ప్రతీకాత్మక చిత్రం
హోలీ ఎలా ఆడుతారు? అదేం ప్రశ్న అంటారా? రకరకాల రంగులు, గుడ్లు, టొమాటోలు, పూలు, మన్ను బురద నీళ్లు.. ఓ ఇలా చెప్తూ పోతే బోలెడు. మన దేశంలో ఒక్కోచోట ఒక్కో పేరుతో మాత్రమే కాదు.. రకరకాల పద్ధతుల్లోనూ చేసుకుంటారు జనాలు. కానీ, ఇప్పుడు చెప్పబోయే తరహా హోలీ సెలబ్రేషన్స్ మాత్రం ఇంతకు ముందు చూసి ఉండరు.
హోలీకి ఓ రోజు ముందుగానే.. అంటే మార్చి 17వ తేదీన చోట్టి హోలీ పేరుతో ఓ వీడియో ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అయ్యింది. గులాల్‌తో నిండిపోయిన ఓ వాటర్ పూల్‌లో.. రంగులకు బదులు చెప్పులు విసురుతూ కనిపించారు కొందరు. Chappal Maar Holi చాలా సందడిగా జరగ్గా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తోంది.
#WATCH पटना : वाटर पार्क में होली के जश्न के दौरान लोग एक-दूसरे पर चप्पल फेंकते दिखे। pic.twitter.com/eFAY65wsU7
— ANI_HindiNews (@AHindinews) March 17, 2022
బిహార్ రాజధాని పాట్నాలోని ఓ వాటర్ పార్క్‌లో ఈ సరదా వేడుకలు జరిగాయి. ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కామెంట్లు అంతే హిలేరియస్‌గా వస్తున్నాయి. కరోనా వల్ల రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా గ్రాండ్‌గా హోలీ వేడుకలకు ఛాన్స్ దొరికింది. ఈ నేపథ్యంలో ఇలా కొందరు యువకులు.. చెప్పుల హోలీతో సరదా వాతావరణం క్రియేట్ చేశారు. స్పెయిన్‌కేమో టొమాటోలు.. మనకేమో ఇలా చెప్పులన్నమాట!.
Comments
Please login to add a commentAdd a comment