
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా సెప్టెంబర్‌లో 1.03 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2021 సెప్టెంబర్‌తో పోలిస్తే ప్యాసింజర్ల సంఖ్య 64.61 శాతం పెరగడం గమనార్హం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. గత నెలలో ఆకాశ ఎయిర్ మినహా మిగిలిన దేశీయ విమానయాన సంస్థలు 76.6 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి.
ఆకాశ ఎయిర్ దేశీయంగా తన సేవలను 2022 ఆగస్ట్ 7 నుంచి ప్రారంభించింది. 77.5 శాతం సగటు సామర్థ్యంతో సెప్టెంబర్‌లో విమానయాన సంస్థలు సర్వీసులను నడిపించాయి. ఆగస్ట్‌లో ఇది 72.5 శాతం నమోదైంది.
ప్రయాణికుల్లో 57 శాతం మంది ఇండిగో విమానాల్లో జర్నీ చేశారు. విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా ఫ్లైట్స్‌లో 24.7 శాతం మంది ప్రయాణించారు.
చదవండి: ట్రైన్ జర్నీ క్యాన్సిల్ అయ్యిందా? రైల్వే ప్రయాణికులకు శుభవార్త
Comments
Please login to add a commentAdd a comment