
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేపింది. మంగళవారం రాష్ట్రంలో 415 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో హైదరాబాద్‌లో ఒకరికి వైరస్ సోకినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. ఈనెల 25న కూడా నగరంలో ఒక కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
దీంతో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఎన్నికల్లో జనం గుంపులుగా ఉండటం, ఫ్లూ జ్వరాలు వంటి తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. అయితే అది ప్రమాదకరంగా లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
చదవండి: చైనాలో నిమోనియా కలకలంపై కేంద్రం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment