Price Tag
-
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
Russia-Ukraine war: యుద్ధ వ్యతిరేక లేబుళ్లు అంటించినందుకు.. రష్యా కళాకారిణికి ఏడేళ్ల జైలు
మాస్కో: సూపర్మార్కెట్లోని వస్తువులపై ఉండే ధరల లేబుళ్లను తొలగించి, వాటి స్థానంలో యుద్ధ వ్యతిరేక నినాదాలున్న లేబుళ్లు అంటించిన నేరంపై ఓ కళాకారిణికి రష్యా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక.. సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన సాషా స్కోచిలెంకో(33) అనే కళాకారిణి స్థానిక ఫెమినిస్టు బృందం పిలుపు మేరకు స్థానిక సూపర్మార్కెట్లోని వస్తువుల ధర లేబుళ్లను తీసేసి..‘రష్యా ఆర్మీ మరియుపోల్‌లోని స్కూల్‌పై బాంబు వేసింది’... ‘రష్యా ఫాసిస్ట్ రాజ్యంగా మారి ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు మా ముత్తాత రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడలేదు’ అంటూ రాసి ఉన్న కొన్ని లేబుళ్లను అంటించింది. ఈ నేరానికి అధికారులు గత ఏడాది ఏప్రిల్ అదుపులోకి తీసుకున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఎలాంటి వైఖరి తీసుకున్నా కఠిన శిక్షలకు అవకాశం కల్పిస్తూ పుతిన్ ప్రభుత్వం చట్టాలు తీసుకువచి్చంది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి అరెస్ట్ ఇది. దీంతో, విచారణ సుదీర్ఘంగా సాగింది. తనపై వచి్చన ఆరోపణలను సాషా అంగీకరించింది కూడా. తీవ్ర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాషా జైలులోనే చనిపోయే ప్రమాదముందని ఆమె తరఫు లాయర్లు తెలిపారు. అయినప్పటికీ జడ్జి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచి్చనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రభుత్వ టీవీలో లైవ్‌లో వ్యతిరేకించారన్న ఆరోపణలపై కోర్టు ఒకటి మరినా అనే జర్నలిస్టుకు ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. యుద్ధాన్ని నిరసించిన వ్లాదిమిర్ కారా ముర్జా అనే ప్రతిపక్ష నేతకు ఏప్రిల్‌లో 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
ఎయిర్‌పోర్ట్‌లో సమంత.. అందరి దృష్టి వాటిపైనే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రం ఆశించినస్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఇండియా వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. సిటాడెల్ చివరి షెడ్యూల్ ముగించుకున్న సమంత తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కున మెరిసింది. (ఇది చదవండి: ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్) అయితే సమంత కాస్తా డిఫరెంట్ లుక్‌లో విమానాశ్రయంలో కనిపించింది. చాలా విభిన్నమైన దుస్తుల్లో వచ్చిన సమంత ఎయిర్‌పోర్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన చెప్పులపైనే నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. సమంత చాలా ఖరీదైన బ్రాండెడ్ చెప్పులు వేసుకుందని.. వాటి ధరపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. సమంత చెప్పుల విలువ దాదాపు రూ.2,58,097గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి చాలా సౌకర్యవంతంగా, తక్షణ వెచ్చదనం ఇస్తాయని.. అంతే కాకుండా ఈ చెప్పుల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తాజా లుక్‌లో సమంత చాలా ఫర్ఫెక్ట్గా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!) -
నిబంధనలకు చెల్లు.. మందుబాబుల జేబుకు చిల్లు
సాక్షి, గుంటూరు: వైన్ షాపుల ముందు ధరల పట్టిక ఉండాలి.. హోలో గ్రామ్ మిషన్ ఏర్పాటు చేయాలి.. హోల్‌సేల్‌గా అమ్మకూడదు.. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించకూడదు.. ఇవన్నీ మద్యం వ్యాపారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు. అయితే, చాలాచోట్ల ఇవి నీటి మీద రాతల్లా మారాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి లాభాలే లక్ష్యంగా నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుగుతున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బార్ కోడింగ్ అమలు, దుకాణాల ముందు సీసీ కెమేరాల ఏర్పాటు, ఆన్లైన్ బిల్లు వంటి నిబంధనలు తప్పనిసరి చేసినా చాలాచోట్ల అమలు అవి రికార్డులకే పరిమితంగా మారాయి. మూన్నాళ్ల ముచ్చటగా హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం మ్యానువల్‌గా మద్యం అమ్మకాల్లో అక్రమాలను నియంత్రించడం కోసం ఎక్సైజ్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ అమ్మకాల నిర్వహణ మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. హెడోనిక్ పార్ట్ ఫైండర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా 2015 జులై 1వ తేదీ నుంచి అన్ని వైన్ షాపులు, బార్లలో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా ఎమ్మార్పీ, బ్యాచ్ నంబర్, అమ్మకాలు పూర్తిగా నమోదు అవుతాయి. అయితే, ఈ విధానం నామమాత్రంగానే అమలవుతోంది. కొన్ని దుకాణాల్లో కంప్యూటర్ కూడా ఉండటం లేదు. హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానం సరిగా అమలు కాకపోవడం వల్ల కల్తీ మద్యానికి అడ్డుకట్ట వేయడం అధికారులకు సమస్యగా మారుతోంది. ఈ విధానం సరిగా అమలు జరిగితే ఉదయం 10 గంటల కన్నా ముందు, రాత్రి పది గంటల తర్వాత మద్యం అమ్మకాలు జరిపితే అధికారులకు వెంటనే సమాచారం తెలిసిపోతుంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడానికి అవకాశం ఉండదు. దీంతో పాటు వినియోగదారులకు కంప్యూటర్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధనలు అన్ని పాటిస్తే తమ లాభాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో చాలా వరకు మద్యం వ్యాపారులు హెచ్‌పీఎఫ్‌ఎస్ విధానాన్ని పాటించడం లేదు. దీనివల్ల కల్తీ మద్యం బాటిళ్లు పట్టుబడినప్పుడు అవి ఎక్కడి నుంచి తయారై వచ్చాయో గుర్తించడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిలువుదోపిడీ ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం మద్యాన్ని బాటిల్స్‌లోనే విక్రయించాలి. కానీ జిల్లాలోని అన్ని దుకాణాల్లో విరుద్ధంగా లూజుగా విక్రయిస్తున్నారు.దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం రాయుళ్లు ఖరీదైన మద్యం సీసాల్లో మధ్య రకం బ్రాండ్లను కలిపి మందుబాబులకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. బార్లలో ఎమ్మార్పీ రేట్లు వర్తించవన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని యజమానులు సర్వీసు చార్జీల పేరుతో వినియోగదారులను నిలువునా దోచేస్తున్నారు. కొన్ని బార్లలో బీర్ బాటిల్ ధర రూ. 110 నుంచి రూ. 170 వరకు విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్, స్థానిక పోలీసు అధికారులు నెలానెలా మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదు. కొద్ది నెలల క్రితం ఎక్సైజ్ శాఖలో లోపాలు ఆసరాగా చేసుకుని సాక్షాత్తు ఆ శాఖ ఉద్యోగే కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జిల్లాలో 185 బార్లు, 352 వైన్‌షాపులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ. 4.25కోట్ల చొప్పున నెలకు రూ. 125 కోట్ల నుంచి 130 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతోంది. రోజురోజుకూ మద్యం విక్రయాలు పెరగడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అ«ధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇస్టానుసారంగా విక్రయాలు కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇష్టమైతే కొనండి.. లేకుంటే వెళ్లిపోండనే సమాధానం వస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తెనాలి, రేపల్లె, పల్నాడు ప్రాంతాల్లో గ్రామానికి రెండు లేదా మూడు చొప్పున బెల్టు కొనసాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిలో దాదాపుగా అందరూ అధికారపార్టీకి చెందిన వారు కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం సాహసించలేక పోతున్నారు. మా దృష్టికి వస్తేకఠినంగా వ్యవహరిస్తాం సిగ్నల్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే బార్ కోడింగ్ విధానం అమలులో లేదు. ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్న విషయం మాదృష్టికి వస్తే కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాలతో త్వరలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని బెల్టు దుకాణాలపై చర్యలు తీసుకుంటాం.– శ్రీమన్నారాయణ, ఎక్సైజ్ డీసీ -
రెండు ఎంఆర్పీ రేట్లతో ప్రయోజనం
♦ ఉత్పత్తుల రేట్లు పెరిగాయా, ♦ తగ్గాయా అన్నది తెలుస్తుంది ♦ ఎఫ్ఎంసీజీ కంపెనీల అభిప్రాయం న్యూఢిల్లీ: జూన్ చివరి నాటికి అమ్ముడుపోని సరుకులపై జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత రేట్లను పేర్కొని విక్రయించుకునే అవకాశం వల్ల నిల్వలు ఖాళీ చేసుకునేందుకు వీలవుతుందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. మార్కెట్లో పారదర్శకత కూడా వస్తుందని పేర్కొన్నాయి. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు పెరిగాయా లేక తగ్గాయా అన్నది వినియోగదారులు తెలుసుకునేందుకు తోడ్ప డుతుందని అన్నాయి. అమ్ముడు పోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై సవరించిన ధరల ట్యాగ్‌ను వేసుకుని మూడు నెలల పాటు విక్రయించుకునేందుకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మాత్రం ఒకటే ఎంఆర్పీ(గరిష్ట చిల్లర ధర) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. దీంతో ఈ నిర్ణయాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు స్వాగతించాయి. ధరలపై స్పష్టత: ఈ వెసులుబాటు జీఎస్టీ సాఫీగా అమలయ్యేందుకు వీలు కల్పిస్తుందని పతంజలి కంపెనీ పేర్కొంది. ఎంఆర్పీ విషయంలో వర్తకులు, తయారీదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తుందని తెలిపింది. వినియోగదారులు సైతం జీఎస్టీ వల్ల ధరలు పెరిగాయా, తగ్గాయా అన్నది తెలుసుకోగలుగుతారని పేర్కొంది. సవరించిన ధరలతో తమ ఉత్పత్తులను ఇప్పటికే విడుదల చేయడం ప్రారంభమైందని హెచ్‌యూఎల్ తెలిపింది. -
సొమ్ము ఇచ్చుకో..పోస్టు పుచ్చుకో...
ఈపీడీసీఎల్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు కావాలనుకుంటున్నారా! అయితే రూ.ఐదు లక్షలు ఇచ్చుకునే స్తోమత ఉందా? అంత ఇచ్చుకోలేకపోతే.. కనీసం అధికార పార్టీ నేతకు దగ్గరవారైఉంటే రూ.మూడు లక్షలకు పనైపోతుంది.మరెవరో కాదు.. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నిర్ణయించిన రేటు ఇది. జిల్లాలో కొనసాగుతున్నఈ దందాను చూసీచూడనట్టు పోవాలంటూ అధికారులకు సైతం వారు హుకుం జారీ చేస్తున్నారు. సాక్షి, రాజమండ్రి :తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జిల్లాలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు ధరలు నిర్ణయించారు అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు. పోస్టు కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నా, తమతో బేరసారాలు కుదుర్చుకోకపోతే ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. గతనెలలో జేఎల్‌ఎంల నియామకాల్లో 92 మంది ఆన్‌డ్యూటీ ఆపరేటర్లు జేఎల్‌ఎంలుగా నియమితులయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాల్సి ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు ఆ పోస్టులకు ‘ప్రైస్ ట్యాగ్’లు బిగించారు. ఒకొక్క పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సిఫారసు చేసిన అభ్యర్థులకు మాత్రమే పోస్టులు కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరుద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు అంతసొమ్ము ఎలా తీసుకొస్తామని డీలా పడతున్నారు. పోస్టుల ఖాళీలు ఇలా.. ఈపీడీసీఎల్‌కు జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, జగ్గంపేట డివిజన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాంట్రాక్టు పద్ధతిలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 1559 మందిలో 92 మంది ఆగస్టులో జరిగిన జేఎల్ఎం నియామకాల్లో ఎంపికయ్యారు. ఖాళీ అయిన ఆ స్థానాలను ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాంట్రాక్టు షిఫ్ట్ ఆపరేటర్‌కు రూ.9829 వేతనంగా ఇస్తున్నారు. ఈ చిన్న పోస్టుకు కూడా రూ.లక్షల్లో బేరాలు సాగిస్తున్నారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని.. ఆగస్టులో జిల్లాలో 197 జేఎల్‌ఎంల నియామకాలను ఈపీడీసీఎల్ అధికారులు చేపట్టారు. అప్పట్లో అధికార పార్టీ వారికి కూడా అవకాశం లేకుండా, పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తిచేశారు. కొన్నిచోట్ల నేతల సిఫారసు లేఖలను కూడా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్న నేతలు ఆయనను బదిలీ చేయించేందుకు సైతం విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసింది. అది సాధ్యపడక పోవడంతో ఈసారైనా షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో తమ దందా సాగించేలా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. లేకపోతే ఈసారి బది లీ వేటు తప్పదని బెదిరించడంతో.. ఆ ఉన్నతాధికారి తలవంచక తప్పలేదని తెలుస్తోంది. ఈ రేట్లలో కూడా ఆ ప్రజాప్రతినిధులు కాస్త కనికరం చూపుతున్నట్టు తెలిసింది. అభ్యర్థి తమకు కావాల్సిన వాడు, పార్టీ కార్యకర్త, నమ్మిన బంటు వంటి వాళ్లయితే రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు ఇస్తే చాలని అంటున్నట్టు ఓఅభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశాడు. లేదంటే రూ.ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మధ్యలో చెల్లించుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారని గ్రామీణ ప్రాంతానికి చెందిన కొందరు అభ్యర్థులు చెబుతున్నారు.