Etah
-
'ఆంటీ' అన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది
లక్నో: అమ్మాయిలకు హెచ్చరిక, అపరిచిత మహిళలను ఆంటీ అని పిలిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొరపాటున ఆంటీ అని పిలిచినప్పుడు వాళ్లకు తిక్క లేస్తే మీ జుట్టు కత్తిరించి చేతిలో పెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. యూపీలోని ఈటాలో బాబూగంజ్ మార్కెట్లో కొందరు మహిళలు షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి అక్కడే ఉన్న ఓ మహిళను ఆంటీ అని పిలిచింది. (చదవండి: ఇతగాడి దొంగ తెలివి మామూలుగా లేదు) అంతే ఆమెకు ఉక్రోషం కట్టలు తెంచుకుంది. 'నన్నే ఆంటీ అంటావా?' అంటూ పళ్లు కొరుకుతూ అమ్మాయి జుట్టు పట్టుకుని మరీ చితకబాదింది. ఆమె అలా వీరబాదుడు బాదుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మరికొందరు మహిళలు ఆమెకు సాయం చేయడం గమనార్హం. ఇంతలో ఓ మహిళా పోలీసు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘర్షణపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇక ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆంటీ అంటే మీదపడి కొట్టేస్తారా? అని నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్!) -
పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!
లక్నో : తనను కరిచిన పాముపై ఓ వ్యక్తి దాడి చేశాడు. మద్యం మత్తులో దానిని కొరికి ముక్కలు చేశాడు. అనంతరం తనను కాపాడాలంటూ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇతా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో వాళ్ల ఇంట్లో పాము దూరింది. ఈ క్రమంలో మత్తులో జోగుతున్న అతడిన పాము కరిచింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ దానిని నోట్లో పెట్టుకుని ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం గట్టిగా కేకలు వేస్తూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఈ విషయం గురించి అతడి తండ్రి మాట్లాడుతూ.. తాగి ఉన్న కారణంగానే తన కొడుకు ఇలా ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కొడుకు చికిత్స చేయించే స్థోమత తనకు లేదని.. వైద్యులే దయతలచి తనని కాపాడాలని వేడుకున్నాడు. కాగా రాజ్ కుమార్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని.. అతడు బతికే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు కాల్పులు
ఎతాహ్(ఉత్తరప్రదేశ్): తనపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను నిరోధించేందుకు ప్రయత్నించిన మహిళపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె గాయాలపాలయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలీ మలాన్ జిల్లాలోగల సెంధారిలో చోటుచేసుకుంది. ఇంట్లో పనిముగించుకుని ఆరుబయట కూర్చున్కన మహిళ వద్దకు ముందుగా సునీల్ అనే వ్యక్తి వచ్చాడు. ఆతర్వాత మరో ముగ్గురు అక్కడికి చేరుకుని లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె వారిని తీవ్రంగా అడ్డుకుంది. ఆ క్రమంలో సునీల్ తన చేతిలోని తుపాకీతో కాల్పులు జరిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది కానీ, ఇంతవరకు నిందితులనెవరినీ అరెస్టు చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.