లక్నో : తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి దాడి చేశాడు. మద్యం మత్తులో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇతా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో వాళ్ల ఇంట్లో పాము దూరింది.
ఈ క్రమంలో మత్తులో జోగుతున్న అతడిన పాము కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ దానిని నోట్లో పెట్టుకుని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం గట్టిగా కేకలు వేస్తూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఈ విషయం గురించి అతడి తండ్రి మాట్లాడుతూ.. తాగి ఉన్న కారణంగానే తన కొడుకు ఇలా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కొడుకు చికిత్స చేయించే స్థోమత తనకు లేదని.. వైద్యులే దయతలచి తనని కాపాడాలని వేడుకున్నాడు. కాగా రాజ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని.. అతడు బతికే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment