ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..  | Man Fat Shames Woman Occupying More Seats On A Plane | Sakshi
Sakshi News home page

ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..  

Published Mon, Jul 24 2023 12:31 PM | Last Updated on Mon, Jul 24 2023 1:26 PM

Man Fat Shames Woman Occupying More Seats On A Plane - Sakshi

వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. 

అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. 

అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. 

అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. 

ఇది కూడా చదవండి: కూతురు అబార్ష‌న్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement