ఫొటో సోర్స్: యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వెబ్‌సైట్
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అలాంటి ఎదురుచూపులు లేకుండా స్మార్ట్ ఫోన్ డయాగ్నస్టిక్ టూల్‌ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు.
సార్స్ కోవిడ్2 జన్యు పదార్థం నుంచి దీనిని రూపొందించినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ తెలిపింది. ఇది ఆర్టీపీసీఆర్ టెస్టు తరహాలోనే పనిచేస్తుందని, దానికంటే రెండు శాతం కచ్చితత్వం ఇస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ముక్కునుంచి సేకరించిన నమూనాతో 97 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.
20 నిమిషాల్లో తక్కువ ధరతో నిర్ధారణ చేసే ఈ టూల్ ను ఎక్కడైనా ఉపయోగించొచ్చని, స్థిరమైన ఉష్ణోగ్రతల వద్ద జరిపే ఈ పరీక్ష ఆర్టీపీసీఆర్ కంటే తక్కువ సమయాన్ని తీసుకుంటుందని తెలిపారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment