Punjab Congress Chief Shares Video Of Horrifying Experience On IndiGo Flight, Video Viral - Sakshi
Sakshi News home page

ఆ విమానంలో ప్రయాణం.. గంటన్నరపాటు నరకం అంటున్న ప్యాసింజర్లు

Published Sun, Aug 6 2023 4:07 PM | Last Updated on Sun, Aug 6 2023 5:55 PM

Congress Leader Shares Indigo Flight, Passengers Suffers Over No Ac - Sakshi

ఇటీవల విమాన ప్రయాణికులకు సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడమో, లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వీటిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే వీటిని పునరావృతం కాకుండా మాత్రం చేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా  ఇండిగో విమానంలోని ప్యాసింజర్లు గంటకు పైగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చండీఘడ్ నుంచి జైపూర్ వెళుతుండగా ఈ పరిస్థితి ఎదురైనట్టు సమాచారం. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌లో ఏముందంటే... విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో తాము 90 నిమిషాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తొలుత తాము విమానంలోకి వెళ్లేందుకు దాదాపు 15 నిమిషాల వరకు సెగలు కక్కుతున్న వాతావరణంలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు.  ఆ తరువాత ఏసీ ఆన్‌లో లేనప్పటికీ విమానాన్ని టేకాఫ్ చేసినట్లు చెప్పారు. అమరీందర్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘‘విమానం బయలుదేరిన సమయం నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇంత పెద్ద సమస్యను ఎవరు పట్టించుకోలేదు. శ్వేదం తుడుచుకునేందుకు మా అందరికీ ఎయిర్‌హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పేపర్లు, టిష్యులతో విసురుకుంటూ కనిపించారు’’ అసలు విమానంలో ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థంకావడంలేదన్నారు. కాగా ఈ ట్వీట్‌ను డీజీసీఏ, ఏఏఐలను కూడా ట్యాగ్ చేశారు. కొంద మంది ప్రయాణికులు 90 నిమిషాలు నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడవది. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత ఈ అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత, పైలట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు చెప్పాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement