bizarre incident
-
ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..
వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు..
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీలో ఒక మహిళ తన వివాహంలో జరిగిన పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. పెళ్ళిలో తన భర్త సంతకం చెయ్యాల్సిన చోట మామగారు సంతకం పెట్టడంతో మామగారితోనే వివాహమైనట్టు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారని, ప్రస్తుతం తనకు ఇద్దరు భర్తలని చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియా ప్రఖ్యాత బ్రేక్ ఫాస్ట్ రేడియో షో ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ కార్యక్రమంలో ఆరోజు ఫోన్ చేసిన వారందరినీ తమ జీవితంలో జరిగిన పేద పొరపాట్లగురించి చెప్పమని అడిగారు వ్యాఖ్యాత. దీంతో కిమ్ అనే ఒక మహిళ తాన్ పెళ్ళిలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్ళికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు అత్తగారు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరిగ్గా పెళ్లి సమయానికి మా అత్తగారు మామగారితో పాటు సాక్షి సంతకం చెయ్యమని నా భర్తను కోరారు. దీంతో వారిద్దరూ ఒకే లైన్ సంతకం చేశారు. తీరా సర్టిఫికెట్లో చూస్తే వధువు అని ఉన్న చోట నా సంతకం ఉంటే వరుడు అని ఉన్నచోట మాత్రం నా భర్తతో పాటు మా మామగారి పేరు కూడా ఉంది. ఆ సర్టిఫికెట్ ను ఇంకా మార్చకుండా అలాగే భద్రం చేసుకున్నానని తెలిపింది. ఇది కూడా చదవండి: కిమ్ జోంగ్ చెరలో అమెరికా సైనికుడు.. బయటపడేనా..? -
గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!
రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
వింత ఘటన: కోడి పుంజుకి దశదిన కర్మ... ఏకంగా 500 మందికి భోజనాలు
ఇటీవల కాలంలో వింతవింత ఆచారాలను చూస్తున్నాం. కొంతమంది తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేస్తుండటం విన్నాం. కొంతమంది వాటిపై ప్రేమకొద్ది సమాధులు కట్టించడం వంటివి చేయడం కూడా చూశాం. ఏదో మనుషులు చనిపోతే చేసే తతంగాలన్నింటికి చేయడమే కాక భోజనాలు పెట్టడం గురించి విన్నమా? లేదుకదా! కానీ ఇక్కడోక కుటుంబం అలానే చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....ఉత్తరప్రదేశ్‌లోని ఒక కుటుంబం తమ పెంపుడు కోడి పుంజు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా మనుషులు చనిపోతే చేసినట్లు అన్ని తతంగాలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ కోడి పుంజు ఆ కుటుంబం పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రెపిల్లను వీధి కుక్కల భారి నుంచి ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఐతే ఆ క్రమంలో ఆ కోడిపుంజు తీవ్రంగా గాయపడటంతో వెంటనే చనిపోయింది. దీంతో ఆ కోడి పుంజుకి మనిషి చనిపోతే ఎలా చేస్తారో అలా అంత్యక్రియలు నిర్వహించాడు. మన కుటుంబంలోని మనిషి మాదిరిగా మన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది కాబట్టి మనుషులకు చేసే విధంగా ఆచారాలన్నింటిని ఈ కోడి పుంజుకి నిర్వహిద్దాం అని తన తండ్రి చెప్పడంతో ఇలా చేశాం అని చెబుతున్నాడు అభిషేక్. ఆ కోడిపుంజు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పెద్ద ఎత్తున దశదిన కర్మ నిర్వహించింది ఆ కుటుంబం. పైగా ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది దాక హాజరవ్వడం విశేషం. (చదవండి: రోబోటిక్ డాగ్ ... సైనికుడిలా కాల్పులు జరుపుతోంది) -
విద్యార్థుల తలపై అట్టపెట్టెలు.. మంత్రి ఆగ్రహం!
బెంగళూరు : విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు ‘వినూత్న’ విధానాన్ని అవలంభించిన కాలేజీ యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు కూడా మనుషులేనని... వారిని జంతువుల్లా భావించడం సరికాదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని హవేరీ పట్టణంలో గల భగత్ ప్రీ-యూనివర్సిటీ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరి పేపర్లలో ఒకరు చూసి రాయకుండా చేసేందుకు లెక్చరర్లు వారి తలపై అట్టెపెట్టెలు బోర్లించారు. అంతేగాకుండా పెట్టె పక్కకు పోయిన ప్రతిసారీ ఇన్విజిలేటర్ వచ్చి విద్యార్థులను హెచ్చరిస్తూ వాటిని సరిచేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది విద్యార్థులకు మాత్రం అట్టపెట్టెల నుంచి లెక్చరర్లు మినహాయింపు ఇచ్చారు. ఇక ఈ విషయంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రవర్తించిన తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులను జంతువుల్లా ట్రీట్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంపై కఠిన చర్యలు ఉంటాయి’అని ట్వీట్ చేశారు. ఇక ఈ ఘటన గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. విషయం తెలిసి తాము కాలేజీ వద్దకు వెళ్లామని... అట్టెపెట్టెలు తొలగించామని తెలిపారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని... ఇటువంటి విషయాల్లో విద్యార్థులు చెప్పినట్లు వినాల్సిన పనిలేదని వారికి చెప్పామన్నారు. అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకోవడం విశేషం. కాలేజీ హెడ్ సతీశ్ మాట్లాడుతూ.. బిహార్‌లో కూడా ఇటువంటి విధానం అనుసరించారని.. తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. విద్యార్థులు పక్క చూపులు చూడకుండా ఇదో సరికొత్త ప్రయోగం అని పేర్కొన్నారు. -
పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!
లక్నో : తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి దాడి చేశాడు. మద్యం మత్తులో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇతా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో వాళ్ల ఇంట్లో పాము దూరింది. ఈ క్రమంలో మత్తులో జోగుతున్న అతడిన పాము కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ దానిని నోట్లో పెట్టుకుని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం గట్టిగా కేకలు వేస్తూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఈ విషయం గురించి అతడి తండ్రి మాట్లాడుతూ.. తాగి ఉన్న కారణంగానే తన కొడుకు ఇలా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కొడుకు చికిత్స చేయించే స్థోమత తనకు లేదని.. వైద్యులే దయతలచి తనని కాపాడాలని వేడుకున్నాడు. కాగా రాజ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని.. అతడు బతికే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
విమానం ఎక్కుతూ బామ్మ ఎంతపనిచేసింది?
షాంఘై: చైనాలో ఓ పెద్దావిడ చేసిన పనికి బయల్దేరాల్సిన విమానాన్ని హఠాత్తుగా ఆపేశారు. అప్పటి కప్పుడు విమానం ఇంజిన్‌ను విప్పదీసి మరమ్మత్తు చేసినంత పనిచేశారు. దాంతో కొన్ని గంటలు ఆలస్యంగా ఆ విమానం బయల్దేరాల్సి వచ్చింది. ఆ పని చేసిన బామ్మను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ బామ్మ చేసిన పని ఏమిటని అనుకుంటున్నారా? మరేం లేదు విమానం ఎక్కేందుకు వెళ్లి తాఫీగా ఇంజిన్లోకి ఓ తొమ్మిది నాణాలను విసిరేసింది. ఇది చూసిన ఓ ప్రయాణీకుడు సిబ్బందికి చెప్పడంతో ఈ తంతు మొదలైంది. వివరాల్లోకి వెళితే.. షాంఘై పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనా విమానం సీజెడ్ 380 గాంగ్జౌ పట్టణానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. గాంగ్జౌకు వెళ్లేందుకు ఓ 80 ఏళ్ల బామ్మ ఆమె భర్త, కూతురు, అల్లుడు కలిసి విమానం ఎక్కేందుకు వచ్చారు. ఆమెకు అతీతశక్తులమీద బాగా నమ్మకం. దీంతో తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోపాటు తనకు కలిసి వస్తుందని ఒక తొమ్మిది నాణాలను విమానం ఇంజిన్లోకి విసిరేయడంతో అది చూసిన ఓ ప్యాసింజర్ సిబ్బందికి చెప్పగా విమానాన్ని ఆపేశారు. అందులో అప్పటికే ఎక్కి కూర్చున్న 150మందిని ఉన్నపలంగా దింపేశారు. దాదాపు తొలుత ఇంజిన్ భాగాన్ని తీసి వెతగ్గా ఎనిమిది నాణాలు మాత్రం లభించాయి. మరో నాణం దొరక్కపోవడంతో ఇంజిన్ భాగాన్ని విప్పదీసి చూడగా అందులో ఇరుక్కుపోయి కనిపించింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. చివరకు నాణాన్ని తొలగించి విమానాన్ని సిద్ధం చేసి పంపించారు. బామ్మని కుటుంబ సభ్యులను మాత్రం అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు విచారిస్తున్నారు.