RTPCR
-
అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయండి.. మంకీపాక్స్‌పై కేంద్రం ఆదేశాలు
ఢిల్లీ : కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ). ఈ తరుణంలో ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం. భారత్‌లో ఇప్పటి వరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. అయితే ఆగస్ట్ 16న యూఏఈ నుంచి దేశానికి వచ్చిన ముగ్గురు రోగుల్ని పాకిస్థాన్ గుర్తించింది. అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా వెలుపల మొదటి పాక్స్ కేసును నిర్ధారించాయి. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎంపాక్స్ ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
Covid-19: ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది. తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది. చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం.. -
జనవరి 1 నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి
ఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ల విజృంభణ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రాబోయే 40 రోజుల్లో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో విదేశాల నుంచి, ప్రత్యేకించి ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు తప్పనిసరి చేసింది కేంద్రం. మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..!
న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భారత్ తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లోనే రాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలనే నిబంధనలు తీసుకురానుందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 40 రోజులు చాలా కీలకమని, జనవరిలో కరోనా కేసులు పెరిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించారు అధికారులు. దేశంలో నాలుగో వేవ్ వచ్చినా మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో తూర్పు ఆసియాలో కోవిడ్ విజృంభించిన 30-35 రోజుల తర్వాత భారత్‌లో కొత్త వేవ్ వచ్చిందని గుర్తు చేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్, ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌లో వివరాల నమోదు వంటి నిబంధనలు మళ్లీ తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సుమారు 6000 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. అందులో గత రెండు రోజుల్లోనే 39 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా బుధవారం సందర్శించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కరోనా అలర్ట్: జనవరి గండం ముందే ఉంది.. కేంద్రం వార్నింగ్ ఇదే.. -
Covid-19: వారికి ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్ టెస్ట్ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్ తప్పదు. రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు. కొత్తగా 201 కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది. -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
మంకీపాక్స్ నిర్ధారణ కిట్ విడుదల
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించే కిట్ అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని మెడ్ టెక్ జోన్లో ట్రాన్సాసియా బయో–మెడికల్స్ సంస్థ ఆర్టీపీసీఆర్ విధానంలో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్ నిర్ధారణ కిట్ ఇదే కావడం విశేషం. ట్రాన్సాసియా–ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ శుక్రవారం మెడ్‌టెక్ జోన్లో ఆవిష్కరించారు. అత్యంత సున్నితమైన, కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక చైర్మన్ సురేష్ వాజిరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్ ) -
మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్ తయారు చేసిన చెన్నై కంపెనీ
చెన్నై: ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించడం కోసం చెన్నైకి చెందిన ఒక కంపెనీ ఆర్టీ–పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. సాధారణంగా దట్టమైన అటవీప్రాంతాలున్న పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో మాత్రమే కనపడే మంకీపాక్స్ వైరస్ ఈ ఏడాది ఇప్పటికే 20 దేశాల్లో 200కిపైగా కేసులతో ఆందోళన పుట్టిస్తోంది. ఈ వైరస్ భారత్‌కూ విస్తరిస్తే వెంటనే నిర్ధారించుకోవడానికి చెన్నైకి చెందిన వైద్య పరికరాలు రూపొందించే ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ అనే కంపెనీ ఈ పరీక్ష కిట్‌ను రూపొందించింది. నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్ ఇది. దీని ద్వారా స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ మధ్య తేడాలను తెలుసుకోవడమే కాకుండా పరీక్ష ఫలితాలు ఒక గంటలోనే వచ్చేస్తాయి. ఈ పరీక్ష నిర్వహించడానికి పొడి స్వాబ్లు, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా (వీటీఎం)లో ఉంచే స్వాబ్‌లను వినియోగించి తెలుసుకోవచ్చునని సంస్థ సీఈఓ చంద్ర గంజూ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి దశలో ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంటువ్యాధుల సన్నద్ధత డైరెక్టర్ సిల్వీ బ్రియాండ్ చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో ఈ వైరస్ బయటపడకపోయినప్పటికీ కేంద్రం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని భరోసా ఇచ్చింది. -
పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. ఆలయ పాలక వర్గం కీలక నిర్ణయం
పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. -
Covid: కొద్దిపాటి జలుబు, జ్వరానికే పాజిటివ్.. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయాందోళనలతో టెస్టుల కోసం వెళ్లే బాధితులను పరీక్ష కేంద్రాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సకాలంలో వెలువడని ఫలితాలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులైనా ఫలితాలు రాకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు కోవిడ్ పరీక్ష ఫీజులను అమాంతం పెంచి నిలువునా దోచుకుంటున్నాయి. వారం, పది రోజుల క్రితం వరకు రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఇప్పుడు ఏకంగా రూ,750 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని కేంద్రాలు రూ.1500 వరకు తీసుకుంటున్నాయి. నగరంలో ప్రస్తుతం ఇదో దందాగా మారింది. కొద్దిపాటి జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నా కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్ రావడంంతో జనం తప్పనిసరిగా పరీక్షలకు వెళ్లాల్సివస్తోంది. చదవండి: Corona: తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది.. అక్కడా పడిగాపులే... నగరంలోని సుమారు 200కుపైగా బస్తీ దవాఖానాలు, మరో 120 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అన్ని ఏరియా ఆస్పత్రులతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వంటి అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గ్రేటర్ పరి«ధిలో రోజుకు 50వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అంచనా. ఒక్కో ఆరోగ్య కేంద్రం వద్ద ప్రతిరోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో మాత్రం తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటోంది. బాధితుల తాకిడి, డిమాండ్ మేరకు పరీక్షలు నిర్వహించే సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల దృష్ట్యా పరీక్షల నిర్వహణలో, ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యంగా మారింది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఫలితాల కోసం 48 గంటల పాటు నిరీక్షించాల్సివస్తే మరికొన్ని చోట్ల మూడు రోజుల వరకు సమయం పడుతుంది. దీంతో బాధితులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. సాధారణ జలుబు, జ్వరమో, కోవిడ్ లక్షణాలో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలో, వద్దో తెలియడం లేదు’ అని సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి ‘తమకు తెలియకుండానే కుటుంబ సభ్యులను కూడా వైరస్‌కు గురి చేసినట్లవుతుంద’ని పద్మారావునగర్‌కు చెందిన మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగానే కొన్ని చోట్ల ఫలితాల వెల్లడిలో ఆలస్యమవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు. ‘ప్రతి రోజూ వందలాది మంది నుంచి నమూనాలను సేకరించే క్రమంలో సిబ్బంది సైతం కోవిడ్ బా రిన పడుతున్నారు’అని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు ఒకరు తెలిపారు, రెండోసారి తప్పనిసరి కాదు.. కోవిడ్ పరీక్షల కోసం రూ.వేలల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ‘సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఒమిక్రాన్ బారిన పడినవారు వారం పాటు ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే చాలు. ఆ తర్వాత ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకపోతే ఐసోలేషన్ నుంచి బయటకు రావచ్చు. మరోసారి పరీక్షలు అవసరం లేదు’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శివరాజ్ తెలిపారు. వైరస్ ఏదో చెప్పేస్తామంటూ.. బాధితుల అవసరాన్ని, ఆపదను ప్రైవేట్ లాబ్‌లు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను నిలువునా దోచుకుంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ కేంద్రాలు పరీక్ష ఫీజులు పెంచేసి దోచుకుంటున్నాయి. ఈ నెల రెండో వారం వరకు కేవలం రూ.500కే ఆర్టీపీసీఆర్ నిర్వహించిన లాబ్‌లలో ఇప్పుడు రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు పెంచారు. వైరస్ ఏ రకం వేరియంటో కూడా తమ పరీక్షల్లో తేలుతుందని, డెల్టా రకమా? ఒమిక్రానా? చెప్పేస్తామని మరికొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు రూ,1500 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నమూనాలు సేకరిస్తే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో వారం, పది రోజుల్లో ఫీజులు మరింత పెరగవచ్చు’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు ఇలా వేల రూపాయల్లో ఖర్చు చేసినప్పటికీ కొన్ని ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లోనూ 24 గంటల తర్వాతే ఫలితాలు వెలువడడం గమనార్హం. -
చౌకైన కోవిడ్ ‘స్మార్ట్’ టెస్ట్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అలాంటి ఎదురుచూపులు లేకుండా స్మార్ట్ ఫోన్ డయాగ్నస్టిక్ టూల్‌ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు. సార్స్ కోవిడ్2 జన్యు పదార్థం నుంచి దీనిని రూపొందించినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్ టెస్టు తరహాలోనే పనిచేస్తుందని, దానికంటే రెండు శాతం కచ్చితత్వం ఇస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ముక్కునుంచి సేకరించిన నమూనాతో 97 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. 20 నిమిషాల్లో తక్కువ ధరతో నిర్ధారణ చేసే ఈ టూల్ ను ఎక్కడైనా ఉపయోగించొచ్చని, స్థిరమైన ఉష్ణోగ్రతల వద్ద జరిపే ఈ పరీక్ష ఆర్టీపీసీఆర్ కంటే తక్కువ సమయాన్ని తీసుకుంటుందని తెలిపారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు) -
కరోనా హైరానా: తప్పుల తడకగా పరీక్షా ఫలితాలు
రాహుల్.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఇటీవల ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయించుకున్నాడు. సాయంత్రానికి నెగెటివ్ అని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పాజిటివ్ అని మరో మెసేజ్ వచ్చింది. దీంతో ఏది నిజమో తెలియక ఆయన ఆందోళనలో పడిపోయాడు. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నాడు. మూడురోజుల తర్వాత పాజిటివ్ అంటూ ఫలితం వచ్చింది. ఆ మూడురోజులూ ఆయన ఎంతో ఆందోళనకు గురయ్యాడు. డాక్టర్ కృష్ణ్ణకాంత్ (పేరు మార్చాం)కు, ఆయన భార్యకు ఇద్దరికీ తీవ్రమైన జలుబు, కాస్తంత జ్వరం ఉండటంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. అందులో ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇచ్చారు. రెండ్రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ‘ఇన్డిటర్మినేట్’(అనిశ్చయత) అని వచ్చింది. తర్వాత మూడో రోజు పాజిటివ్ అంటూ మరో రిపోర్టు పంపారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండగా కొందరి పరీక్షా ఫలితాల్లో ఆలస్యం, గందరగోళం చోటు చేసుకుంటుండడంతో అనుమానితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడవుతుండగా కొన్ని కేసుల్లో పాజిటివ్ అని ఒకసారి రిపోర్టు వచ్చిన కాసేపటికే నెగిటివ్ అంటూ మరో రిపోర్టు వస్తోంది. అలాగే ముందు నెగిటివ్ అని చెప్పి తర్వాత పాజిటివ్ అంటున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో సైతం కొన్ని సందర్భాల్లో ఇలాంటి గందరగోళం చోటు చేసుకుంటున్నా.. చాలావరకు కేసుల్లో రెండు మూడు రోజులకు కానీ ఫలితం రావడం లేదు. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో బాధితులు చాలాచోట్ల ప్రై వేట్ లేబరేటరీలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.1,500 వరకు వసూలు చేస్తుండటంతో జేబులు గుల్లవుతున్నాయి. 25 వేల టెస్టుల సామర్థ్యమున్నా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 34 ఆర్టీపీసీఆర్ లేబరేటరీలు ఉన్నాయి. వాటిల్లో రోజుకు 25 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చు. అయినా రోజుకు 10 వేల వరకు ఫలితాలు వెయిటింగ్లో ఉంటున్నాయి. ఆయా లేబరేటరీలపై సరైన పర్యవేక్షణ కొరవడడంతోనే పరీక్షల నిర్వహణలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున లేబరేటరీలను పూర్తిస్థాయి సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణ సమయంలో కూడా సామర్ధ్యం మేరకు టెస్టులు జరగడం లేదు. జిల్లాల్లోని లేబరేటరీల్లో ఒక్కోచోట రోజుకు 300 వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ స్థాయిలో చేస్తే రెండు మూడు రోజుల ఆలస్యం ఉండదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. చాలా లేబరేటరీలు 2 షిఫ్టులు కూడా పనిచేయడం లేదని సమాచారం. ఇంత కీలక సమయంలో ఇటువంటి అంశాలపై అధికారులు దృష్టి్ట పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడ సిబ్బంది కూడా లేక.. మరోవైపు సెకండ్ వేవ్‌లో నియమించుకున్న ల్యాబ్ టెక్నీషియన్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఆ తర్వాత కాలంలో తొలగించడం వల్ల కూడా ఇప్పుడు కీలక సమయంలో పనిచేసేవారు లేకుండా పోయారు. దీంతో తప్పుల తడక రిపోర్టులు, రెండు మూడు రోజుల ఆలస్యంతో నివేదికల వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఆలస్యపు రిపోర్టుల వల్ల పాజిటివా నెగెటివా తెలియక అనుమానితులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు బయటకు వచ్చి తిరిగేస్తున్నారు. ఇతరులకు అంటిస్తున్నారు. కొందరికి పాజిటివ్ అయినా తెలియక మందులు వాడకపోవడంతో సీరియస్ అవుతున్న పరిస్థితి కూడా నెలకొంటోంది. -
ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..
లండన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్ విజృంభణకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న భిన్నరకాల వేరియంట్లు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అయితే, శాస్త్రవేత్తలు కరోనాను ఎదుర్కొవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ రకాల వ్యాక్సిన్లపై ఇప్పటికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచదేశాలు ప్రధానంగా.. కరోనాను గుర్తించడానికి ర్యాపిడ్ ఆంటిజెన్, ఆర్టీపీసీఆర్లను పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటితో చాలా వరకు వ్యక్తిలో వైరస్ ఉన్నది.. లేనిది నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు టెస్ట్‌ల సంఖ్య పెరగడంతో ఆర్టీపీసీఆర్ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. దీంతో ఆయా వ్యక్తులు ఫలితం వచ్చేవరకు ఒకింత ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఒక తీపి కబురు అందించారు. ఇక నుంచి కరోనాను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో.. ఒక వ్యక్తి పాజిటివ్‌గా ఉన్నాడా లేదా అన్నదానిని ఎక్స్‌రే టెక్నిక్‌ను ఉపయోగించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఆర్టీపీసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూకే శాస్త్రవేత్తల ప్రకారం.. కొత్త ఎక్స్‌రే విధానంలో ఖచ్చితంగా, తక్కువ సమయంలో కరోనాను నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో వేచి ఉండే సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. దీని కోసం శాస్త్రవేత్తల బృందం కృత్రిమ మేధస్సును ఉపయోగించినట్లు తెలిపారు. దీనికోసం కరోనాతో బాధపడుతున్న వారు, నిమోనియాలో బాధపడుతున్నవారు, ఆరోగ్యవంతుల్లోని ఎక్స్‌రే స్కాన్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 3000 ఎక్స్‌రేలను చూశామని, వీటిలో కరోనా నిర్ధారణ 98 శాతం ఖచ్చితత్వంతో నిర్ధారించిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ స్కాట్లాండ్ (యూడబ్ల్యూఎస్)లో ఒక బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనితో ఇక నుంచి టెస్ట్‌ల సంఖ్య పెంచుకోవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల వైరస్ విజృంభణతో కరోనా కిట్ల కొరత నెలకొంది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ నయీమ్ రంజాన్ మాట్లాడుతూ.. ఇది కరోనాను వెంటనే నిర్ధారిస్తుందని తెలిపారు.ఇది ఆర్టీపీసీఆర్కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని తెలిపారు. ప్రపంచంలో కేసులు పెరగడం, రోగ నిర్ధారణ సాధనాల తక్కువడా ఉండటం వలన పెద్ద సంఖ్యలో కొవిడ్ పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయని పేర్కొన్నారు. అయితే, కొత్త ఎక్స్ రే విధానంతో సులభంగా కరోనాను గుర్తించవచ్చని తెలిపారు. అయితే, ఎక్స్‌రే రేటియేషన్తో మానవునిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ కిరణాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. వైద్యులు కొవిడ్ పరీక్షల కోసం తక్కువ మోతాదులో రేటియేషన్ ఉపయోగిస్తారని తెలిపారు. అయితే, ఈ కొత్త సాంకేతికను ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుందని ప్రొఫెసర్ రంజన్ అభిప్రాయపడ్డారు. చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్ కంటే -
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్ట్ ధర తగ్గింపు
-
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
-
ఆర్టీపీసీఆర్ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్ రేటును సవరిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్ఏబీఎల్ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్ఏబీఎల్ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు. 6,996 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి. వైరస్ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384 చేరింది. ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది. -
కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
కోవిడ్ టెస్ట్ ఇంట్లోనే
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వెళ్లి క్యూలైన్లో నిల్చొవాల్సిన పనిలేదు.. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇంట్లోనే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతించింది. టెస్ట్ కిట్లను మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతిస్తారు. పరీక్ష చేసుకునే విధానం కిట్ లో ఉంటుందని వైద్య, ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. కిట్ ధరను మాత్రం త్వరలో వెల్లడించ నున్నాయి. ఇప్పటికే అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్టీపీసీఆర్ ఆసుపత్రుల్లోనే.. ఇప్పటివరకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు తదితర చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేసేవారు. ప్రైవేట్‌లో ఈ టెస్టులు అందుబాటులో లేవు. పది నిమిషాల్లో ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో 90 శాతం పరీక్షలు ర్యాపిడ్ యాంటిజెన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. రోజుకు వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తుంటారు. దీనికోసం లైన్లలో నిలబడటం ప్రయాసగా మారింది. పైగా కరోనా ఉన్నవారు ఇతరులకు అంటించే కేంద్రాలుగా కూడా ఆసుపత్రుల వద్ద పరిస్థితి తయారైంది. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులన్నీ తగ్గనున్నాయి. కొన్నిచోట్ల అనధికారికంగా కొన్ని లేబొరేటరీల్లో నిర్వాహకులు ఇంటికొచ్చి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కాగా, ర్యాపిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే చేస్తారు. ఇంటి వద్దకే మందులు.. ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తారు. ఈ మేరకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరికివారు సొంతంగా పరీక్షలు చేయించుకుంటే ఆ వివరాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎంతమందికి కరోనా సోకిందో పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉండదన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే స్వాబ్‌ను సరిగా తీయకుంటే సరైన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 25 లక్షల మేరకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు కోట్ల వరకు కొనుగోలు చేస్తారు. -
తిరుమల వెళ్లాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్‌లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ -
ప్రయాణికులకు ఊరట.. ఆర్టీపీసీఆర్ @రూ. 750
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షల ధరలు తగ్గాయి. కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరీక్షల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాప్ మై జినోమ్ సంస్థ ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షల ధరలను తగ్గించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ధర గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు రూ.3,900కు తగ్గించారు. సాధారణ ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ఇప్పటి వరకు రూ.999 ఉండగా తాజాగా రూ.750కి తగ్గించారు. ఎయిర్‌పోర్టులో చార్జీలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నగరంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కేవలం రూ.500 ఉన్న విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్న మ్యాప్ మై జినోమ్ సంస్థ ధరలను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ.. ►కొద్ది రోజులుగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ దేశాల నుంచి ప్రతి రోజు సుమారు 5వేల మంది ప్రయాణికులు నగరానికి చేరుకుంటున్న ట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం యూరప్ దేశాలు, న్యూజిలాండ్, సింగపూర్, తదితర 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. ►ఈ 11 దేశాల నుంచి ప్రతి రోజు వచ్చే సుమారు 500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఆయా దేశాల నుంచి బయలుదేరే సమయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకొన్నప్పటికీ ఎయిర్‌పోర్టులో మ రోసారి పరీక్షించి నెగెటివ్ వచి్చన వారిని ఇళ్లకు అనుమతినిస్తున్న సంగతి తెలిసిందే. సమర్థంగా పరీక్షలు... ►ఐసీఎంఆర్ ఆమోదించిన మ్యాప్ మై జినోమ్ సంస్థ గతేడాది నవంబరు నుంచి ఎయిర్‌పోర్టు లో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తోంది. నమూనాలు సేకరించిన అర్ధ గంట వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకొనేందుకు ర్యాపిడ్ ఆరీ్టపీసీఆర్ దోహదం చేస్తోంది. ►ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం కొంత సమయం పట్టవచ్చు. సుమారు 200 మంది టెక్నీషియన్లు మ్యాప్ మై జినోమ్ లేబొరేటరీలో నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, బెంగళూర్ తదితర విమానాశ్రయాల్లోనూ మ్యాప్ మై జినోమ్ సేవలందజేస్తోంది.