
ఇటీవల ఓ మహిళకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. విమానంలోని కుషనింగ్ లేకుండా ఉన్న సీటు చూసి ఒక్కసారిగా షాకయింది. దీనికి సంబంధించిన ఫోటో తీసి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
యవనిక రాజ్ షా అనే మహిళ బెంగళూరు నుంచి భోపాల్‌కు వెళ్లే సమయంలో ఆమె ప్రయాణించే ఇండిగో 6E 6465 విమానంలో కుషనింగ్ లేని సీటు చూసి, ఫోటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. బ్యూటిఫుల్ @IndiGo6E నేను సురక్షితంగా ల్యాండ్ అవుతానని ఆశిస్తున్నానని ట్వీట్ చేసింది.
దీనిపై స్పందించిన ఇండిగో.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు అంటూ.. క్లీనింగ్ కోసం కుషన్‌లను మార్చామని, క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించినట్లు, శుభ్రమైన సీట్లను కేటాయించడంలో భాగంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు వావ్ మసాజ్ సీట్లు అని పేర్కొన్నారు. మరో వ్యక్తి బహుశా మునుపటి ప్రయాణికులు వాటిని తీసుకెళ్లిపోయారేమో అని అన్నారు.
Beautiful @IndiGo6E — I do hope I land safely! :)
— Yavanika Raj Shah (@yavanika_shah) March 6, 2024
This is your flight from Bengaluru to Bhopal 6E 6465. pic.twitter.com/DcPJTq3zka