ఎతాహ్(ఉత్తరప్రదేశ్): తనపై ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను నిరోధించేందుకు ప్రయత్నించిన మహిళపై కాల్పులు జరిపారు. దీంతో ఆమె గాయాలపాలయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కొత్వాలీ మలాన్ జిల్లాలోగల సెంధారిలో చోటుచేసుకుంది. ఇంట్లో పనిముగించుకుని ఆరుబయట కూర్చున్కన మహిళ వద్దకు ముందుగా సునీల్ అనే వ్యక్తి వచ్చాడు.
ఆతర్వాత మరో ముగ్గురు అక్కడికి చేరుకుని లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె వారిని తీవ్రంగా అడ్డుకుంది. ఆ క్రమంలో సునీల్ తన చేతిలోని తుపాకీతో కాల్పులు జరిపారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది కానీ, ఇంతవరకు నిందితులనెవరినీ అరెస్టు చేయలేదు. వారు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు కాల్పులు
Published Thu, Aug 13 2015 2:49 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM
Advertisement
Advertisement