శివమొగ్గ(కర్ణాటక): అమ్మ కొట్టిందని, పెన్సిల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ మధ్యకాలంలో చూశాం. అటువంటిదే ఈ కేసు. నా ఆవులు పాలు ఇవ్వడం లేదు. పాలు ఇచ్చేలా చేయండి, లేదా వాటిపై కేసు నమోదు చేయండి.. అని ఒక రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
చదవండి: అత్యంత విషపూరితమైన 11 పాములను నోట్లో కుక్కి.. బాబోయ్!
‘ఆవులకు తగినంత దాణా, గడ్డి పెట్టి పోషిస్తున్నా, 4 రోజుల నుంచి పాలు ఇవ్వడం లేదు, పాలు పితకడానికి వెళ్తే తంతున్నాయి. వాటికి బుద్ధి వచ్చేలా చేయండి’ అని స్థానిక రైతు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు నివ్వెరపోయారు. ఇటువంటి కేసులను నమోదు చేయడం కుదరదు. ఆవులను మంచిగా చూసుకో, పాలు ఇస్తాయని నచ్చ చెప్పి పంపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..!
Comments
Please login to add a commentAdd a comment