
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్‌బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్‌లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.
ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్‌బస్ ఫ్లీట్‌కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్‌కు 5 మంది మహిళా పైలట్‌లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు
Comments
Please login to add a commentAdd a comment