air passenger
-
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు..
న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు. బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..
వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
విమానంలో టాయిలెట్ వాడొద్దన్న సిబ్బంది.. మహిళ ఏం చేసిందంటే..
వాషింగ్టన్: అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటలపాటు ఓపిక పట్టిన ఆ మహిళ ఇంక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఫ్లైట్లలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు కొన్ని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఓ ప్రయాణికుడు ఫుల్లుగా తాగి తోటి ప్రయాణికుడి మీద మూత్రం పోయడం, ప్రయాణికులను మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయిన పైలట్.. ఇలా వరుసగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో జరిగిన అలాంటి ఓ సంఘటన హెడ్ లైన్స్ లో నిలిచింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ ఒకరు తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పగా వారు ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు. అలాగే ఆమెను నీళ్లు ఎక్కువగా తాగమని లేదంటే మూత్రవిసర్జన చేసినప్పుడు ఫ్లైటంతా దుర్వాసన వస్తుందని కూడా ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె చాలాసేపు ఓపికపట్టి కూర్చుంది. ఆలా రెండు గంటలు ఓపిగ్గా ఎదురు చూసిన తర్వాత కూడా సిబ్బంది టాయిలెట్‌కు అనుమతించకపోవడంతో ఆమె ఫ్లోర్ మీదనే మూత్రవిసర్జన చేసింది. అనంతరం ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నించగా.. మీ అనుమతి కోసం ఎంతసేపు ఆగాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు మహిళ. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఎదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని అత్యధికులు స్పందించడం కొసమెరుపు. 🇺🇸 ÉCART CIVILISATIONNEL : 20/07/2023 Une Afro-américaine à bord d'un vol @SpiritAirlines urine sur le sol parce qu'elle ne veut pas attendre qu'ils ouvrent les toilettes après le décollage. Les hôtesses de l'air, quant à elles, lui disent qu'elle devrait boire de l'eau "parce… pic.twitter.com/EQbPGy0NFK — Valeurs Occidentales (@ValOccidentales) July 21, 2023 ఇది కూడా చదవండి: భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి -
డిసెంబర్లో పెరిగిన విమాన ప్రయాణికులు
దేశీ విమాన ప్రయాణికుల రద్దీ 2022 డిసెంబర్ నెలలో 1.29 కోట్లుగా ఉంది. 2021 డిసెంబర్‌తో పోల్చినప్పుడు 15 శాతం పెరిగింది. కానీ 2019 డిసెంబర్ గణాంకాల కంటే ఒక శాతం తక్కువ. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఏవియేషన్‌పై ఓ నివేదిక విడుదల చేసింది. దేశీ ఏవియేషన్ పరిశ్రమ పట్ల ప్రతికూల అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్టు ఇక్రా తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల రద్దీ 9.86 కోట్లుగా (986 లక్షలు) ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 63 శాతం అధికం కాగా, 2019లో ఇదే కాలంతో పోల్చినా 9 శాతం వృద్ధి కనిపిస్తోంది. గత నెలలో ఎయిర్‌లైన్స్ సంస్థలు దేశీ మార్గాల్లో అధిక సర్వీసులను నడిపించగా, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పటికీ 7 శాతం తక్కువగానే ఉన్నాయి. 2022 డిసెంబర్లో ప్యాసింజర్ లోడ్ (ప్రయాణికుల భర్తీ రేటు) 91 శాతంగా ఉంటే, 2021 ఇదే నెలలో 80 శాతం, 2019 డిసెంబర్లో 88 శాతం చొప్పున ఉంది. కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకున్నందున 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల రద్దీలో వేగవంతమైన పునరుద్ధరణను చూస్తున్నట్టు ఇక్రా తెలిపింది. అయితే ఏటీఎఫ్ ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలు క్షీణించినందున ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాల రికవరీ నిదానించొచ్చని పేర్కొంది. పెరిగిపోయిన వ్యయాల ఫలితంగా రూ.15,000–17,000 కోట్ల నష్టాలు నమోదు చేయవచ్చని ఇక్రా అంచనా వేసింది. 2021–22లో నికర నష్టాలు రూ.23,500 కోట్ల కంటే తక్కువేనన్న విషయాన్ని గుర్తు చేసింది. రుణాల ఒత్తిళ్లు సమీప కాలంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థలపై రుణ ఒత్తిళ్లు కొనసాగుతాయని ఇక్రా తెలిపింది. నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకోవడం లేదా ఈక్విటీ రూపంలో నిధులు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టనంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. ఏటీఎఫ్ ధరలు అదే పనిగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగొచ్చని అంచనా వేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయాలు పెరిగినా కానీ, ఏటీఎఫ్ ధరల ప్రభావాన్ని అవి పూడ్చుకోలేవని పేర్కొంది. కనుక సమీప కాలంలో దేశీ ఎయిర్‌లైన్స్ ఆర్థిక పనితీరు ఒత్తిడితో కొనసాగుతుందని తెలిపింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల లీజ్ అద్దెలు, నిర్వహణ వ్యయాల రూపంలో వాటి మొత్తం వ్యయాలపై గణనీయమైన భారం పడుతున్నట్టు పేర్కొంది. ఇంధన ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నందున.. ఈ తరుణంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలన్న ఎయిర్‌లైన్స్ సంస్థల ఆకాంక్షలు వాటి మార్జిన్ల విస్తరణ అవకాశాలను పరిమితం చేస్తుందని వివరించింది. -
హమ్మయ్యా.. గాల్లో తేలుతున్నారు, మళ్లీ పాత రోజులొస్తున్నాయ్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. తద్వారా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ ట్రాఫిక్ 75 శాతం మేర వృద్ధి సాధించవచ్చని సూచనతప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ రూట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నందున.. దేశీ రూట్లలో ప్రయాణాలు ఇందుకు ఊతంగా ఉండగలవని క్రిసిల్ వివరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 34 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో (ఆగస్టు వరకు) అప్పటి గణాంకాలతో పోలిస్తే 88 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ నమోదైనట్లు క్రిసిల్ పేర్కొంది. బిజినెస్ ట్రావెల్ సెంటిమెంటు, అంతర్జాతీయంగా ప్రయాణాలు పెరుగుతుండటం, విమానాలు పూర్తి సామర్థ్యాలతో పని చేయడం మొదలయ్యే కొద్దీ మిగతా నెలల్లో ఇది ఇంకా పుంజుకోగలదని వివరించింది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ రికవరీ, ఆదాయ అంచనాలు మొదలైనవన్నీ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని క్రిసిల్ పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! కరోనా ముందు ఏటా 12 శాతం వృద్ధి.. 2015–2020 మధ్య విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 12 శాతం వార్షిక వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీములతో చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం మొదలైన అంశాలు ఇందుకు తోడ్పడ్డాయని నివేదికలో క్రిసిల్ పేర్కొంది. అయితే, ఆ తర్వాత 2021 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి తెరపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పడిపోయింది. పలు వేవ్‌లు, ప్రయాణాలపై ఆంక్షల కారణంగా 2021–22లో పాక్షికంగానే రికవర్ అయింది. 2019–20తో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 55 శాతానికే పరిమితమైంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
బూట్లలో రెండు కేజీల బంగారం
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బూట్లలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన ఇబ్రహీం ఖలీస్ కునిల్ మంగళవారం రాత్రి పది గంటలకు దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో వచ్చాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీ సమయంలో అతని రెండు బూట్లలో కేజీ చొప్పున రెండు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.54.2 లక్షలని అధికారులు అంచనా వేశారు. అనంతరం అతన్ని మంగళూరు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్. పాటిల్ ఎదుట హాజరు పరచగా, ఈ నెల 17 వరకు జుడీషియల్ కస్టడీకి ఆదేశించారు. -
బ్యాగ్ హ్యాండిల్స్, సెల్‌ఫోన్ ఛార్జర్లలో బంగారం
-
బ్యాగ్ హ్యాండిల్స్, సెల్‌ఫోన్ ఛార్జర్లలో బంగారం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వీరంతా బ్యాగ్ హ్యాండిల్స్, సెల్‌ఫోన్ ఛార్జర్లలో బంగారాన్ని తీసుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నలుగురు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా తమిళనాడుకు చెందినవారు. నిన్న కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
'షూ'లో దాచినా అడ్డంగా దొరికిపోయారు
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నా.... అక్రమంగా బంగారం తరలింపు మాత్రం ఆగటం లేదు. తాజాగా అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు షూలో బంగారాన్ని దాచిన విషయం బయటపడింది. దాంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా బంగారంపై ఆంక్షలు పెరగటంతో శంషాబాద్ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు హైదరాబాద్ ప్రధాన ద్వారంగా మారిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుంటున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీనివిలువ మార్కెట్ లో రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జనవరి, ఫిబ్రవరి నెలలో భారీగానే బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద అత్యాధునిక పరికరాలు ద్వారా తనిఖీలు చేస్తున్నా కొందరు కనుగప్పి చాకచక్యంగా బంగారాన్ని తీసుకొస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రూ. 7 లక్షల బంగారం పట్టివేత
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని సోదా చేశారు. ఆ క్రమంలో అతడి బట్టలలో రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.