
ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: ఎక్కడైనా చెప్పులు పోతే, కొత్తవి కొనుక్కుంటారు. కానీ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ విచిత్ర ఘటన బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. కారు స్ట్రీట్‌లోని బాలంభట్ట హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి చెప్పులు పోయాయి. దీంతో అతడు పోలీసు సహయవాణికి ఫోన్ చేశాడు. దగ్గరలో గస్తీలో ఉన్న హొయ్సళ పోలీసులు వచ్చి వెతికినా చెప్పులు దొరకలేదు. దీంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని అతనికి సూచించారు.
మరో ఘటనలో..
కారు, లారీ ఢీ.. ముగ్గురి మృతి
కంప్లి: కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద లారీ, కారు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో కంప్లి పట్టణానికి చెందిన శరత్(35), ఎమ్మిగనూరుకు చెందిన శ్రీరామ్(28) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న శరణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శరణ(28) కూడా మృతి చెందాడు. ఈ ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి Prostitution Racket Busted: వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని