సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమరారాజ బ్యాటరీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నిర్మాణంలో ఉన్న అమరారాజా బ్యాటరీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వెంటనే.. మూడో అంతస్తులోకి వ్యాపించాయి. దీంతో, అక్కడ పనిచేస్తున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment