చెన్నై: ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్‌ను నిర్ధారించడం కోసం చెన్నైకి చెందిన ఒక కంపెనీ ఆర్‌టీ–పీసీఆర్ కిట్‌ను రూపొందించింది. సాధారణంగా దట్టమైన అటవీప్రాంతాలున్న పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో మాత్రమే కనపడే మంకీపాక్స్ వైరస్ ఈ ఏడాది ఇప్పటికే 20 దేశాల్లో 200కిపైగా కేసులతో ఆందోళన పుట్టిస్తోంది. ఈ వైరస్ భారత్‌కూ విస్తరిస్తే వెంటనే నిర్ధారించుకోవడానికి చెన్నైకి చెందిన వైద్య పరికరాలు రూపొందించే ట్రివిట్రాన్ హెల్త్‌కేర్ అనే కంపెనీ ఈ పరీక్ష కిట్‌ను రూపొందించింది.
నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారిత కిట్ ఇది. దీని ద్వారా స్మాల్‌పాక్స్, మంకీపాక్స్ మధ్య తేడాలను తెలుసుకోవడమే కాకుండా పరీక్ష ఫలితాలు ఒక గంటలోనే వచ్చేస్తాయి. ఈ పరీక్ష నిర్వహించడానికి పొడి స్వాబ్‌లు, వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా (వీటీఎం)లో ఉంచే స్వాబ్‌లను వినియోగించి తెలుసుకోవచ్చునని సంస్థ సీఈఓ చంద్ర గంజూ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
వివిధ దేశాల్లో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి దశలో ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంటువ్యాధుల సన్నద్ధత డైరెక్టర్ సిల్వీ బ్రియాండ్ చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో ఈ వైరస్ బయటపడకపోయినప్పటికీ కేంద్రం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ వైరస్‌పై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని భరోసా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment