ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరవచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. తద్వారా వార్షిక ప్రాతిపదికన ప్యాసింజర్ ట్రాఫిక్ 75 శాతం మేర వృద్ధి సాధించవచ్చని సూచనతప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ రూట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నందున.. దేశీ రూట్లలో ప్రయాణాలు ఇందుకు ఊతంగా ఉండగలవని క్రిసిల్ వివరించింది.
2019–20 ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 34 కోట్లుగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో (ఆగస్టు వరకు) అప్పటి గణాంకాలతో పోలిస్తే 88 శాతం మేర ప్యాసింజర్ ట్రాఫిక్ నమోదైనట్లు క్రిసిల్ పేర్కొంది. బిజినెస్ ట్రావెల్ సెంటిమెంటు, అంతర్జాతీయంగా ప్రయాణాలు పెరుగుతుండటం, విమానాలు పూర్తి సామర్థ్యాలతో పని చేయడం మొదలయ్యే కొద్దీ మిగతా నెలల్లో ఇది ఇంకా పుంజుకోగలదని వివరించింది.
అయితే, ఎయిర్ ట్రాఫిక్ రికవరీ, ఆదాయ అంచనాలు మొదలైనవన్నీ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటాయని క్రిసిల్ పేర్కొంది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు!
కరోనా ముందు ఏటా 12 శాతం వృద్ధి..
2015–2020 మధ్య విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 12 శాతం వార్షిక వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీములతో చిన్న పట్టణాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం మొదలైన అంశాలు ఇందుకు తోడ్పడ్డాయని నివేదికలో క్రిసిల్ పేర్కొంది.
అయితే, ఆ తర్వాత 2021 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి తెరపైకి రావడంతో ఎయిర్ ట్రాఫిక్ ఒక్కసారిగా పడిపోయింది. పలు వేవ్‌లు, ప్రయాణాలపై ఆంక్షల కారణంగా 2021–22లో పాక్షికంగానే రికవర్ అయింది. 2019–20తో పోలిస్తే ప్యాసింజర్ ట్రాఫిక్ 55 శాతానికే పరిమితమైంది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment