విజయవాడ మినహా అన్ని విమానాశ్రయాల్లో జూలై నెలలో తగ్గిన ప్రయాణికులు
రాయలసీమ విమానాశ్రయాల్లో భారీగా తగ్గుదల నమోదు
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల్లో వెల్లడి
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్‌డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.
తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.
తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్య
ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment