శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రూ. 7 లక్షల బంగారం పట్టివేత | Gold worth over Rs. 7 lakhs recovered from air passenger at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రూ. 7 లక్షల బంగారం పట్టివేత

Published Sun, Feb 16 2014 8:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

Gold worth over Rs. 7 lakhs recovered from air passenger at shamshabad airport

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

అనంతరం అతడిని సోదా చేశారు. ఆ క్రమంలో అతడి బట్టలలో రూ. 7 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement