
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ ఇవ్వలేదని ఆక్రోశంతో పౌర కార్మికుడు పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం వేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ పౌర కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్ప పీడీఓ శివరాజ్‌ను దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ అడిగాడు. అయితే పీడీఓ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కృష్ణప్ప సోమవారం రాత్రి కార్యాలయానికి వెళ్లి చెప్పుల హారం వేసాడు. తాలూకా పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ పౌర కార్మికులతో సమావేశమై వారికి సర్ది చెప్పారు. అనంతరం చెప్పుల హారాన్ని తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment