బనశంకరి(కర్ణాటక): కోడిపుంజు కూతతో నిద్రకు ఆటంకం కలుగుతోందని పోలీసులను ఆశ్రయించాడు ఓ ఐటీ ఇంజినీర్. వివరాల్లోకి వెళి తే.. బెంగళూరులోని జేపీ నగర 8వ ఫేజ్‌లో ఓ అపార్టుమెంటులో ఉత్తర భారతదేశానికి చెందిన టెక్కీ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతడు నగర పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌కు తన ఫిర్యాదును ట్యాగ్ చేశాడు.
తమ అపార్టుమెంటు వద్ద స్థలంలో ఒక రైతు కోడిపుంజులు, కోళ్లను పెంచుతున్నాడని, కోడిపుంజులు కూత వేస్తుండటంతో నిద్రాభంగం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కోళ్ల పెంపకందారుని ప్రశ్నించారు. నా స్థలంలో కోళ్లను పెంచుకుంటే నేరమా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టెక్కీకి, కోళ్ల రైతుకు సర్దిచెప్పి పంపించారు.
చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి..
Comments
Please login to add a commentAdd a comment