లక్నో: అమ్మాయిలకు హెచ్చరిక, అపరిచిత మహిళలను ఆంటీ అని పిలిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొరపాటున ఆంటీ అని పిలిచినప్పుడు వాళ్లకు తిక్క లేస్తే మీ జుట్టు కత్తిరించి చేతిలో పెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. యూపీలోని ఈటాలో బాబూగంజ్ మార్కెట్‌లో కొందరు మహిళలు షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి అక్కడే ఉన్న ఓ మహిళను ఆంటీ అని పిలిచింది. (చదవండి: ఇతగాడి దొంగ తెలివి మామూలుగా లేదు)
అంతే ఆమెకు ఉక్రోషం కట్టలు తెంచుకుంది. 'నన్నే ఆంటీ అంటావా?' అంటూ పళ్లు కొరుకుతూ అమ్మాయి జుట్టు పట్టుకుని మరీ చితకబాదింది. ఆమె అలా వీరబాదుడు బాదుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మరికొందరు మహిళలు ఆమెకు సాయం చేయడం గమనార్హం. ఇంతలో ఓ మహిళా పోలీసు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘర్షణపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇక ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆంటీ అంటే మీదపడి కొట్టేస్తారా? అని నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment