
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 7,828 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 47 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.40 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 69 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.36 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 299 యాక్టివ్ కేసులున్నాయి.