఫీసులకు లాగుంది. పక్కనే స్కూటీపై ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న పదహారేళ్ల ఆడపిల్ల కాలేజ్‌కి వెళ్తున్నట్టుంది. చివరగా పిల్లలందరినీ కుక్కిన ఓ పసుపురంగు స్కూల్ వ్యాన్. నేను రోడ్డు దాటాను. సిగ్నల్ పడింది అంతే. రణ గొణ ధ్వనుల మధ్య కొన్ని వేల ఆర్తనాదాలు. ఇవేవి వినబడట్లేదు నాకు. ఎక్కడో... ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం... ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆశగా అడుగులు వేస్తున్నా... ఆయన వొదిలెళ్లిన జోళ్లతో... ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. - మహి బెజవాడ -
వాయనం: పాదరక్షలూ ఫ్యాషన్‌లో భాగమే!
చక్కటి డ్రెస్ వేసుకుంటాం. హెయిర్ స్టయిల్‌ను అందంగా తీర్చిదిద్దుకుంటాం. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, చెయిన్, బ్రేస్లాంటి లాంటివన్నీ పెట్టుకుంటాం. కానీ పాదరక్షల సంగతి మర్చిపోతాం. ఏవి వేసుకుంటే ఏమని సరిపెట్టేసుకుంటాం. కానీ మన అలంకరణకు మరింత అందం రావాలంటే సరయిన చెప్పులు వేసుకోవడం కూడా ముఖ్యమే. అందుకే కంపెనీలు రకరకాల మోడళ్లలో పాదరక్షలు తయారు చేస్తున్నాయి. ఎలాంటి దుస్తులు వేసుకున్నప్పుడు ఏ మోడల్ పాదరక్షలు వేసుకోవాలో తెలుసుకుంటే ఇక మీకు తిరుగే ఉండదు. బ్లాక్ పంప్స్ - అసలు ఇవి ఇచ్చినంత అందం కాళ్లకు మరేవీ ఇవ్వవేమో అంటారు ఫ్యాషన్ నిపుణులు. ఏ డ్రెస్ మీదికైనా సూటయిపోతాయి. బిజినెస్ మీటింగ్, డిన్నర్, పార్టీ... ఎక్కడికి వేసుకెళ్లేందుకైనా అనువుగా ఉంటాయి. వీటి సోల్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందువల్ల నడవడంలో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. డ్రెస్సీ హై హీల్స్- రిచ్ లుక్ ఇవ్వడంలో వీటిని మించినవేవీ లేవు. జీన్స్, చీరల మీదికి ఇవి పెద్ద నప్పవు కానీ... స్కర్ట్స్, ఫ్రాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. సిల్వర్, గ్రే, ఎరుపు, మెటాలిక్... ఇలా చాలా రంగుల్లో ఉంటాయి. మన డ్రెస్‌ని బట్టి రంగు ఎంచుకోవడమే. విదేశాల్లో అయితే నలుపు రంగు డ్రెస్ వేసుకుంటే కచ్చితంగా వీటినే కాంబినేషన్‌గా ఎంచుకుంటారు అమ్మాయిలు. ఫీల్‌గుడ్ ఫ్లాట్స్- చాలామంది జీన్స్ మీదికి హీల్స్ వేసుకుంటారు కానీ... ఫ్లాట్స్ వేస్తే ఆ అందమే వేరు. కాస్త హైట్ తక్కువున్నవాళ్లు వీటి జోలికి పోకపోయినా, మంచి పొడవు ఉన్నవాళ్లు వీటిని ఎంచుకోవడమే బెటర్. కప్రీలు, షార్ట్స్, లెగ్గింగ్-కుర్తీల్లాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. రకరకాల మెటీరియల్స్‌తో తయారవుతాయివి. మెత్తగా ఉండేవి, కాస్త గట్టిగా ఉండేవి, లైట్ వెయిట్ అంటూ కొన్ని రకాలున్నాయి. బోలెడన్ని రంగుల్లో ఉంటాయి. నచ్చినవి ఎంచుకోవచ్చు. డ్యాజ్లింగ్ బూట్స్- వీటిని మనవాళ్లు ఎక్కువగా వాడరు కానీ విదేశాల్లో అమ్మాయిలకు ఇవంటే మహా మోజు. ముఖ్యంగా వాళ్లవి చలి ప్రదేశాలు కాబట్టి వీటివైపు మొగ్గు చూపుతుంటారు. స్టైల్‌గానూ ఉంటాయి, వెచ్చగానూ ఉంటాయి. జీన్స్, షార్ట్స్, త్రీ ఫోర్త్స్ వేసినప్పుడు బాగా సూటవుతాయి. స్కర్టుల మీద కూడా బాగానే నప్పుతాయి. వీటిలో హీల్ ఎక్కువుండేవి, తక్కువుండేవి కూడా ఉంటాయి. హైట్‌ని, కంఫర్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఎంచుకోవచ్చు. రిలాక్సింగ్ స్నీకర్స్- వీటి అంత సౌకర్యంగా మరే మోడల్ పాదరక్షలూ ఉండవు. అందుకే వాకింగ్‌కి వెళ్లినప్పుడు, జిమ్ చేసేటప్పుడు వీటినే ఎంచుకుంటారు. వర్షాకాలంలోను, రోడ్లు బురదగా ఉన్నప్పుడు కూడా నడవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయివి. పార్టీలకు, ఆఫీసులకు వేసుకోవడానికి బాగోవు కానీ... ఏ షాపింగుకు వెళ్లినప్పుడో, సరదాగా షికారుకు వెళ్లినప్పుడో చక్కగా వేసుకోవచ్చు. -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
-
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మంత్రి శత్రుచర్ల విజయమరాజుకు ఘోరపరాభవం జరిగింది. కొత్తూరు గ్రామంలో ఆయన కాన్వాయ్‌పై సమైక్యవాదులు రాళ్లు, చెప్పులు విసిరారు. మంత్రిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. మంత్రి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను ముందుకు కదలనివ్వలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి బయటపడ్డారు.