Actress Anushka Spotted At Hyderabad Airport Pics Goes Viral In Social Media | హైదరాబాద్‌లో అనుష్క ఫొటోలు వైరల్‌- Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్‌

Published Tue, Jan 12 2021 6:43 PM | Last Updated on Tue, Jan 12 2021 7:56 PM

Anushka Shetty Spotted In Hyderabad Airport Photos Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వీటీ అనుష్క తన అభిమానులను సర్‌పప్రైజ్‌ చేశారు. కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్న దేవసేనా.. ఆకస్మాత్తుగా హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత స్వీటీ హైదరాబాద్‌లో కనిపించడంతో మీడియా తమ కెమెరాలకు పనిచెప్పారు. దీంతో అనుష్క ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. నిశ్శబద్దం తర్వాత ఇప్పటి వరకు అనుష్క ఏ మూవీకి సంతకం చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరుత్సాహం​లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం స్వీటీ  హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే అనుష్కను వెండితెరపై చూసే అవకాశం ఉందంటూ ఖుషి అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. దీంతో పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన నటనతో మెప్పించిన అనుష్క.. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్‌ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement