శంషాబాద్: దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ ఉంటుందని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో ఈ మేరకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో మే 3 వరకు దేశవ్యాప్తంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు సాగించవని మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొంది. మే 15 నుంచి బుకింగ్‌లు చేపట్టిన ఎయిర్‌లైన్స్‌ల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. డీజీసీఏ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు లేనిదే టికెట్‌ల బుకింగ్ ఎలా ప్రారంభించారని పలువురు ప్రశ్నించారు. భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment