
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో విమానయాన సంస్థల నిర్లక్ష్యం ప్రయాణికులకు సంకటం కలిగిస్తోంది. 6 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇండిగో విమానం వెళ్లిపోయింది.
బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్లే ఇండిగో 6ఈ 6162 విమానంలో ప్రయాణించడానికి 6 మంది టికెట్లు బుక్ చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నారు. కానీ విమానం 12 నిమిషాలు ముందుగా టేకాఫ్ తీసుకుంది. దీంతో 6 మంది ఆ సంస్థ సిబ్బందిని నిలదీయడంతో వారిని మరో విమానంలో మంగళూరుకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment