
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 3 వరకు లౌక్‌డౌన్ అమల్లో ఉండగా, ఆ తర్వాతి తేదీలకు ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ బుకింగ్‌లను కొనసాగిస్తుండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యం చేసుకుంది. ‘‘ఎయిర్‌లైన్స్ సంస్థలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు తగిన సమయం, ముందస్తు నోటీసు ఇవ్వడం జరుగుతుంది’’ అంటూ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్‌లను నిలిపివేసింది. మే 4వ తేదీ నుంచి ప్రయాణాలకు ఎయిర్‌ఇండియాతోపాటు, ప్రైవేటు ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు తీసుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు దూరంగా ఉండాలని పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ సూచించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment