న్యూఢిల్లీ: విద్య లేని వారిలోనే కాదు విద్యాధికుల్లో కూడా వింతపశువులు ఉంటారని రుజువు చేశాడు ఓ ప్రొఫెసర్. తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి తనని లైంగికంగా వేధించారని బాధితురాలైన 24 ఏళ్ల డాక్టర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ప్రొఫెసర్ ని అదుపులోకి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుండి ముంబై బయలుదేరిన ఓ విమానంలో ప్రొఫెసర్(47), డాక్టర్(24) పక్కపక్కన సెట్లలో కూర్చున్నారు. ప్రయాణం మొదలైంది మొదలు ప్రొఫెసర్ ఇష్టానుసారంగా తనపై చేతులు వేస్తూ లైంగికంగా వేధించారని, ప్రశ్నించినందుకు తనతోపాటు ఫ్లైట్ సిబ్బందితో కూడా వాదనకు దిగారని.. ఫ్లైట్ ముంబైలో దిగేంతవరకు ప్రొఫెసర్ వేధిస్తూనే ఉన్నారని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు సహర్ పోలీసులు.
బాధితురాలి కంప్లైంట్ ఆధారంగా నిందితుడైన ప్రొఫెసరుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
Comments
Please login to add a commentAdd a comment