బుల్లితెరపై గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రియాలిటీ షో బిగ్‌బాస్. బిగ్‌బాస్ 13 హిందీ సీజన్‌లో అయితే ఈ గొడవలకు లెక్కే లేదు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. వీకెండ్‌లో వారి తగాదాలకు పరిష్కరించడానికే సమయం సరిపోతుంది. అలా ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బిగ్‌బాస్ షోలోని నిన్నటి ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్లకు మళ్లీ లొల్లయింది. కానీ ఈ సారి ఏకంగా ఓ పార్టిసిపెంట్ తోటి కంటెస్టెంట్‌ను చెప్పు తీసుకుని కొట్టడం వివాదాస్పదమయింది. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విశాల్ ఆదిత్య, మధురిమా తులి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఉన్న వీరిద్దరు తగవులాడుకున్నారు. విశాల్ కోపంతో మధురిమను నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడ నుంచి వెళ్లిపో అంటూ ఆమెను దుర్భాషలాడాడు.
దీంతో ఆవేశానికి లోనైన మధురిమ విశాల్‌కు చెప్పుదెబ్బ రుచి చూపించింది. తన చెప్పుతో కొట్టి అక్కడ నుంచి తిట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌బాస్ ఇద్దరినీ కన్ఫెషన్ రూంకు పిలిచాడు. తొలుత విశాల్ మాట్లాడుతూ శారీరక హింసకు పాల్పడేవాళ్లను ఇంట్లో ఇనుమతిస్తారా? అని ప్రశ్నించాడు. అనంతరం మధురిమతో కలిసి తాను ఈ ఇంట్లో ఉండలేనని తేల్చి చెప్పాడు. మధురిమ మాట్లాడుతూ.. చెప్పుతో కొట్టడం తప్పేనని విశాల్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఈ గొడవలో అతని తప్పు కూడా ఉందని ఎత్తిచూపింది. ఈ గొడవలో ఇరువైపులా తప్పు ఉండటంతో బిగ్‌బాస్ ఇద్దరినీ మందలించాడు. శారీరక హింసకు పాల్పడినందుకుగానూ మధురిమను రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ పేర్కొన్నాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి వివాదాస్పద వక్త
చెప్పు తీసుకుని కొట్టిన కంటెస్టెంట్
Published Tue, Jan 7 2020 11:54 AM | Last Updated on Tue, Jan 7 2020 1:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment