DGCA
-
ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా
ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్‌ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్‌ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లుజనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది. -
చిన్న పక్షితో 'పెద్ద పక్షి'కి ముప్పు
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. రివ్వున ఎగిరేలోపు.. వాటికి ఎగిరే స్వేచ్ఛ లేదన్నట్టుగా పక్షులు వార్నింగ్ ఇస్తున్నాయి. ఎయిర్ పోర్టుల సమీపంలో పక్షుల కదలికలు విమాన ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దక్షిణ కొరియాలో విమాన ఘోర ప్రమాదంలో 179 మృత్యువాత పడటానికి పక్షులే ప్రధాన కారణమని.. తెలిసిన తర్వాత భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటికే పక్షుల కారణంగా టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే విమానాలు తిరిగి ల్యాండ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో.. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా డీజీసీఏ అడుగులు వేస్తోంది. ఓ వైపు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ.. మరోవైపు విమాన ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పే..ద్ద విమానానికి పక్షితో ముప్పా! విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. విమాన క్యాబిన్, ఇంజన్‌ను పక్షులు ఢీకొడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.విమానం పైకి ఎగిరినప్పుడు లేదా దిగుతున్నప్పుడు దాని ఇంజన్లు బలంగా లోపలికి గాలిని తీసుకుని బయటికి వదులుతుంటాయి. జా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆ గాలికి సమీపంలోకి పక్షులు వస్తే అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజన్లు లోపలికి లాగేసుకుంటాయి. దాంతో ఇంజన్లు పాడైపోతుంటాయి. విమానం ఎగిరే సమయంలో ఇంజన్ లోపలికి పక్షులు వెళ్లిపోతే ఇంజన్ తిరగడం కొన్నిసార్లు ఆగిపోయి ఊహకందని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఫ్యాన్ థ్రస్ట్ ఆగిపోయినట్టు గుర్తిస్తే పైలట్ వెంటనే సమీపంలోని ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసేస్తుంటారు. అంతేకాదు.. ఫ్లైట్ క్యాబిన్లో ఉన్న పైలట్ విండ్ షీల్డ్‌ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. బలంగా కొట్టినప్పుడు పొరపాటున విండ్ షీల్డ్‌కి పగుళ్లు ఏర్పడితే విమానం ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు. అప్రమత్తమైన డీజీసీఏ భారత్‌లోనూ ఇటీవల పక్షుల కారణంగా విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్ట్‌లో గోవాలోని దబోలి ఎయిర్‌పోర్ట్‌లో పక్షి ఢీకొన్న తర్వాత విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను హఠాత్తుగా నిలిపేసింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 2023లో 169 విమానాలకు పక్షుల కారణంగా స్వల్ప ప్రమాదాలు సంభవించడం గమనార్హం. విహంగాలతో లోహపు విహంగాలకు ప్రమాదాలు పెరుగుతుండటంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టు సమీపంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విహంగాల ఉనికిని తప్పించే మార్గాలపై దృష్టి సారించింది. రన్‌వేల వెంట బిగ్గరగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం, జోన్ గన్స్ ద్వారా భారీ శబ్దాలతో పక్షుల రాకను నియంత్రించడం, ఎయిర్ ఫీల్డ్ సమీపంలో వేప నూనె స్ప్రే చేయడం వంటి భిన్నమైన విధానాలను వినియోగించడంపై చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ఎయిర్‌పోర్టుకి 10 కి.మీ. పరిధిలో పక్షులు, వన్యప్రాణుల్ని ఆకర్షించే చెత్తా చెదారాలతో కూడిన ఆహారం, జంతు కళేబరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోళ్లు, మేకలు, ఇతర జంతు వధ జరగకుండా దృష్టి సారించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ సమస్యని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ఎయిర్‌పోర్టులు ప్రయత్నిస్తున్నాయి.నౌకాదళ సాయంతో చర్యలు పక్షుల అంతరాయం కలగకుండా వైజాగ్ ఎయిర్‌పోర్టులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎయిర్‌పోర్టు చుట్టూ కెనాల్ ఉంది. వేస్టేజ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యాలని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తూర్పు నౌకాదళ వైమానిక బృందం సహాయంతోనూ వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా పక్కç³క్కనే ఉన్నాయి. వీటిపక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పక్షుల రాకపోకలు పెరుగుతుండటంతో విమాన సర్వసులకు అంతరాయం ఏర్పడుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారుల స్ప్రే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరకుండా నియంత్రించే చర్యలు చేపడుతున్నాం. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేయడం ద్వారా రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలం. – రాజారెడ్డి, వైజాగ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
గగనతలంలో 1.42 కోట్ల మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా నవంబర్‌లో 1.42 కోట్ల మంది విమాన ప్రయాణం సాగించారు. 2023 నవంబర్‌తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య గత నెలలో 11.9 శాతం అధికం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో 1.27 కోట్ల మంది విమానయానం చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. 2024 అక్టోబర్‌లో దేశీయ విమాన ప్రయాణికుల(Air passengers) సంఖ్య 1.36 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: విభిన్న రంగుల్లో నంబర్ ప్లేట్లు.. ఎందుకలా..ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో భారత్‌లో వివిధ నగరాల మధ్య 14.64 కోట్ల మంది రాకపోకలు సాగించారు. వార్షిక వృద్ధి 5.91 శాతం నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 13.82 కోట్లుగా ఉంది. దేశీయ మార్కెట్ పరంగా ఇండిగో 63.6 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిరిండియా 24.4 శాతం, అకాశా ఎయిర్ 4.7, స్పైస్‌జెట్ 3.1 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలయన్స్ ఎయిర్ 0.7 శాతం వాటాతో స్థిరంగా ఉంది. ఎయిరిండియా(Air India)లో విస్తారా విలీనం నవంబర్‌లో పూర్తి అయింది. గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 2,24,904 మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది. -
Delhi: రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. #WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH— ANI (@ANI) December 9, 2024 -
ఆకాసా ఎయిర్‌కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
వచ్చేస్తోంది.. పేద్ద డ్రోన్
శంషాబాద్: అత్యవసరాల్లో ట్రాఫిక్ కష్టాలుండవు.. అనుకున్న సమయానికి మీ కార్గో చేరిపోతుంది. ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తు వులు, ఆర్గాన్స్ కూడా గ్రీన్ చానల్ ఏర్పాట్లు లేకుండా గమ్యానికి చేరిపోతాయి. దీనికి మరెంతో దూ రం లేదు. 2026లో మార్కెట్లోకి రాబోతున్న అతి పేద్ద డ్రోన్‌తో ఇవన్నీ సాకారమవుతాయి. హైదరాబాద్ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌లో సక్సెస్ కావడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులతో త్వరలో నే అందుబాటులోకి రానుంది. దీనిని ఆదిభట్లలోని బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ఉత్తమ్‌కుమార్, అమర్దీప్ నేతృత్వంలోని ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందం తయారు చేసింది. నోవాటెల్ హోటల్లో ‘కోల్డ్‌చైన్ అన్బ్రోకెన్–2024’సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు. ‘పర్యావరణహితంగా తయారు చేసిన ఈ పైలట్‌రహిత డ్రోన్ 100 కిలోల కార్గోను 300 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానానికి గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది. ఇంత సామర్థ్య మున్న డ్రోన్ తయారీ దేశంలో ఇదే మొదటిది. 2029 నాటికి పదిమంది ప్రయాణికులతోపాటు వేయి కేజీల బరువు, వేయి కి.మీ. దూరం ప్రయాణించే డ్రోన్‌ను తయారుచేసేందుకు కృషిచేస్తున్నాం’అని ఉత్తమ్‌కుమార్ ‘సాక్షి’తో తెలిపారు. ప్రత్యేకతలు..డ్రోన్ బరువు 400 కేజీలు మోసుకెళ్లే సామర్థ్యం 300 కి.మీ.వేగం గంటకు 200 కి.మీ.ప్రయాణించే ఎత్తు భూమికి 1000 అడుగుల ఎత్తులోఇంధనం హైడ్రోజన్, విద్యుత్ (కాలుష్యరహితంగా) -
ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది
భారతీయ విమానయాన సంస్థలు ఆగస్టు నెలలో 1.31 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. అంటే రోజూ దాదాపు 4.3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2023 ఆగస్టులో విమాన ప్రయాణికుల సంఖ్య 1.24 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఈసారి 5.7 శాతం పెరిగింది. జులైలో నమోదైన 1.29 కోట్లమంది ప్రయాణికులతో పోలిస్తే ఇది ఎక్కువే. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదిక విడుదల చేసింది.డీజీసీఏ నివేదికలోని వివరాల ప్రకారం..గత నెలలో విమానాల ఆలస్యం కారణంగా 1,79,744 మంది ప్రయాణికులు ప్రభావితం చెందారు. వీరికి పరిహారంగా విమానయాన కంపెనీలు సుమారు రూ.2.44 కోట్లు వెచ్చించాయి. విమానాల రద్దు కారణంగా 38,599 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వీరికి రూ.1.14 కోట్లు నష్టపరిహారం ఇచ్చారు. ఆగస్టులో మొత్తం 728 మంది ప్రయాణికులకు వివిధ కారణాల వల్ల బోర్డింగ్ సదుపాయాన్ని అందించలేదు. దాంతో రూ.77.96 లక్షలు పరిహారం చెల్లించారు.2024 జనవరి-ఆగస్టులో దేశీయ విమానయాన సంస్థల్లో 10.5 కోట్లమంది ప్రయాణించారు. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 10.06 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే 4.82 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. సమయపాలన పరంగా ఆగస్టులో ఆకాసా ఎయిర్ 71.2 శాతం కచ్చితత్వంతో విమానాలు నడిపి మొదటిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో విస్తారా (68.6 శాతం), ఏఐఎక్స్ కనెక్ట్ (66.8 శాతం), ఇండిగో, ఎయిర్ ఇండియా(66 శాతం), అలయన్స్ ఎయిర్(55.3 శాతం), స్పైస్‌జెట్ (31 శాతం) నిలిచాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నిర్వహణ ఆధారంగా ఆన్‌టైమ్ ఫర్ఫార్మెన్స్ (ఓటీపీ)ను లెక్కించారు.జూన్‌తో పోలిస్తే జులైలో 3.1 శాతం పెరిగిన మార్కెట్ వాటా ఆగస్టులో 2.3 శాతానికి పడిపోయింది. గతనెలలో ఇండిగో 62.4 శాతం, ఎయిర్ ఇండియా 14.7 శాతం, విస్తారా 10.3 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 4.5 శాతం, ఆకాసా ఎయిర్ 4.4 శాతం, అలయన్స్ ఎయిర్ 0.9 శాతం మార్కెట్ వాటా నమోదు చేశాయి.ఇదీ చదవండి: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతవిమాన ప్రయాణాలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం టైర్ 2, 3 నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. దాంతో విమాన ప్రయాణికులు పెరుగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాంతోపాటు విమానయాన కంపెనీల మధ్య పోటీ ఏర్పడి టికెట్ ధరలో రాయితీలు, ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా: కారణం ఇదే
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) రూ. 90 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ. 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్లను హెచ్చరించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.జూలై 9న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి రియాద్‌కు విమానాన్ని నడపాల్సి సమయంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రైనింగ్ కెప్టెన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, విమానాన్ని ట్రైనీ పైలట్ నడిపారు.ట్రైనీ పైలట్ శిక్షణ కెప్టెన్‌తో ముంబై-రియాద్ విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, శిక్షణ కెప్టెన్ అనారోగ్యం పాలయ్యాడు మరియు అతని స్థానంలో శిక్షణ లేని కెప్టెన్‌ని నియమించారు. నిర్వహణ వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ సంఘటన జరిగింది. జూలై 10న ఎయిర్‌లైన్ సమర్పించిన నివేదిక ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్‌జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. -
ఎయిర్ ఇండియాకు రూ.80 లక్షలు ఫైన్.. కారణం ఇదే
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు ఏకంగా రూ. 80 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా ఎందుకు విధించారు, కారణం ఏంటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), సిబ్బందికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏవియేషన్ వాచ్డాగ్ 'ఎయిర్ ఇండియా' (Air India)కు రూ. 80 లక్షల జరిమానా విధించింది. డీజీసీఏ ఈ ఏడాది జనవరిలో ఎయిర్ ఇండియా లిమిటెడ్‌పై స్పాట్ ఆడిట్ నిర్వహించిన తర్వాత ఈ ప్రకటన వెలువడిందని ఏవియేషన్ రెగ్యులేటర్ మార్చి 22న ఒక ప్రకటనలో వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆడిట్ నిర్వహించిన సమయంలో.. సిబ్బందిలో 60 ఏళ్లకు పైబడిన ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా సిబ్బందికి తగినంత వీక్లీ రెస్ట్ పీరియడ్లు, అల్ట్రా-లాంగ్-రేంజ్ ఫ్లైట్లకు ముందు, తర్వాత సిబ్బందికి విశ్రాంతి ఇవ్వకపోవడం.. లేఓవర్ల సమయంలో అనేక ఉల్లంఘనలను వెల్లడించింది. DGCA has imposed a financial penalty of Rs. 80,00,000 (Rupees eighty lakhs) to Air India Limited for violation of regulations pertaining to Flight Duty Time Limitations (FDTL) and fatigue management system (FMS) of flight crew: DGCA — ANI (@ANI) March 22, 2024 -
ఎయిర్‌పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
ఒక్క వీల్‌చైర్ కోసం రూ.30 లక్షలు జరిమానా.. అసలేం జరిగిందంటే..
ఎయిర్ ఇండియా సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గురువారం రూ.30 లక్షల జరిమానా విధించింది. ముంబైలోని అరైవల్ ఏరియాలో నడుస్తూ కుప్పకూలి మరణించిన 80 ఏళ్ల ప్రయాణికుడికి వీల్ చైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాపై ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..ఫిబ్రవరి 12న ఓ 80 ఏళ్లు వృద్ధడు అతడి భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో ముంబైకి వస్తున్నాడు. ఎయిర్‌పోర్ట్‌కు రాగానే అక్కడ సిబ్బందిని వీల్‌చైర్ అడిగాడు. అయితే అప్పటికే అతని భార్య వీల్‌చైర్‌ని ఉపయోగిస్తుంది. తనకోసం మరొకటి కావాలని కోరాడు. సరైన సమయానికి అందుబాటులో వీల్చైర్లు లేవు. దాంతో కాసేపు వేచి ఉండాలని సిబ్బందివారిని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ప్రయాణీకుడు నడిచి వెళ్లడానికి ఇష్టపడ్డాడు. దాంతో తన భార్యను తీసుకుని ఇమ్మిగ్రేషన్ విభాగం వరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించాడు. ఈ విషయాన్ని పరిశీలించిన డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సంస్థ ఫిబ్రవరి 20న నోటీస్‌కు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. వృద్ధ ప్రయాణికుడు మరో వీల్‌చైర్ కోసం ఎదురుచూడకుండా తన భార్యతో కలిసి వెళ్లిపోయాడని చెప్పింది. అయితే, సంస్థ వీల్‌చైర్‌ను అందించకుండా సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్(సీఏఆర్) నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుందని అని రెగ్యులేటర్ తెలిపింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా తప్పు చేసిన సిబ్బందిపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయలేదని డీజీసీఏ ఘాటుగా స్పందించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చెప్పడంలో సంస్థ విఫలమైందని తెలిపింది. ఇదీ చదవండి: ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. సీఏఆర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 ప్రకారం ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. ప్రయాణ సమయంలో విమానం ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు సహాయం కోరుతున్న ప్రయాణీకుల కోసం తగిన సంఖ్యలో వీల్చైర్లు అందుబాటులో ఉండేలా అన్ని విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ముంబై ఘటన.. ఎయిరిండియాకు జరిమానా
ఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. వీల్‌చైర్ సౌకర్యం కల్పించకపోవటంతో 80 ఏళ్ల ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 16న ముంబైలో చోటు చేసుకుంది. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం నుంచి టెర్మినల్ వరకు ఆ ప్రయాణికుడికి వీల్ ఛైర్ సౌకర్యం కల్పించపోవటంపై డీజీసీఏ సీరియస్ అయింది. ఈ ఘటనపై ఎయిరిండియాకు డీజీసీఏ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఏడు రోజుల్లో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పూర్తి వివరణ ఇవ్వాలంది. అదే విధంగా ఎయిర్ ఇండియా రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ‘ ఇద్దరు ప్రయాణికులు ఫిబ్రవరి 12న న్యూయార్క్ నుంచి ముంబైకి వచ్చారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు, ఆయన భార్య ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. అయితే వీల్ చైర్లకు అధిక డిమాండ్ ఉండటంతో ఆయన భార్యకు వీల్ చైర్ సౌకర్యం కల్పిచాం. ఆయనకు సైతం కల్పిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేసింది. కానీ ఆయన వినకుండా తన భార్యతో పాటు నడుచుకుంటూ వెళ్లారు’ అని ఎయిరిండియా తెలిపింది. అయితే డీజీసీఏ చేపట్టిన విచారణలో ఎయిరిండియా దివ్యాంగులు, వృద్ధులకు కల్పించాల్సిన వీల్ చైర్ సౌకర్య నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని తేలింది. ఈ ఘటన నేపథ్యంలో.. ప్రయాణికులకు అవసరమైన వీల్ చైర్లను అందుబాటులో ఉంచాల్సిందేనని విమాన సంస్థలకు డీజీసీఏ నొక్కి చెప్పింది. చదవండి: 1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట! -
ఉప్పందించిన సొంత ఉద్యోగి.. ఎయిర్ఇండియాకు భారీ పెనాల్టీ!
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎయిర్ ఇండియాపై డీజీసీఏ రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని దీర్ఘ-శ్రేణి, టెరైన్ క్రిటికల్ మార్గాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన స్వచ్ఛంద భద్రతా నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపి ఈ చర్య తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాల విషయంలో భద్రతా నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు ఎయిర్‌లైన్ ఉద్యోగి నుంచి స్వచ్ఛంద భద్రతా నివేదిక అందిందని, వాటిపై సమగ్ర దర్యాప్తును చేపట్టినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి! ఎయిర్ ఇండియా నిబంధనలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, దీంతో ఆ విమానయాన సంస్థ అకౌంటబుల్ మేనేజర్‌కి షోకాజ్ నోటీసు జారీ చేశామని డీజీసీఏ తెలిపింది. దీనికి ఎయిర్ ఇండియా నుంచి వచ్చిన స్పందనను సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించినట్లు వివరించింది. లీజుకు తీసుకున్న విమానం కార్యకలాపాలు రెగ్యులేటరీ /ఓఈఎం పనితీరు పరిమితులకు అనుగుణంగా లేనందున ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. -
ముంబై ఎయిర్ పోర్టు, ఇండిగోపై జరిమానా విధింపు
ముంబై విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) రూ.30లక్షలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)రూ.60లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల జరిమానా విధించింది. అదేవిధంగా ఇండిగో ఎయిర్ లైన్స్‌పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)రూ.1.20కోట్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)రూ.30లక్షలు మొత్తం 1.50కోట్ల భారీ జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వేపై కూర్చుని భోజనం చేసిన ఘటనపై ముంబయి విమానాశ్రయం, ఇండిగో రెండూ బాధ్యులుగా చేస్తూ.. ఈ జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. Video of passengers eating on the tarmac at Mumbai Airport | A total of Rs 90 Lakhs fine imposed on MIAL - Rs 60 lakhs by Bureau of Civil Aviation Security (BCAS) and Rs 30 lakhs by DGCA. A total of Rs 1.50 Crores on IndiGo - Rs 1.20 Crores by BCAS and Rs 30 Lakhs by DGCA. https://t.co/vhanRbcC9d — ANI (@ANI) January 17, 2024 ఇటీవల పొగమంచు కారణంగా ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు రన్‌వేపైనే వేచి ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి విదితమే. చదవండి: కాంగ్రెస్ గూటికి ఒడిషా మాజీ సీఎం గమాంగ్ -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..
ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాగ్రూప్ నిర్వహిస్తోన్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మే-సెప్టెంబర్‌లో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చిన్, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది. ఇదీ చదవండి: రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు ఫలితంగా సంస్థ నిబంధనలు పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణను సమీక్షించిన తర్వాత.. సీఏఆర్ నిబంధనలు పాటించడంలో టాటా గ్రూప్ సంస్థ విఫలమైందని నిర్ధారించారు. ఆలస్యమైన విమానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, కొందరు సర్వీస్‌లేని సీట్లలో ప్రయాణించవలసి రావడం వంటి అంశాలను పరిగణలోని తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించడంలో సంస్థ విఫలం అయిందని గుర్తించారు. దాంతో సంస్థకు రూ.10 లక్షలు జరిమానా విధించారు. -
ఎయిర్ ఇండియాకు మరో షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఎయిర్ ఇండియాకు మరో షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని ఎయిర్ ఇండియా ఫెసిలిటీలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ కార్యకలాపాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేసినట్టు సమాచారం. తనిఖీ సమయంలో కొన్ని లోపాలను గుర్తించడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ముంబైలోని ఎయిర్ ఇండియా కేంద్రంలో బోయింగ్ పైలట్లకు శిక్షణ కార్యకలాపాలను డీజీసీఏ నిలిపివేసిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. డీజీసీఏ నిర్ణయంతో ఎయిర్ ఇండియాకు నిర్వహణ సవాళ్లు ఎదురు కానున్నాయి. న్యారో బాడీ, వైడ్ బాడీ విమాన పైలట్లకు సొంత కేంద్రాలలో శిక్షణ ఇవ్వలేకపోవడం ఇందుకు కారణం. ముంబై ఫెసిలిటీలో బోయింగ్ 777, బీ787 ఎయిర్క్రాఫ్టŠస్, హైదరాబాద్ కేంద్రంలో ఏ320 విమాన పైలట్లకు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తున్నారు. -
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్‌ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్‌లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్‌లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్‌లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్‌లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
డ్రోన్ పైలట్‌గా డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళ!
కేరళలోని మలప్పురానికి చెందిన రిన్ష పట్టకకు గాలిలో ఎగురుతున్న డ్రోన్లను చూడడం అంటే సరదా. ఆ సరదా కాస్తా ఆసక్తిగా మారింది. డ్రోన్లకు సంబంధించిన ఎన్నో విషయాలను సివిల్ ఇంజనీర్ అయిన తండ్రి అబ్దుల్ రజాక్‌ను అడిగి తెలుసుకునేది. ప్లస్ టు పూర్తయిన తరువాత బీటెక్ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లో విరామ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తుప్పుడు రిన్షకు తట్టిన ఐడియా డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ కోర్సు. తండ్రితో చెబితే ఆయన ‘బాగుంటుంది’ అని ఓకే చెప్పి ప్రోత్సహించాడు. శిక్షణ కోసం కాసర్గోడ్లోని ఏఎస్ఏపీ కేరళ కమ్యూనిటీ స్కిల్ పార్క్‌లో చేరింది. క్లాసులో తాను ఒక్కతే అమ్మాయి! ఈ స్కిల్పార్క్లో యువతరం కోసం ఆటోమోటివ్ టెక్నాలజీ, కంప్యూటర్ హార్డ్‌వేర్, హాస్పిటాలిటీ, రిటైల్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో వొకేషనల్కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ ఫ్లయింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా బేసిక్ ఫ్లైట్ ప్రిన్సిపల్స్ నుంచి డ్రోన్ ఫ్లయింగ్ రూల్స్ వరకు ఎన్నో నేర్చుకుంది రిన్ష. ఏరియల్ సర్వైలెన్స్, రెస్క్యూ ఆపరేషన్స్, అగ్రికల్చర్, ట్రాఫిక్, వెదర్ మానిటరింగ్, ఫైర్ ఫైటింగ్‌లతోపాటు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డెలివరీ సర్వీస్... మొదలైన వాటిలో డ్రోన్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మన దేశంలో డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి. డీజీసీఏ లైసెన్స్ పొందిన కేరళ తొలి మహిళా డ్రోన్ పైలట్‌గా చరిత్ర సృష్టించిన రిన్ష ఇలా అంటోంది... ‘రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు ఎన్నో రంగాలలో డ్రోన్లు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. డీజీసీఏ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది’ ‘రిన్ష విజయం ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు స్కిల్పార్క్ ఉన్నతాధికారులు. (చదవండి: బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ! -
ఇండిగోకు భారీ షాక్: నిబంధనలు పాటించడం లేదని!
బడ్జెట్ కారియర్ ఇండిగోకు భారీ షాక్ తగిలింది. ల్యాండింగ్ సమయంలో తలెత్తిని సాంకేతిక ఇబ్బంది కారణంగా ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో నాలుగు టెయిల్ స్ట్రైక్స్ చేసినందుకు ఇండిగోపై శుక్రవారం ఈ జరిమానా విధించింది. కార్యకలాపాలు, శిక్షణ , ఇంజినీరింగ్ విధానాలకు సంబంధించిన ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్‌లో కొన్ని లోపాలను గుర్తించిన చోట పరిశోధనలు నిర్వహించినట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. బెంగళూరు నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానం టెయిల్ స్ట్రైక్‌ను ఎదుర్కొన్న పైలట్, కో-పైలట్ లైసెన్స్‌లను రెగ్యులేటర్ సస్పెండ్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రెగ్యులేటర్ దర్యాప్తు ప్రారంభించింది. సిబ్బంది నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ల్యాండింగ్ చేసినట్లు తాము గుర్తించామని, ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్ మూడు నెలలు , కో-పైలట్ లైసెన్స్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA తెలిపింది. (క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు) కాగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టెయిల్ (తోకలాగా ఉండే వెనుక భాగం) తాకినప్పుడు లేదా రన్‌వేకి తాకినప్పుడు టెయిల్ స్ట్రైక్ సంభవిస్తుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ 2023 సంవత్సరంలో ఆరు నెలల వ్యవధిలో A321 విమానం ల్యాండింగ్ సమయంలో నాలుగు టెయిల్ స్ట్రైక్ సంఘటనలను ఎదుర్కొంది. దీనిపై రెగ్యులేటరీ ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించి నిర్ణీత వ్యవధిలోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రత్యుత్తరాన్ని సమీక్షించిన తర్వాత, అవి సంతృప్తికరంగా లేవని డీజీసీఏ గుర్తించింది.దీంతో 30 లక్షల జరిమానాతో పాటు,నిబంధనలు, OEM మార్గదర్శకాలకు అనుగుణంగా పత్రాలు, విధానాలను సవరించాలని కూడా ఇండిగోను ఆదేశించింది. (ఇషా అంబానీ అంటే అంతే: అన్‌కట్‌డైమండ్ నెక్లెస్ ఖరీదు తెలుసా?) -
కొత్త అగ్రి డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన కొత్త అగ్రి–డ్రోన్ ’అగ్రిబాట్ ఏ6’కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ’టైప్ సర్టిఫికెట్’ లభించినట్లు ఐవోటెక్వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి ఉన్నట్లు ధృవీకరిస్తూ డీజీసీఏ ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా జారీ చేస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ తెలిపారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 పైచిలుకు డ్రోన్లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నారు. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: స్వచ్ఛంద దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఊరట లభించింది. కంపెనీకి లీజుకు ఇచి్చన విమానాలను స్వా«దీనం చేసుకునేందుకు లెస్సర్లు దాఖలు చేసిన పిటీషన్లను ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ.. ఇంకా వాటిని డీరిజిస్టర్ చేయనందున కార్యకలాపాల పునరుద్ధరణకు అవి అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. విమానాలు, ఇంజిన్లే గో ఫస్ట్ వ్యాపారానికి కీలకమైనవని, వాటిని తీసివేస్తే ’కంపెనీ మరణానికి’ దారి తీస్తుందని ఎన్సీఎల్టీ తెలిపింది. దీని వల్ల రుణభార సమస్య పరిష్కారానికి అవకాశమే లేకుండా పోతుందని వివరించింది. మరోవైపు తమ విమానాలు, ఇంజిన్లను తనిఖీ చేసుకునేందుకైనా అనుమతినివ్వాలంటూ లెస్సర్లు చేసిన విజ్ఞప్తిని కూడా ఎన్సీఎల్టీ తోసిపుచి్చంది. విమానాల భద్రతా ప్రమాణాలు అత్యుత్తమ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత పరిష్కార నిపుణుడికి (ఆర్పీ) ఉంటుందని స్పష్టం చేసింది. మే 3 నుంచి గో ఫస్ట్ కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
గో ఫస్ట్ నుంచి విమానాల కోసం లీజర్ల పట్టు!
న్యూఢిల్లీ: దివాలా పిటిషన్ దాఖలు చేసిన విమానయాన సంస్థ గో ఫస్ట్ నుంచి తమ విమానాలను తిరిగి పొందే విషయంలో లీజర్లు వెనక్కు తగ్గడం లేదు. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తమ విమానాలను డీరిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో ఇప్పటికే నిరాకరించిన డీజీసీఏను తప్పు పడుతూ ఈ నిర్ణయం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ తారా వితస్తా గంజు ఈ పిటిషన్ విచారణను వాదనల నిమిత్తం మే 30న లిస్ట్ చేయాలని ఆదేశించారు. ఆలోగా లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ప్రతిపాదులను ఆదేశించారు. హైకోర్టును ఆశ్రయించిన లీజర్లలో ఆక్సిపిటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2 లిమిటెడ్, ఈఓఎస్ ఏవియేషన్ 12 (ఐర్లాండ్) లిమిటెడ్, పెంబ్రోక్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ 11 లిమి టెడ్, ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నాయి. ► ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ► తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది. ► దీనితో ఎన్సీఎల్టీ రూలింగ్‌ను సవాలు చేస్తూ, విమాన లీజర్లు ఎస్ఎంబీసీ ఏవియేషన్ క్యాపిటల్, జీవై ఏవియేషన్, ఎస్‌ఎఫ్‌వీ ఎయిర్‌క్రాఫ్ట్ హోల్డింగ్స్, ఇంజిన్ లీజింగ్ ఫైనాన్స్ బీవీ (ఈఎల్ఎఫ్సీ) సంస్థలు.. ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ చేశాయి. అయితే ఈ అప్పీళ్లను చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ తోసిపుచ్చింది. ► దీనిని ఆయా సంస్థలు సుప్రీంలో అప్పీల్ చేయవచ్చన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే గో ఫస్ట్ అత్యున్నత న్యాయస్థానంలో నాలుగు కేవియెట్లను దాఖలు చేసింది. ► గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 3వ తేదీ నుంచి గో ఫస్ట్ సేవలు నిలిచిపోయాయి. ► మరోవైపు 30 రోజుల్లో పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచించడం మరో విషయం. గోఫస్ట్ సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ గోఫస్ట్ సేవల పునరుద్ధరణకు అనుమతించే ముందు, సన్నద్ధతపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆడిట్ చేయనుంది. ఆర్థిక సంక్షోభంతో గోఫస్ట్ మే 3 నుంచి విమానయాన కార్యకలాపాలు నిలిపివేసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థ దివాలా పరిష్కార చర్యల పరిధిలో ఉంది. ఇలా సేవలను అర్థంతరంగా నిలిపివేయడంపై గోఫస్ట్‌కు డీజీసీఏ షోకాజు నోటీసు జారీ చేయగా.. దీనికి స్పందనగా వీలైనంత త్వరగా ఫ్లయిట్ సేవలు ప్రారంభించే ప్రణాళికపై పనిచేస్తున్నట్టు బదులిచ్చింది. ఈ విషయాన్ని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గోఫస్ట్ కూడా తన ఉద్యోగులకు ఇదే విషయమై సమాచారం పంపింది. రానున్న రోజుల్లో మన సేవల సన్నద్ధతపై డీజీసీఏ ఆడిట్ నిర్వహిస్తుందని, నియంత్రణ సంస్థ ఆమోదం లభిస్తే వెంటనే కార్యకాలపాలు ప్రారంభిస్తామని వారికి తెలియజేసింది. కార్యకలాపాలు ప్రారంభానికంటే ముందే ఏప్రిల్ నెల వేతనాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ సీఈవో భరోసా ఇచ్చారు. అలాగే, వచ్చే నెల నుంచి ప్రతీ నెలా మొదటి వారంలో వేతనాలను చెల్లించనున్నట్టు గోఫస్ట్ ఆపరేషన్స్ హెడ్ రంజింత్ రంజన్ ఉద్యోగులకు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ కేసులో కన్సార్షియంకు ఊరట ఇదిలావుండగా, సేవలను నిలిపిచేసిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దిశలో అప్పీలేట్ ట్రిబ్యునల్– ఎన్సీఎల్ఏటీ కీలక రూలింగ్ ఇచ్చింది. ఎయిర్వేస్ విజేత బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం చెల్లింపు బాధ్యతలను నెరవేర్చడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే కన్సార్షియం అందించిన రూ. 175 కోట్ల ఫెర్మార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని ఎన్‌క్యాష్ చేయవద్దని రుణదాతలను ఆదేశించింది. ఇప్పటికే రెండుసార్లు 2022 నవంబర్ 16, 2023 మార్చి 3వ తేదీల్లో కన్సార్షియం రుణ చెల్లింపుల కాలపరిమితిని రెండుసార్లు అప్పిలేట్ ట్రిబ్యునల్ పొడిగించింది. కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. కాగా, జెట్ ఎయిర్వేస్ కేసులో చెల్లించనున్న రూ. 150 కోట్ల పెర్ఫార్మెర్స్ బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేయకుండా ప్రధాన రుణ దాత ఎస్బీఐని నిరోధించాలని కోరుతూ విన్నింగ్ బిడ్డర్ జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన పటిషన్‌పై మే 30న ఉత్తర్వులు జారీ చేస్తామని అప్పీలేట్ ట్రిబ్యునల్ తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కన్సార్షియం – రుణదాతల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అప్పీలేట్ ట్రిబ్యునల్ కీలక సూచనలు చేస్తూ పరిష్కార ప్రణాళికను అమలు చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని రెండు పక్షాలనూ కోరింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 18న కార్యకలాపాలను నిలిపివేసింది. క్యారియర్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ జూన్ 2019లో ప్రారంభమైంది. 2021 జూన్‌లో కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, ప్రణాళిక ఇంకా అమలు కాలేదు. దీని ఫలితంగా క్యారియర్ భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడింది. -
కాక్‌పిట్‌లో స్నేహితురాలు, పైలెట్ లైసెన్స్ క్యాన్సిల్.. రూ.30లక్షల ఫైన్!
తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్న పైలెట్‌పై ప్రముఖ దేశీయ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియా కఠిన చర్యలు తీసుకుంది. పైలెట్‌ను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అంతేకాదు తన స్నేహితురాలికి సపచర్యలు చేయాలని సిబ్బందిని ఆదేశించాడు. అందుకు ఒప్పుకోని సిబ్బందిపై దుర్భాషలాడాడు. చేయి చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏ (Directorate General of Civil Aviation)ని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన డీజీసీఏ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకోవాలని ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా పైలెట్‌కు రూ.30లక్షల ఫైన్ వేసింది. 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్‌ను విరుద్ధంగా విధులు నిర్వహించిన 3 నెలల పాటు పైలెట్ లైసెన్స్ (పీఐసీ) క్యాన్సిల్ చేసింది. -
ఎయిరిండియా పైలెట్ ఘనకార్యం..కాక్‌పిట్‌లో స్నేహితురాలితో ముచ్చట్లు!
పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఎయిరిండియా (ఏఐ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానంలో భద్రతా లోపాలపై ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతికి ఏప్రిల్ 21న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎయిరిండియాకు చెందిన ఓపైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి తన స్నేహితురాల్ని కాక్‌పిట్‌లో కూర్చోబెట్టుకున్నాడు. దీనిపై ఎయిరిండియా సకాలంలో స్పందిచకపోవడంపై డీజీసీఏ మండిపడింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియా విమానంలో అసలేం జరిగింది ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా 915 విమానానికి చెందిన పైలెట్ నిబంధనల్ని ఉల్లంఘించి కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ప్రయాణం ముగిసే వరకు అక్కడే కూర్చోపెట్టుకున్నాడు. అయితే ఈ ఘటనపై మార్చి 3న కేబిన్ సూపర్వైజర్ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పట్టించుకోకపోవడంతో డీజీసీఏని ఆశ్రయించారు. దీంతో డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎయిరిండియా 915 విమానం పైలెట్ కమాండ్ కెప్టెన్ హర్ష్ సూరీ, కేబిన్ క్రూ, కాక్‌పిట్‌లో కూర్చున్న ఎకానమీ క్లాస్ ప్రయాణికురాలికి సమన్లు అందించింది. కాగా, సకాలంలో జోక్యం, చర్యలు తీసుకోకపోవడం విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని డీజీసీఏకి చెప్పాల్సి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మహిళా సిబ్బందిపై వేధింపులు సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్, విమానం రక్షణ విభాగాధిపతి హెన్రీ డోనోహోకు పంపిన నోటీసులో ఫిర్యాదు దారుడు మాట్లాడుతూ.. కమాండర్‌ని బెదిరించడం, అవమానించడం, తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడంపై చింతిస్తున్నాను. షాక్‌కు గురయ్యాను. మహిళా ప్రయాణీకురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించడాన్ని పైలట్ ఉల్లంఘించడమే కాకుండా, తాను చెప్పినట్లు చేయలేదనే అకారణంగా మహిళా సిబ్బందిని వేదించినట్లు మైలెట్ చేసింది. కాగా, విజిల్ బ్లోయర్ ఫిర్యాదుతో డీజీసీఏ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి👉 జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే! -
Delhi: తాగిన మైకంలో మూత్రం పోసి క్షమాపణలు.. అరెస్ట్
న్యూఢిల్లీ: మరో పీ గేట్ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పతాగిన స్థితిలో ఓ భారతీయ విద్యార్థి మూత్రవిసర్జన చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికుడు ఎలాంటి ఫిర్యాదు చేయకున్నా.. విమానయాన సంస్థ రంగంలోకి దిగి ఆ విద్యార్థిని అరెస్ట్ చేయించింది. శుక్రవారం రాత్రి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఏఏ292 న్యూయార్క్ నుంచి బయలుదేరింది. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే.. ఈ మధ్యలో ఓ ప్రయాణికుడు తప్పతాగిన మైకంలో మూత్ర విసర్జన చేశాడు. అది కాస్త పక్కనే ఉన్న ప్యాసింజర్‌కు తాకింది. దీంతో విమాన సిబ్బందికి విషయం తెలియజేశాడు సదరు ప్రయాణికుడు. అయితే.. మూత్ర విసర్జన చేసింది విద్యార్థి కావడం, ఫిర్యాదు చేస్తే అతని కెరీర్ దెబ్బ తింటుందనే ఉద్దేశం, పైగా క్షమాపణలు చెప్పడంతో.. ఈ ఘటనపై బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, విమానయాన సంస్థ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బంది వెంటనే విషయాన్ని పైలట్‌కు తెలియజేశారు. పైలట్, ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం ల్యాండ్ కాగానే సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. ప్రయాణికుడు విమానంలో అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే.. క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షలతో పాటు కొంతకాలం అతనిపై విమానయాన వేటు విధించే అవకాశం ఉంటుంది. గత నవంబర్‌లో ఇదే తరహాలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శంకర్ మిశ్రా అనే వ్యక్తి తాగిన మైకంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి జైలుకు వెళ్లి.. బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ఇండియా స్పందన సరైన రీతిలో లేదన్న అభియోగాలతో.. విమానయాన సంస్థకు 30 లక్షల రూ. జరిమానా కూడా విధించింది డీసీసీఏ. -
దేశీయంగా విమాన ప్రయాణాలు రెట్టింపు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో రెట్టింపు స్థాయిలో నమోదైంది. 64.08 లక్షల నుంచి 1.25 కోట్లకు చేరింది. పౌర విమానయాన డైరెక్టరేట్ డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఫ్లయిట్పరమైన, బ్యాగేజ్పరమైన, సిబ్బంది ప్రవర్తనపరమైన సమస్యలపై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. వరుసగా అయిదో నెల జనవరిలోనూ ఇండిగో దేశీ మార్కెట్ వాటా తగ్గింది. 54.6 శాతానికి చేరింది. గతేడాది ఆగస్టులో ఇది 59.72 శాతంగా ఉండేది. ఇండిగో గత నెల 68.47 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. మరిన్ని కీలకాంశాలు.. ► సమీక్షాకాలంలో ఎయిరిండియా 11.55 లక్షల మందిని, విస్తారా 11.05 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చాయి. వాటి మార్కెట్ వాటా వరుసగా 9.2 శాతం, 8.8 శాతంగా ఉంది. ► బడ్జెట్ విమానయాన సంస్థలు గో ఫస్ట్‌లో 10.53 లక్షల మంది, ఎయిర్ఏషియా ఇండియాలో 9.30 లక్షల మంది, స్పైస్‌జెట్ ఫ్లయిట్స్‌లో 9.14 లక్షల మంది ప్రయాణించారు. ► టాటా గ్రూప్‌లో భాగమైన విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ఏషియా ఇండియా కలిపి 32.30 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చాయి. 26 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. ► మొత్తం ఏడు దేశీ ఎయిర్‌లైన్స్‌లోనూ సీక్వెన్షియల్‌గా చూస్తే జనవరిలో సీట్ల భర్తీ స్థాయి (పీఎల్ఎఫ్) తగ్గింది. ► సమయపాలనలో (ఓటీపీ) ఇండిగో అగ్రస్థానంలో కొనసాగింది. హైదరాబాద్ సహా నాలుగు కీలక మెట్రో ఎయిర్‌పోర్టుల్లో సగటున 84.6% ఫ్లయిట్లను నిర్దేశిత సమయంలో నడిపింది. -
ఎయిర్‌ఏషియాకు రూ.20లక్షల ఫైన్! ఎందుకంటే..
సాక్షి, ముంబై: ఏషియా విమాన సంస్థకు భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమానాన్ని నడిపే పైలట్‌కు సామర్థ్య పరీక్షలు నిర్వహించేటప్పుడు కొన్ని కచ్చితమైన చర్యలు పాటించాలి. వాటిని పాటించడంలో వైఫల్యం చెందినందుకు గానూ ఎయిర్ఏషియా యాజమాన్యానికి డీజీసీఏ ఈ ఫైన్ విధించింది. డీజీసీఏ నిబంధనల మేరకు విధులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శించిన ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ విభాగ అధిపతిని మూడు నెలల పాటు తొలగించింది. అలాగే ఎనిమిది మంది సూపర్వైజర్లకు ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ఏషియా మేనేజర్‌కు, శిక్షణ విభాగం అధిపతికి, పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించడంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. వారి నుంచి వివరణలు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చదవండి: ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు.. ఏం జరిగిందంటే.. -
ప్రయాణికుడిని పాట్నాకు బదులు ఉదయ్‌పూర్ తీసుకెళ్లిన ఇండిగో..
న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్‌పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్‌పూర్‌లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్‌పూర్‌లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్‌ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్‌కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
గగనతలంలో ఉన్న విమానంలో మంటలు.. 184 మంది ప్రయాణికులు..
గగనతలంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో మంటలను గుర్తించిన పైలట్ వెంటనే మళ్లీ విమానాన్ని విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశాడు. ఈ ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది. కాగా, ఎయిర్ ఇండియా విమానం అబుదాబి నుంచి కాలికట్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం.. 184 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ B737-800 విమాన ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వే నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయని డీజీసీఏ తెలిపింది. సుమారు 1000 అడుగుల ఎత్తులోకి వెళ్లగానే ఒకటో నెంబర్ ఇంజన్లో మంటలు రావడం గమనించిన పైలట్.. తిరిగి విమానాన్ని అబుదాబి విమానాశ్రయంలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. #BREAKING | Massive scare on an #AirIndia Express plane from Abu Dhabi to Calicut. The flight's engine caught fire during climb, forcing it to make landing. @Aruneel_S reports pic.twitter.com/IY8zYYZaV1 — Mirror Now (@MirrorNow) February 3, 2023 కాగా, ఈ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. విమాన ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వచ్చినట్టు తెలిపారు. విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు. ఇక, విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. -
ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ
ప్రయాణికులను ఎక్కించుకోకుండా టేకాఫ్ అయ్యిన మరో ఎయిర్‌లైన్‌కు డీజీసీఏ భారీ పెనాల్టీ విధించి గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర ఇండియా మూత్ర విసర్జన ఘటనలో సీరియస్ అయ్యినా డీజీసీఏ సదరు ఎయిర్‌లైన్‌కు గట్టిగా జరిమానా విధించిన షాకింగ్ ఘటన మరువక మునుపే మరో ఎయిర్‌లైన్‌కి పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది డీజీసీఏ. ఈ మేరకు జనవరి 9న ఉదయం 6.30కి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన జీ8, 116 గో ఫస్ట్ విమానం 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ సదరు ఎయిర్‌లైన్‌కి నోటీసులు పంపి వివరణ ఇవ్వమని కోరింది. ఐతే సదరు ఎయిర్‌లైన్ ప్రయాణికులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కో ఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బందికి మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంతో ఈ తప్పిదం చోటు చేసుకుందని వివరించింది. దీంతో డీసీజీఏ ప్రయాణికులను ఎక్కించుకోవడంలో బహుళ తప్పిదాలు ఉన్నాయంటూ రూ. 10 లక్షలు జరిమాన విధించింది. ఇదిలా ఉండగా గోఫస్ట్ ఎయిర్‌లైన్ ఈ అనుకోని పర్యవేక్షణ ఘటనకు ఇబ్బందిపడ్డ నాటి ప్రయాణికులకు క్షమాపణల చెప్పింది, పైగా బాధిత ప్రయాణికులకు వచ్చే ఏడాదిలోపు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఒక ఉచిత టిక్కెట్‌ను కూడా అందించింది. ఈ ఘటన జరిగినప్పుడూ ఫ్లైట్‌లో ఉన్న సిబ్బందిని కూడా తొలగించారు. (చదవండి: పాక్‌కు భారత్ నోటీసులు..సింధు జలాల ఒప్పందం మార్చకుందామా!) -
విమాన టికెట్ డౌన్‌గ్రేడ్ చేస్తే రీయింబర్స్మెంట్
న్యూఢిల్లీ: ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తుండటంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే, దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని ప్యాసింజర్లకు ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రూట్ల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ఖర్చుల్లో 30–75 శాతం వరకు (పన్నులు సహా) రీయింబర్స్ చేయాలి. ఇవి ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని డీజీసీఏ సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. ప్యాసింజర్లు నిర్దిష్ట తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకున్న టికెట్‌ను విమానయాన సంస్థలు వివిధ కారణాలతో దిగువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేస్తున్న ఉదంతాలు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. -
అదే తరహాలో రెండో ఘటన: ఎయిర్ ఇండియాకి మరోసారి షాక్
ఎయిర్ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్ 6న ప్యారిస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
Urination Case: ఎయిరిండియాకు భారీ షాక్
న్యూఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).. ఎయిర్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. ఘటనకుగానూ శుక్రవారం రూ.30 లక్షల పెనాల్టీ ఎయిర్ ఇండియాకు విధించింది. అంతేకాదు.. ఆ సమయంలో విమానంలో ఉన్న పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు రూ.3 లక్షల ఫైన్ విధించింది. ఘటన సమయంలో సరైన స్పందన లేకపోవడం, పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లాంటి పరిణామాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. గతేడాది నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు శంకర్ మిశ్రా. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. దుమారం చెలరేగింది. అప్పటికప్పుడు పార్టీల మధ్య రాజీ కుదరిందనుకుని ఈ వ్యవహారాన్ని వదిలేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించుకుంది. అయితే.. వృద్ధురాలి ఫిర్యాదుతో ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తీవ్రంగా గాలించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎయిరిండియా నిందితుడు శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మద్యం మత్తులో ఈ నేరానికి పాల్పడినందుకు.. తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు శంకర్ అరెస్ట్ కాగా, సాక్ష్యులను బెదిరించడం.. తారుమారు చేసే అవకాశం ఉండడంతో బెయిల్‌కు నిరాకరించింది కోర్టు. -
ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన.. ప్రయాణికులను ఎక్కించుకోకుండా..
బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్‌లైన్‌ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు. ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు. అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్వర్లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. కాగా ప్రయాణికులకు బోర్డింగ్‌పాస్‌లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్‌లో ఇదే నా చివర ఫ్లైట్ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్ చేశారు. కాగా గోఫస్ట్ ఎయిర్వేస్ ఆయా ట్వీట్లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
ఎయిరిండియాకు భారీ షాక్
ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ఎయిరిండియా విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 26న మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా ఎయిరిండియా న్యూయార్క్ - ఢిల్లీ విమాన ప్రయాణంలో వృద్ద మహిళపై మూత్రం పోయడం కలకలం రేపింది. దీంతో ఎయిరిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజా డీజీసీఏ ఎయిరిండియాకు పంపిన నోటీసుల్లో.. నవంబర్ 26న శంకర్ మిశ్రా మహిళపై మూత్రం పోశాడు. డిసెంబరు 6న పారిస్ - న్యూఢిల్లీ విమానంలో మద్యం సేవించిన ప్రయాణికుడు ఖాళీగా ఉన్న సీటు, మహిళా దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. మరొకరు మద్యం సేవించి లావేటరీ(ఫ్లైట్ బాత్రూం)లో సిగరెట్ తాగుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటనలపై ఎయిరిండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆలస్యంగా స్పందించడంపై మండిపడింది. ఈ రెండు వేర్వేరు ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేసింది. పారిస్ విమానంలో జరిగిన ఘటనలపై డీజీసీఏ నివేదిక కోరిన తర్వాత మాత్రమే ఏం జరిగిందో చెప్పింది. అంతే తప్పా వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరిగినప్పుడు విమానయాన సంస్థ ఏదైనా సంఘటనను 12 గంటల్లోగా నివేదించడమే కాకుండా, వాటిని అంతర్గత కమిటీకి కూడా పంపాలని డీజీసీఏ తెలిపింది. కమిటీలో రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఛైర్మన్‌గా ఉండాలి. వేరొక షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్‌కు చెందిన ప్రతినిధి సభ్యుడు, ప్రయాణీకుల సంఘం లేదా వినియోగదారుల సంఘం నుండి ప్రతినిధి లేదా వినియోగదారు వివాద పరిష్కార ఫోరమ్‌కు చెందిన రిటైర్డ్ అధికారి సభ్యులుగా ఉండాలని స్పష్టం చేసింది. కానీ అవేం చేయకుండా ఎయిరిండియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చదవండి👉 వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
విమానంలో మందుబాబుల హల్చల్.. ఎయిర్‌హోస్టస్‌తో అసభ్యకరంగా..
పట్నా: భారతీయ విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు మరువకముందే ఆదివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఢిల్లీ నుంచి పట్నాకు వస్తున్న ఇండిగో విమానంలో తప్పతాగిన ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. విమాన సిబ్బందితోపాటు తోటి ప్రయాణికులతోనూ గొడవ పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీరు విమానంలో పట్నాకు వస్తున్నట్లు ఇండిగో సంస్థ ఫిర్యాదుచేయంతో పట్నాలో దిగగానే పట్నా ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ అధికారులు అరెస్ట్‌చేశారు. ప్రస్తుతం బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నందున మద్యసేవనం రాష్ట్రపరిధిలో నేరం. మద్యం తాగి బిహార్‌లో అడుగుపెట్టినందుకే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. విమానంలో వీరు తోటి ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు అధికారంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ సీరియస్ న్యూఢిల్లీ: పారిస్–న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని సంస్థను డీజీసీఏ సోమవారం ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ ఆరున జరిగిన రెండు ఘటనలను అందులో ప్రస్తావించింది. సిబ్బంది సూచనలను లెక్కచేయకుండా బాత్రూమ్లో ధూమపానం చేస్తున్న వ్యక్తిపై, తోటి ప్రయాణికురాలి సీటు, దుప్పటిపై మూత్రవిసర్జన చేసిన మరో తాగుబోతు ప్రయాణికుడిపై అప్పుడే వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని డీజీసీఏ సూచించింది. ‘ ఏదైనా విమానంలో అనుకోని ఘటన జరిగితే ల్యాండింగ్ జరిగిన 12 గంటల్లోపు మాకు నివేదించాలి. కానీ డిసెంబర్ ఆరున ఘటన జరిగితే జనవరి ఆరున మేం అడిగేదాకా ఆనాటి ఘటనపై సంస్థ ఎలాంటి రిపోర్ట్చేయలేదు. అనుచితంగా ప్రవర్తించే ప్రయాణికుల విషయంలో మీ వైఖరి నిబంధనలకు అనుగుణంగా లేదు. రెండు వారాల్లోపు నివేదించండి. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని డీజీసీఏ పేర్కొంది. -
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్‌కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్‌ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్‌లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్‌లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్‌లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం..
ముంబై: శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తటంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండింగ్ చేశారు అధికారులు. విమానంలోని యెల్లో హైడ్రాలిక్ సిస్టమ్ పని చేయకపోవడంతో ముంబైకి మళ్లించినట్లు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్(డీజీసీఏ) అంధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి దుబాయికి శనివారం సాయంత్రం 143 మంది ప్రయాణికులతో బయలుదేరింది ఎయిరిండియా ఏ320 వీటీ-ఈఎక్స్‌వీ విమానం. సాంకేతిక సమస్యను గుర్తించి ముంబైకి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో సుపరక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో ఏర్పడిన సమస్యను సంబంధిత సిబ్బంది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు దారి మళ్లించడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 2వ తేదీన కన్నూర్ నుంచి దోహా వెళ్తున్న ఇండో విమానం 6ఈ-1715ని ముంబైకి మళ్లించారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యం చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్‌జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్‌పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్‌జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ
సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది. అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లో పెట్రోల్ లేదని చలాన్ -
స్పైస్‌జెట్‌పై కొరడా ఝుళిపించిన DGCA
-
విమానంలో ఒక్కసారిగా తగ్గిన ప్రెజర్.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి!
కొచ్చి: కొద్ది రోజులుగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి అత్యవసరంగా కిందకు దింపాల్సిన సంఘటనలు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే భయంతో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా దుబాయ్ నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సమస్య తలెత్తింది. క్యాబిన్లో ప్రెజర్ తగ్గటం వల్ల విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడినట్లు సమాచారం. అయితే.. ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా కిందకు దించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ముంబయి నుంచి మరో విమానంలో ప్రయాణికులను కొచ్చికి శుక్రవారం ఉదయం చేర్చారు. దుబాయి నుంచి కేరళలోని కొచ్చికి వస్తున్న ఎయిరిండియా విమానంలో సంకేతిక సమస్య తలెత్తిన ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ). ‘దుబాయి నుంచి కొచ్చికి వస్తున్న ఎయిరిండియా బోయింగ్ విమానం ఏఐ-934 కెప్టెన్.. క్యాబిన్లో ప్రెజర్ తగ్గిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు ఐఓసీసీకి సమాచారం అందించారు. విమానాన్ని ముంబైకి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశాం.’ అని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు సీనియర్ అధికారులను దర్యాప్తునకు నియమించినట్లు చెప్పారు. గత బుధవారం.. ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న గోఎయిర్ విమానం విండ్‌షీల్డ్ పగిలిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత గోఎయిర్ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈనెలలోనే ఇలాంటివి రోజుకు 30 సంఘటనలు చోటు చేసుకున్నట్లు తాజాగా డీజీసీఏ తెలిపింది. అయితే.. ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ‘సార్ నా బ్యాగులో బాంబు ఉంది..’ ఇండిగో విమానంలో ప్యాసింజర్ హల్చల్ -
స్పైస్‌జెట్‌కు షాక్.. DGCA నోటీసులు
న్యూఢిల్లీ: వరుస ఘటనలో ఎమర్జెన్సీల్యాండింగ్‌లు.. ప్రయాణికులను ఇబ్బందిపెడుతుండడంతో పాటు వార్తల్లో నిలుస్తున్న స్పైస్‌జెట్ సంస్థకు షాక్ తగిలింది. పౌర విమానయాన సంస్థల నియంత్రణ విభాగం డీజీసీఏ స్పైస్‌జెట్ సంస్థకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత 18 రోజుల్లో ఎనిమిది విమానాల్లో సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తాయి. ఈ లోపాల ఘటనలపై స్పైస్‌జెట్‌ను పూర్తిస్థాయి వివరణ కోరింది డీజీసీఏ. జూన్ 19న రెండు ఘటనలు, జూన్ 25న ఒకటి, జులై 2న మరోక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవిగాక వరుసగా చోటు చేసుకున్నాయి. ఇక మంగళవారం ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతికలోపంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ స్పైస్‌జెట్.. నష్టాల్లో కొనసాగుతోంది. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాల మధ్య రూ.316 కోట్లు, రూ.934 కోట్లు, రూ.998 కోట్లు.. వరుసగా నష్టాలు చవిచూసింది. చదవండి: ఈ స్పైస్‌జెట్‌కు ఏమైంది? -
ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. ప్రయాణీకులను విమానం ఎక్కకుండా అక్రమంగా నిరోధించినందుకు గాను రూ. 10 లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటు అయ్యే టికెట్లు కలిగి ఉన్నా ప్రయాణికులను బోర్డింగ్ నిరాకరించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. చెల్లుబాటు అయ్యే టిక్కెట్లున్నా, వాటిని సమయానికి ప్రెజెంట్ చేసినప్పటికీ, అనేక విమానయాన సంస్థలు బోర్డింగ్ నిరాకరించిన వచ్చిన ఫిర్యాదుల నివేదికల నేపథ్యంలో డీజీసీఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అదే విధంగా మార్గదర్శకాలను కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని మండిపడింది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీల తర్వాత ప్రకటన జారీ చేసింది. అకారణంగా ప్రయాణీకులను బోర్డింగ్‌కు నిరాకరించిన ఎయిరిండియాపై రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది. ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్‌లో భాగంగా ఎయిర్ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. 2010 నిబంధనల ప్రకారం వ్యాలిడ్ టికెట్లు ఉన్నప్పటికీ ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో వారికి గంటలోపే మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ తెలిపింది. గంటలోపే ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ఆయా ప్రయాణీకులకు 24 గంటల్లోపు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయని పక్షంలో ప్రయాణికులకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని వివరించింది. అదే 24 గంటలు దాటితే రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని డీజీసీఏ పేర్కొంది. -
అలర్ట్: మాస్క్ ధరించకుంటే దించేస్తారు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు అలర్ట్. ఎయిర్‌పోర్ట్‌లోగానీ, విమానంలోగానీ మాస్క్ ధరించకుంటే అనుమతించకూడదని కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మాస్కులు ధరించకుంటే.. దించేయాలని తెలిపింది. అంతేకాదు.. ప్రయాణం మొత్తంలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్పోర్ట్, విమానాల్లో కరోనా నిబంధనలు పాటించకుంటే.. ప్రయాణికులను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా చూడాలంటూ ఢిల్లీ హైకోర్టు.. రెగ్యులేటరీ బాడీని ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, పదే పదే హెచ్చరించినా పట్టించుకోపోతే వాళ్లను.. నిబంధనలను పాటించని ప్రయాణికుల జాబితాలో చేర్చి, తదనంతర చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. Mask Must ఈ తరుణంలో.. డీజీసీఏ ఆదేశాలనుసారం మాస్క్‌లు ధరించని ప్రయాణికులపై చర్యలు తీసుకోనున్నారు ఎయిర్పోర్ట్ నిర్వాహకులు. అలాంటి ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకునే హక్కు కూడా కల్పించారు. ప్రయాణాల్లో కేవలం ప్రత్యేక కారణాలు చూపిస్తేనే.. మాస్క్ తొలగించే అవకాశం కల్పిస్తారు. -
రెక్కలు తొడిగి, మళ్లీ నింగిలోకి జెట్ ఎయిర్ వేస్..!
అప్పులతో కుదేలైన ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తిరిగి తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జెట్ ఎయిర్ వేస్‌కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్(ఏఓసీ)ని అందించింది మే5,1993న నరేష్ గోయల్ జెట్ ఎయిర్ వేస్ పేరుతో తొలి కమర్షియల్ ఫ్లైట్‌ను ప్రారంభించారు. 100 పైగా విమానాలతో జెట్ ఎయిర్ వేస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. కానీ మార్కెట్లో కాంపిటీషన్, ఫ్లైట్ నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ ఏప్రిల్ 18,2019 నాటికి ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో జాతీయ అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా,ఈ సంస్థను యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి జలాన్, యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్ సంస్థలు ఒప్పొంద ప్రాతిపదికన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడం,పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థల కన్సార్టియం జెట్ ఎయిర్ వేస్‌కు 180మిలియన్ల నిధుల్ని అందించనున్నాయి. అందులో 60 మిలియన్లను అత్యవసర రుణాల్ని జెట్ ఎయిర్ వేస్ తీర్చనుంది. డీసీజీఏ వివరాల ప్రకారం డీసీజీఏ వివరాల ప్రకారం.. జెట్ ఎయిర్ వేస్ ఇప్పటికే తన కార్యకాలపాల్ని ప్రారంభించింది. మే15నుంచి మే17 మధ్య కాలంలో 5 విమానాల రాకపోకల్ని నిర్వహించింది. మిగిలిన కమర్షియల్ ఫ్లైట్లు జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభం కానున్నాయని డీసీజీఏ తెలిపింది. చదవండి👉ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే! -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్‌వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్‌వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
సంచలనం: పీకలదాకా మద్యం తాగి విమానం నడుపుతున్న పైలెట్లు!
విమానయాన రంగంలో 30కి పైగా వివిధ రకాలైన ఉద్యోగాలుంటాయి.వాటిలో మిగిలిన ఉద్యోగుల విధులు ఎలా ఉన్నా..ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే అధికారం పైలెట్లకు మాత్రమే ఉంటుంది. అందుకే ఈ విభాగంలో ఉద్యోగులు ఎంతో నిబద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇటీవల విమానం పైలెట్ల గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంస్థ విస్తుపోయే వాస్తవాల్ని బయట పెట్టింది. ఏవియేషన్ రెగ్యూలేటర్ ప్రకారం..విమానంలో ప్రయాణించే ముందు నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ (బీఏ) టెస్టుల్లో విఫలమైన విమాన సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉంటూ ఉద్యోగులకు తీరు ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించింది. ఎందుకంటే ఏవియేషన్ రెగ్యులేటర్ జనవరి 1, 2022 నుండి నాలుగు నెలల కాలంలో 48 మంది సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు చేయగా మద్యం సేవించడంతో పాటు ఇతర నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో విమానయాన సిబ్బందిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో 9మంది పైలెట్లు, 30మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి మద్యం సేవించినట్లు గుర్తించారు. వీరిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది రెండోసారి మద్యం తాగినట్లు తేలడంతో మూడేళ్లపాటు సస్పెండ్ చేసింది. మిగిలిన 37 మంది సిబ్బందిని తొలిసారి పాజిటివ్ రావడంతో వారిని సైతం 3 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విమానయాన సంస్థలు కాక్‌పిట్, క్యాబిన్ క్రూ సభ్యులలో 50 శాతం మందిని రోజూ ప్రీ ఫ్లైట్ ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాలని గత నెలలో డీజీసీఏ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తికి ముందే సిబ్బంది విమాన ప్రయాణానికి ముందే ఆల్కహాల్ టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2 నెలలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టి, విమానయాన సర్వీసులు ప్రారంభం కావడంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ల్ని మళ్లీ ప్రారంభించారు. తాజాగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల్లో విమానయాన సిబ్బంది బాగోతం బట్టబయలైంది. చదవండి👉మద్యం తాగి కాక్‌పిట్‌లో ప్రయాణం -
రెక్కలు తొడిగిన జెట్ ఎయిర్వేస్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ మళ్లీ రెక్కలు తొడిగింది. కమర్షియల్ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు సాధించింది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత తర్వాత జెట్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగిరింది. డీజీసీఏ నుంచి అనుమతి రావడంతో టెస్ట్ ఫ్లైట్‌ను ముందుగా నడిపించింది జెట్ ఎయిర్వేస్. 2022 మే5న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొదటి విమానం బయల్ధేరింది. మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆ కంపెనీ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. త్వరలోనే కమర్షియల్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. జెట్ ఎయిర్వేస్ చివరి కమర్షియల్ సర్వీస్ 2019 ఏప్రిల్ 17న నడిచింది. చదవండి : సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదంటున్న అపర కుబేరుడు వారెన్ బఫెట్ -
మార్చిలో విమానయానం జూమ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తదుపరి దేశీ విమానయానం ఊపందుకుంటోంది. గత మార్చిలో దేశీ ప్రయాణికుల సంఖ్య 1.06 కోట్లను తాకింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 76.96 లక్షలతో పోలిస్తే సుమారు 38 శాతం అధికం. వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజా గణాంకాలివి. గత నెలలో దేశంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 80 శాతం దాటడం గమనార్హం. విమానాల ఆక్యుపెన్సీని తెలియజేసే పీఎల్ఎఫ్ స్పైస్‌జెట్‌లో 86.9 శాతం, ఇండిగోకు 81 శాతం, విస్తారాలో 86.1 శాతంగా నమోదైంది. ఈ బాటలో గో ఫస్ట్ 81.4 శాతం, ఎయిరిండియా 85 శాతం, ఎయిరేషియా ఇండియా 81.3 శాతం చొప్పున పీఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. అయితే కేంద్రం నిర్వహణలోని ప్రాంతీయ సంస్థ అలయెన్స్ ఎయిర్ మార్చిలో 74 శాతం పీఎల్ఎఫ్నే సాధించినట్లు పేర్కొంది. కాగా.. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలపై నిషేధ ఆంక్షలు విధించడంతో విమానయాన రంగం కుదేలైన విషయం విదితమే. -
ఆకాశవీధిలో.. వేసవిలో పెరగనున్న విమానాలు
న్యూఢిల్లీ: రాబోయే వేసవి షెడ్యూల్‌కు సంబంధించి దేశీ విమానయాన సంస్థలు .. వారంవారీగా ఫ్లయిట్ సర్వీసులను 10.1 శాతం మేర పెంచనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. గత సీజన్లో ఈ సంఖ్య 22,980గా ఉండగా ఈ సీజన్లో 25,309గా ఉంటుందని పేర్కొంది. ఇండిగో అత్యధికంగా దేశీ రూట్లలో తన ఫ్లయిట్స్ సంఖ్యను 10.4 శాతం పెంచి 11,130 వీక్లీ సర్వీసులను నడపనున్నట్లు వివరించింది. ఎయిర్పోర్ట్ స్లాట్లపై గత నెల జరిగిన వర్చువల్ సమావేశం అనంతరం దేశీ విమానయాన సంస్థల వేసవి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు డీజీసీఏ తెలిపింది. కోవిడ్–19 కట్టడిపరమైన ఆంక్షల కారణంగా గత 24 నెలలుగా దేశీ ఏవియేషన్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. అయితే, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ.. గత కొద్ది వారాలుగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. వేసవి షెడ్యూల్ ప్రకారం వారంవారీగా ఎయిర్ఏషియా 1,601 (16 శాతం అధికం), ఎయిరిండియా 2,456 (10 శాతం అధికం) ఫ్లయిట్ సర్వీసులు నడపనున్నాయి. -
షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు. -
అమెరికా జాబ్ వదిలి స్వదేశానికి.. అంతలోనే...
పైలట్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అమెరికాలో ఉద్యోగాన్ని సైతం వదులుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. తన కల నేరవేరే సమయంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు మహిళా శిక్షణ పైలట్ మహిమా గజరాజ్ (29). మరి కొన్ని నెలల్లోనే పైలట్ శిక్షణ ముగుస్తుందనగా ఆమె అనూహ్యంగా దుర్మరణం చెందడం విషాదం. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ప్రమాదంలో మహిమ మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమెకు.. బాల్యం నుంచే పైలట్ కావాలని కోరిక. పీజీ పూర్తైన తర్వాత అమెరికా ఉద్యోగంలో చేరారు. పైలట్ కావాలన్న సంకల్పంతో అమెరికాను వదిలి స్వదేశానికి తిరిగివచ్చారు. భర్త పరంథామన్, కుటుంబ సభ్యులను ఒప్పించి పైలట్ శిక్షణలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ సమీపంలో ఉన్న ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలో గత ఐదారు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో చేరిన నెల రోజుల్లోనే చాలా వరకు మెలకువలు నేర్చుకుని.. బెస్ట్ ట్రైనీగా నిలిచారు. మహిమకు తోడుగా ఆమె తల్లి, భర్త.. రైట్ బ్యాంక్ సమీపంలోనే నివసిస్తున్నారు. విషాదం వెంట విషాదం కొద్ది రోజుల క్రితమే మహిమ తండ్రి గజరాజ్.. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శిక్షణలో చురుకైన అభ్యర్థిగా ఉన్న మహిమ.. ప్రమాదానికి గురికావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని ఫ్లైటైక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ సీఈవో మమత తెలిపారు. ఊహాగానాలు వద్దు.. వాస్తవాలు కావాలి ప్రమాదం ఎలా జరిగిందన్న వానిపై వాస్తవాలు వెల్లడించాలని మహిళ గజరాజన్ భర్త పరంథామన్ కోరారు. భర్తను, ఒక్కగానొక్క కూతురిని పోగొట్టుకుని తన అత్తగారు కుప్పకూలిపోయారని చెప్పారు. ప్రమాదం జరిగిన రూట్లో ఇంతకుముందు కూడా తన భార్య విమానం నడిపారని, కానీ ఇప్పుడు ఏమైందనేది తమకు తెలియాలని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలన్నారు. అక్టోబర్ చివరినాటికి ట్రైనింగ్‌లో చేరే నాటికే థియరీ పూర్తైందని, 185 ఫైయింగ్ అవర్స్ కోసం శిక్షణకు వచ్చినట్టు చెప్పారు. ఏప్రిల్/మే నాటికి ట్రైనింగ్ పూర్తి చేయాలని మహిమ అనుకుందని వెల్లడించారు. అదంతా అబద్దం ఆన్లైన్ ట్రేడర్‌గా పనిచేస్తున్న పరంథామన్ కూడా గతంలో పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. అయితే ఆయన పైలట్ శిక్షణ పూర్తిచేయలేకపోయారు. మహిమ నాలుగు నెలల గర్భిణి అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఇదంతా అవాస్తవం. నా భార్య గర్భంతో ఉంటే విమానం నడిపే సాహసం ఎందుకు చేయనిస్తాం?’అని ప్రశ్నించారు. కాగా, శిక్షణ విమానం కుప్పకూలిన దుర్ఘటనపై డీజీసీఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
తప్పిన ఘోర ప్రమాదం! ఆలస్యంగా వెలుగులోకి..
బెంగళూరు: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు ఇండిగో విమానాలు గాల్లో ఉండగా.. కాస్తలో ఒకదాంతో మరొకటి ఢీ కొట్టే ప్రమాదం తప్పింది. జనవరి 7వ తేదీనే ఈ ఘటన జరిగిందని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఇండిగో విమానం 6ఈ455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6ఈ246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) ఉదయం పూట వెళ్తున్న సమయంలో సుమారు 5 నిమిషాల వ్యవధిలో కెంపగౌడ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు విమానాలు గాల్లో అత్యంత దగ్గరా సమీపిస్తుండగా రాడార్లు హెచ్చరించాయి. దీంతో రెండు విమానాల పైలట్లు వెంటనే అప్రమత్తమై దూరంగా మళ్లించండంతో ఢీకొట్టే ముప్పు తప్పిందని తెలిపారు. ఘటన జరిగినప్పుడు రెండు విమానాలు 3,000 అడుగుల ఎత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు-కోల్‌కతా విమానంలో 176 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది. బెంగళూరు-భువనేశ్వర్ విమానంలో 238 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మొత్తం 426 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. రెండు విమానాలు గాల్లో ప్రమాదకరంగా అత్యంత సమీపంగా కదులుతున్న సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ లోకేంద్ర సింగ్ గమనించి.. వెంటనే రెండు విమానాలకు సిగ్నల్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో రెండు విమానాలు గాల్లో ఢీకొనకుండా నివారించారని డీజీసీఏ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడా నివేదించలేదని తెలిపారు. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు. దీనికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు విమానాలు బెంగళూరు విమానాశ్రయం టేకాఫ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
అలెర్ట్! అంతర్జాతీయ విమానాలు రద్దు.. డీజీసీఏ కొత్త ఆదేశాలు
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచి ఆంక్షలే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా 2020 మార్చి 29న భారత ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. ఆ తర్వాత 2020 మే నుంచి వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడిపించారు. ఆ తర్వాత ఎయిర్ బబుల్ ఒప్పందం కింద 32 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. పునరుద్ధరిస్తాం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానలు అన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ డీజీసీఏ నుంచి ప్రకటన వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ వేరియంట్ గురించి సమాచారం దక్షిణాఫ్రికా బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ వెంటనే పరిమితంగా నడుస్తున్న విమాన సర్వీసులు, ప్రయాణికుల విషయంలో ఆంక్షలు తెరపైకి వచ్చాయి. దీంతో విమానాల పునరుద్ధరణ నిర్ణయం వాయిదా వేస్తున్నట్టు డిసెంబరు 1న డీజీసీఏ ప్రకటించింది. జనవరి 31 వరకు గత పది రోజుల వ్యవధిలో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2021 డిసెంబరు 9న ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపింంచాలనే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/EXPkDc8Ejw — DGCA (@DGCAIndia) December 9, 2021 వీటికి గ్రీన్‌సిగ్నల్ ఎయిర్ బబుల్ ఒప్పందం ఉన్న 32 దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 32 దేశాల జాబితాలో యూకే, యూఎస్, కెన్యా, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయి. అదే విధంగా కార్గో విమాన సర్వీసులు కూడా యథావిధిగా ఉంటాయి. చదవండి: హైదరాబాద్ వచ్చే ఎన్నారై, విదేశీయులకు గుడ్‌న్యూస్ ! -
కరోనా భయం తగ్గింది.. దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు
ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్‌లో ఇది సుమారు 90 లక్షలుగా నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 53 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో 48 లక్షలు, ఎయిరిండియా 11 లక్షలు, విస్తార 7 లక్షలు, ఎయిర్ఏషియా ఇండియా 6 లక్షలు, స్పైస్‌జెట్ 8.10 లక్షలు, గో ఫస్ట్ 8.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. కీలకమైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సమయపాలనకు సంబంధించి ఇండిగో (88.8 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో మార్కెట్ వాటా అత్యధికంగా 53.5 శాతంగా ఉంది. ఎయిరిండియా 11.8 శాతం, గో ఫస్ట్ 9.8 శాతం, స్పైస్‌జెట్ 9 శాతం, విస్తారా 7.8 శాతం వాటా దక్కించుకున్నాయి. చదవండి: ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్ ఫ్లైట్ సర్వీసులు.. -
స్పైస్‌జెట్ ఎయిర్వేస్కు డీజీసీఏ షాక్
భారత్‌లో విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్‌కు ఝలక్ ఇచ్చింది. స్పైస్ జెట్ కార్గొ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. మొత్తం 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది డీజీసీఏ. లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్‌ను అనుమతించరు. దేశీయ, విదేశీ విమానాలను ఇందుకు అనుమతించబోమని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వార్షిక ఏడాదిలో రూ.30 కోట్ల లాభాన్ని కార్గొ రవాణా ద్వారా సాధించింది స్పైస్ జెట్ సంస్థ. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఓ రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. ఆ షిప్పర్ణు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్లు స్పైస్ జెట్ తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. చదవండి: క్రిప్టోపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ సంచలన వ్యాఖ్యలు -
Dgca :67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టి వచ్చారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టివచ్చారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 33.8 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. ఏప్రిల్‌లో 57.25 లక్షలు, మే నెలలో 21.15, జూన్‌లో 31.13, జూలైలో 50 లక్షల మంది ప్రయాణం చేశారు. గణాంకాలనుబట్టి మే నెలలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గత నెలలో ఇండిగో 38.16 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి 57 శాతం వాటాను దక్కించుకుంది. స్పైస్‌జెట్ 5.84 లక్షల మంది ప్రయాణికులతో 8.7 శాతం వాటా పొందింది. ఎయిర్ ఇండియా 8.86 లక్షలు, గో ఫస్ట్ 4.58, విస్తారా 5.58, ఎయిర్ ఏషియా 3.49 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేట్ 60.3–79.6 శాతం మధ్య నమోదైంది. స్పైస్‌జెట్ అత్యధికంగా 79.6 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. చదవండి: భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
బార్క్, మైసూర్లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్‌లోని అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 20 ► పోస్టుల వివరాలు: డ్రైవర్, పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్ ఆఫీసర్. ► అర్హత: హెచ్ఎస్సీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–శారీరక ప్రమాణాలు ఉండాలి. ► వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021 ► వెబ్సైట్: https://recruit.barc.gov.in/barcrecruit/ డీజీసీఏలో 27 కన్సల్టెంట్ పోస్టులు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!) ► మొత్తం పోస్టుల సంఖ్య: 27 ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ లైసెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, సంబంధిత అనుభవం ఉండాలి. ► వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిక్రూట్మెంట్ సెక్షన్, డీజీసీఏ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► వెబ్సైట్: https://www.dgca.gov.in -
విమానాల నిషేధం పొడిగింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు విమానాల నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆది వారం తెలిపింది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే వందే భారత్ మిషన్‌తో పాటు, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి 28 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కొనసాగుతోంది. తాజా నిషేధ పొడిగింపు కార్గో విమానాలకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. -
భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు?
అతి పెద్ద విమానాలకు మరో పేరుగా స్థిరపడిన బోయింగ్ విమనాలు మళ్లీ భారత గగనతలంలో ప్రయాణానికి రెడీ అయ్యాయి. రెండున్నరేళ్ల నిషేధం తర్వాత బోయింగ్ ఫ్లైట్లను నడిపేందుకు విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు ఇచ్చింది. ప్రమాదాల జరగడం వల్లే జంబో విమానాల తయారీకి బోయింగ్ సంస్థ పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన విమానాలు ఏవియేషన్ సెక్టార్లో రాజ్యమేళాయి. అయితే బోయింగ్ 737 మ్యాక్స్ విమానంతో కథ అడ్డం తిగిరింది. యూరప్, అమెరికా, ఏషియా అని తేడా లేకుండా బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. దీంతో వరుసగా ఒక్కో దేశం ఈ విమానలను కమర్షియల్ సెక్టార్ నుంచి తొలగించాయి. భారత్ సైతం 2019 మార్చిలో బోయింగ్ విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచి రెండున్నరేళ్ల నిషేధం తర్వాత ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నడుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో స్పైస్ జెట్ సంస్థ సెప్టెంబరు చివరి వారం నుంచి బోయింగ్ విమానాలు నడిపేందుకు రెడీ అవుతోంది. మరోవైపు దుబాయ్ ఇండియా మధ్య సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం బోయింగ్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాలపై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఎత్తేయగా తాజగా ఆ జాబితాలో ఇండియా చేరింది. చైనా ఇప్పటికీ నిషేధాన్ని కొసాగిస్తోంది. పారదర్శకత ఏదీ బోయింగ్ విమానాల కమర్షియల్ ఆపరేషన్స్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అనుమతులు ఇవ్వడంపై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అనుమతులు ఇవ్వడం, రద్దు చేయడం అనేది డీజీసీఏ సొంత వ్యవహారం కాదంటున్నారు. ఏ కారణాల చేత అనుమతులు రద్దు చేశారు ? విమానంలో ఏ లోపాలను గుర్తించారు ? వాటిని ఆ సంస్థ సవరించిందా లేదా ? అనే వివరాలు ప్రజల ముందు ఉంచకుండా ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బోయింగ్ విమానాలు తిరిగి అందుబాటులోకి రావడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. చదవండి: బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
దేశంలో ఎగిరే టాక్సీలకి తొలిగిన అడ్డంకి
మన దేశంలో రాబోయే కాలంలో నగర రోడ్లపై ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కావచ్చు. దేశంలో డ్రోన్(Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన 2021 డ్రోన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు-2021(Drone Rules) పేరిట వీటిని విడుదల చేసింది. "ఎయిర్ టాక్సీలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోదనలు జరుగుతున్నాయి.. దీనికోసం అనేకా స్టార్టప్ లు ముందుకు వస్తున్నాయి. మీరు రోడ్లపై చూసే ఉబెర్ టాక్సీల వలే, కొత్త డ్రోన్ పాలసీ కింద మీరు గాలిలో ఎగిరే టాక్సీలను చూసే సమయం చాలా దూరంలో లేదు. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా' అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం.. డ్రోన్ల ఆపరేషన్ కోసం లైసెన్స్ నమోదు లేదా జారీ చేయడానికి ముందు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు. అంతేగాకుండా, ఈ లైసెన్స్ ఫీజులను గణనీయంగా తగ్గించారు. కార్గో డెలివరీల కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నారు. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్ధ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారాలను 25 నుంచి 5కు తగ్గించింది. ఆపరేటర్ నుంచి వసూలు చేసే ఫీజుల రకాలను 72 నుంచి నాలుగుకు తగ్గించింది. ఇక అన్ని డ్రోన్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ డిజిటల్ స్కై ఫ్లాట్ ఫారం ద్వారా జరుగుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సిఫారసు చేసే నిబంధనలకు అనుగుణంగా అన్ని డ్రోన్ ట్రైనింగ్, పరీక్షలు నిర్వహించబడతాయి.(చదవండి: అసంఘటిత కార్మికులకు కేంద్రం శుభవార్త!) జర్మన్ ఫ్లయింగ్ టాక్సీ స్టార్టప్ వోలోకాప్టర్ 2024 పారిస్ లో జరిగే ఒలింపిక్స్ సమయానికి తన ఎయిర్ టాక్సీని అందుబాటులోకి తీసుకొనిరావలని చూస్తుంది. భారీ డ్రోన్ లాగా కనిపించే ఈ ఎగిరే టాక్సీ రెండు సీట్లను కలిగి ఉంటుంది. ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులు కూడా ఈ రంగంలో ఆసక్తిని కనబరుస్తున్నారు సింధియా అన్నారు. హ్యుందాయ్ 2025 నాటికి తన ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ దక్షిణ కొరియా కంపెనీ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీల పనిచేస్తుంది. ఇది అత్యంత రద్దీగా ఉండే పట్టణ కేంద్రాల నుంచి విమానాశ్రయాలకు ఐదు నుంచి ఆరు మందిని రవాణా చేయగలదు. -
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థతులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జూలై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగుతాయి. దేశాలతో ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగుతాయి. యుఎస్, యుకె, యుఎఇ, కెన్యా, భూటాన్ , ఫ్రాన్స్‌తో సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారతదేశానికి ఎయిర్ బబుల్ ఒప్పందం ఉంది. అలాగే కొన్నికార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించదని డీజీసిఏ స్పష్టం చేసింది. కాగా కరోనా థర్డ్‌వేవ్‌పై నిపుణులు, పలువురు శాస్త్రవేత్తల హెచ్చరికల మధ్య డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి 2020 మార్చి 23 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే ఈ ఏడాది మేనుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఇక డ్రోన్ల వినియోగం మరింత సులభతరం
సాక్షి, న్యూఢిల్లీ: నమ్మకం, స్వీయ ధృవీకరణ, చొరబడని పర్యవేక్షణ ప్రాతిపదికన దేశంలో డ్రోన్లను సులభంగా వినియోగించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ ముసాయిదా నియమాలను జారీ చేసింది. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు-2021లో పేర్కొన్న 25 ఫారంలతో పోల్చితే దేశంలో డ్రోన్లను ఆపరేట్ చేయడానికి నింపాల్సిన ఫారంల సంఖ్యను ఆరుకు తగ్గిస్తూ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించారు. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 ఈ ఏడాది మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. డ్రోన్ నియమావళి-2021 నోటిఫై అయితే దేశంలో మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనలు-2021 స్థానంలో అమలవుతుంది. ముసాయిదా నిబంధనలలో రుసుమును నామమాత్ర స్థాయికి కుదించారు. అలాగే డ్రోన్ పరిమాణానికి, దీనితో సంబంధం ఉండదని ముసాయిదా తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాల ధ్రువీకరణ పత్రం, నిర్వహణ ధ్రువీకరణ పత్రం, దిగుమతి క్లియరెన్స్, ఇప్పటికే ఉన్న డ్రోన్ల అంగీకారం, ఆపరేటర్ అనుమతి, ఆర్అండ్ డీ సంస్థ అధీకృత ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్స్ సహా వివిధ ఆమోదపత్రాల అవసరాన్ని ముసాయిదా నియమావళి రద్దు చేసింది. విమానాశ్రయం చుట్టూ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో 400 అడుగుల వరకు, గ్రీన్ జోన్లలో 400 అడుగుల వరకు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదని ముసాయిదా నిబంధనలు పేర్కొన్నాయి. డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియను సూచించాయి. చిన్న డ్రోన్లకు (వాణిజ్యేతర ఉపయోగం కోసం), నానో డ్రోన్లు, ఆర్అండ్డీ సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం లేదని నిబంధనలు పేర్కొన్నాయి. సరుకు డెలివరీ కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయనున్నట్టు, దేశంలో డ్రోన్ స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా తెలిపింది. డ్రోన్ శిక్షణ, పరీక్షల నిర్వహణ అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది. శిక్షణ ప్రమాణాలను, డ్రోన్ పాఠశాలల పర్యవేక్షణ, ఆన్లైన్లో పైలెట్ లైసెన్స్‌ల జారీ వంటి అంశాలను డీజీసీఏ అమలుచేస్తుంది. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ జారీచేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదా దాని పరిధిలోని అధీకృత సంస్థలు కలిగి ఉంటాయి. తయారీదారు స్వీయ ధ్రువీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్ఫామ్లో వారి డ్రోన్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య పొందవచ్చు. ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5లోగా తెలియపరచవచ్చని నియమావళి పేర్కొంది. దేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి ఉండదని ముసాయిదా పేర్కొంది. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం వ్యాపార–స్నేహపూర్వక సింగిల్–విండో ఆన్లైన్ వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. -
Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ
న్యూఢిల్లీ: డ్రోన్ల ద్వారా వాణిజ్య సరుకు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయోగాత్మక ప్రాజెక్టు సిద్ధమైంది. ఇందుకు వైమానిక సరుకు రవాణా(కార్లో) సంస్థ స్పైస్ ఎక్స్‌ప్రెస్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీ 'డెలివరి' చేతులు కలీపాయి. మూడు నాలుగు నెలల్లో డ్రోన్ల డెలివరీ పైలట్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్ జెట్‌కు చెందిన స్పైస్ ఎక్స్ఫ్రైస్ కన్ఫార్షియంను పౌర విమానయాన అధీకృత సంస్థ (డీజీసీఏ) ఎంపిక చేసింది. బీవీఎల్వోఎస్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ప్రయోగాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు, సరుకు రవాణా, క్రిటికల్ మెడికల్ సర్వీసుల, పర్యావరణ పహారా తదితర కీలక వాణీజ్య సర్వీసులకు డ్రోన్ల టెక్నాలజీని వినియోగించేందుకు వీలుంటుందని నిపుణులు తెలియజేశారు. డెలివరీతో కుదిరిన ఎంవోయూ ద్వారా రెండు సంస్థలూ లబ్లి పొందనున్నట్లు స్పైస్ ఎక్స్‌ప్రెస్ సీఈవో సంజీవ్ గుప్తా పేర్కొన్నారు. తమకున్న సామర్జ్యాలతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఇది సరుకు రవాణాలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని 3-4 నెలల్లో ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్పైస్‌జెట్‌తో తమకున్న దీర్షకాల సాహచర్యానికి ఈ ఒప్పందం మరింత బలాన్నివ్వనున్నట్లు డెలివరీ సీఈవో అజిత్ పాయ్ పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే వీలున్నదని తెలియజేశారు. ఎంవోయూలో భాగంగా భూమిపై లాజిస్టిక్స్ సేవలకు డెలివరీ పూర్తస్తాయిలో మద్దతివ్వనుంది. కాగా.. ఈ మే నెలలో డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల డెలివరీని చేపట్టేందుకు పార విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వానికి షరతులతో అనుమతించిన విషయం విదితమే. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే బాటలో వ్యాక్సిన్ల సరఫరాకు యూఏఎస్ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
DGCA:అంతర్జాతీయ విమానాల నిషేధంపై కీలక నిర్ణయం
ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని కేంద్రం మరో 30 రోజులు పొడిగించింది. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని డీజీసీఏ తన ట్విటర్లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలపై నిషేధం ఉన్నా పలు దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా విమానాల రాకపోకలు జరుగుతుంది. కాగా భారత్ అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చదవండి: మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత pic.twitter.com/IueesZFoiV — DGCA (@DGCAIndia) May 28, 2021 -
ఆకాశవీధిలో పెళ్లి.. వధువరులపై కేసు!
న్యూఢిల్లీ: ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్‌దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. పెళ్లిపై విచారణ ఛార్టెడ్ ఫ్లైట్‌లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న ఫ్లైట్ సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించారనే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పెళ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని తీవ్రంగా పరిగణించింది డీజీసీఏ. వైరల్‌గా మారిన పెళ్లి తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్, దక్షిణలు పెళ్లి కుదిరింది. పెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వధువరులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన వారు బెంగళూరు నుంచి మధురైకి చార్టెట్ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో ... విమానంలోనే వధువరులకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దేశం నలుమూలల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. -
గంట సేపు గాల్లోనే చక్కర్లు...
న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లిన భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. సరైన అనుమతులు లేవనే కారణంతో శనివారం బాక్సర్లు వెళ్లిన ప్రత్యేక విమానాన్ని (స్పైస్ జెట్) అక్కడి విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దాంతో గంటకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఆటగాళ్లంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇంధనం అయిపోవచ్చిదంటూ ‘ఫ్యూయల్ ఎమర్జెన్సీ’ని కూడా ప్రకటించింది. చివరకు విదేశాంగ శాఖ జోక్యంతో పరిస్థితి కుదుట పడింది. దీనిపై డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. కరోనా కారణంగా భారత్‌నుంచి వచ్చే విమానాలపై యూఏఈలో ఆంక్షలు ఉన్నాయి. సాధారణ ఫ్లయిట్లను ఆ దేశం అనుమతించడం లేదు. దాంతో ప్రభుత్వ అనుమతితో భారత బాక్సింగ్ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయ లోపం కారణంగా కిందకు దిగేందుకు అనుమతి దక్కలేదు. దాంతో యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన తర్వాత అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే మరో గంట పాటు అన్ని పత్రాల తనిఖీ పూర్తయ్యే వరకు బాక్సర్లు విమానంనుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా... భారత్ నుంచి 19 మంది బాక్సర్లు (10 మంది మహిళలు, 9 మంది పురుషులు) బరిలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి మేజర్ బాక్సింగ్ టోర్నీ. మహిళల విభాగంలో మేరీ కామ్ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ బరిలో ఉన్నాడు. -
గుడ్ న్యూస్: అందుబాటులోకి మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరీ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని ఎదుర్కోవడానికి మరో ఔషధ వినియోగానికి తాజాగా అనుమతి లభించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉండే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం యాంటీవైరల్ డ్రగ్ విరాఫిన్‌ను ఉపయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అత్యవసర వినియోగనికి అనుమతి లభించినట్లు జైడస్ కాడిలా ప్రకటించింది. తక్కువ స్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి చికిత్సలో భాగంగా దీన్ని అందిస్తారు. ఇప్పటికే తీవ్ర కరోనాతో బాధపడేవారికి రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో 20-25 కేంద్రాలలో నిర్వహించిన మల్టీసెంట్రిక్ ట్రయల్ లో విరాఫిన్ కోవిడ్-19 చికిత్సలో ప్రధాన సవాళ్లలో ఒకటైన శ్వాసకోశ బాధలను, వైఫల్యాన్ని విరాఫిన్ నియంత్రించగలిగిందని ఇతర సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కూడా ఏమి రాలేదని కంపెనీ పేర్కొంది. దేశంలో ఒకే రోజులో 3.32 లక్షల కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కు చేరుకోగా, క్రియాశీల కేసులు 24 లక్షలను దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి -
అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ
సాక్షి, న్యూ ఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మాత్రం ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తగు చర్యలు తీసుకుంటోంది. అందుకుగాను విమానంలో మాస్క్‌లు సరిగా ధరించకపోతే లేదా కోవిడ్-19 నిబంధనలను సరిగ్గా పాటించకపోతే ప్రయాణీకులను దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని ‘విధేయత లేని ప్రయాణీకులు' గా పరిగణిస్తామని డీజీసీఏ హెచ్చరించింది. మార్చి 13న రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో డీజీసీఏ , "విమాన ప్రయాణాన్ని చేపట్టే కొంతమంది ప్రయాణికులు 'కోవిడ్ -19 ప్రోటోకాల్'లకు కట్టుబడి ఉండట్లేదు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో , విమానాశ్రయంలో ఉన్నంతసేపు అన్ని సమయాల్లో మాస్క్‌లను కచ్చితంగా ధరించాల’ని పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని తెలిపింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణీకులు మాస్క్‌లను తీయవద్దని డీజీసీఏ సూచించింది. విమానశ్రాయ ఎంట్రీలో మోహరించిన సిఐఎస్ఎఫ్ , ఇతర పోలీసు సిబ్బంది మాస్క్ ధరించకుండా ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరీనీ అనుమతించకుండా చూసుకోవాలని తెలిపింది. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా భద్రత , తనిఖీ అధికారులు,ఇతర పర్యవేక్షక అధికారులు చూడాలని డీజీసీఏ కోరింది.విమానాశ్రయ ప్రాంగణంలో ప్రయాణీకులు సరిగ్గా మాస్క్‌లు ధరించేలా చూడాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని విమానాశ్రయ డైరెక్టర్ , టెర్మినల్ నిర్వాహకులను డీజీసీఏ కోరారు. ఒకవేళ, ఎవరైనా ప్రయాణీకులు "కోవిడ్ -19 ప్రోటోకాల్" ను ఉల్లంఘింస్తే హెచ్చరికలను జారీ చేయాలని, తరువాత కూడా వినకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. (చదవండి: టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే) pic.twitter.com/YgW0HzrGoc — DGCA (@DGCAIndia) March 13, 2021 -
టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానయానాన్ని నియంత్రించే డీజీసీఏ మంగళవారం స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్‌గా అన్‌ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలని తెలిపింది. అన్‌ఫిట్ లక్షణాలు 14 రోజులకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్నెస్ ఉందో లేదో చెబుతామంది. పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత విమానాల్లో పని చేసే సిబ్బందిని అరగంట పాటు వైద్యులు పరిశీలిస్తారని చెప్పింది. -
అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం పొడిగింపు
న్యూదిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలను పరిస్థితులను బట్టి సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలను ఎటువంటి షరతులు వర్తించవని స్పష్టంచేసింది. దీనికి సంబందించిన ఒక సర్క్యులర్ ను డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్ కుమార్ జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసింది. మే నెల నుంచి ‘వందే భారత్’ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు, జూలై నుంచి కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీస్‌లను నడుపుతున్నారు.(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!)