ticket booking
-
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్‌తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్‌తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్‌ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్‌లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్.. వైల్డ్ ఫైర్ మీనింగ్ చూపిస్తున్న ఐకాన్
-
ఎయిర్‌లైన్స్‌కు పండుగే!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు. → అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ. → ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి. → ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి. → హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి. → కానీ, పండుగల సీజన్లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. → ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.విమాన ప్రయాణికుల జోరు దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి. -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష!.. స్పందించిన రైల్వే శాఖ
ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలంటే తప్పకుండా పర్సనల్ అకౌంట్స్ ద్వారా మాత్రమే బుక్ చేయాలని, బంధువులు లేదా ఫ్రెండ్స్ అకౌంట్స్ ద్వారా బుక్ చేస్తే వారికి జైలు శిక్ష పడటమే కాకూండా.. రూ. 10000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపైనా మొదటిసారి 'రైల్వే' స్పందించింది.రైల్వే శాఖ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని కొట్టిపారేసింది. ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే జరుగుతున్న ప్రచారమని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీలో పర్సనల్ ఐడీ నుంచి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఐఆర్సీటీసీలో ఒక యూజర్ ఐడీ ద్వారా నెలకు కేవలం 12 టికెట్లను పొందవచ్చు. ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న వ్యక్తులు ఒక నెలలో 24 టికెట్స్ బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ వివరించింది. పర్సనల్ ఐడీ ద్వారా బుక్ చేసిన టికెట్స్ ఇతరులకు విక్రయించడానికి కాదు.. ఒకవేలా అలా జరిగితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది. The news in circulation on social media about restriction in booking of etickets due to different surname is false and misleading. pic.twitter.com/jLUHVm2vLr— Spokesperson Railways (@SpokespersonIR) June 25, 2024 -
వాట్సాప్‌లో మెట్రో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఈజీగా..!
వాట్సాప్ తన ఏఐ చాట్ బాట్ ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయాన్ని నాగపూర్‌కు విస్తరిస్తోంది. ప్రయాణికులకు మెట్రో టికెట్లను ఎక్కడి నుంచైనా ముందస్తుగా బుక్ చేసుకోవడానికి మరింత సౌకర్యవంతమైన మార్గాన్ని ఇస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణేలోని మెట్రోలకు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది.వాట్సప్‌లో మెట్రో టికెట్ బుక్ చేసుకోండిలా..వాట్సప్‌లో మెట్రో టికెట్ బుకింగ్ సేవలు ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు 8624888568 (నాగపూర్ మెట్రో), 8341146468 (హైదరాబాద్ మెట్రో) నంబర్‌కు 'Hi' అని పంపాలి లేదా ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ సులభమైన చాట్‌బాట్ టికెట్ బుకింగ్‌ను సులభతరం చేస్తుంది. రియల్ టైమ్ అప్డేట్లను అందిస్తుంది. అవసరమైన ప్రయాణ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ ఇంటర్ఫేస్ ద్వారా అందిస్తుంది.ఇందులో క్విక్ పర్చేజ్ ఆప్షన్ కూడా ఉంది. తరచుగా ప్రయాణం చేసేవారి కోసం దీన్ని రూపొందించారు. ఈ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే రూట్లను సేవ్ చేయడం ద్వారా బుకింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. గమ్యస్థానాలు, స్టార్టింగ్ పాయింట్లను ఎంచుకోవడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది.వాట్సాప్ ఆధారిత టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకే సమయంలో ఆరు సింగిల్ జర్నీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి లావాదేవీకి 40 మంది ప్రయాణికులకు గ్రూప్ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులతో సులభంగా చెల్లింపులు చేయవచ్చు. -
ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!
విమాన ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్‌గా చెల్లించాలని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. చాలాసమయాల్లో విమానాలను రద్దుచేస్తుంటారు లేదా వాటిని ఏదో కారణాలతో మళ్లిస్తుంటారు. దాంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాంతోపాటు అప్పటికే వారు తీసుకున్న టికెట్ ధర తిరిగి చెల్లించేందుకు కొన్నిసార్లు విమాన సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారికి ఆటోమేటిక్‌గా రీఫండ్ వచ్చేలా సదుపాయం కల్పిస్తున్నారు.కార్పొరేట్ల అనవసరపు రుసుముల నుంచి ప్యాసింజర్లను రక్షించేందుకే కొత్త నిబంధనలు తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం బుధవారం తెలిపింది. విమానయాన సంస్థ ప్రయాణికులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినపుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి వెంటనే రీఫండ్ చేయాలని యూఎస్ రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ ఒక ప్రకటనలో తెలిపారు.కొత్త నిబంధనలు ఇలా..ప్రయాణికులు ప్రత్యేకంగా అభ్యర్థించకపోయినా వారికి అందించాల్సిన రిఫండ్లను ఆటోమేటిక్‌గా చెల్లించాలి.దేశీయ విమానాలు 3 గంటలు, అంతర్జాతీయ సర్వీసుల రాకపోకల్లో 6 గంటలు అంతరాయం ఉంటే రీఫండ్‌కు అర్హులు.మొదట కొనుగోలు చేసిన దాని కంటే తక్కువ తరగతికి డౌన్‌గ్రేడ్ చేయడం. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎకానమీకి పంపిస్తే రీఫండ్ పొందవచ్చు.ఏదైనా కారణాలవల్ల చేరుకునే లేదా బయలుదేరే విమానాశ్రయంలో మార్పులుంటే అర్హులు.దివ్యాంగులకు సరైన సౌకర్యాలు కల్పించకపోతే రీఫండ్ పొందవచ్చు.దేశీయ విమానాలు విమానాశ్రయంలో దిగాక నిర్దేషించిన సమయంలోపు బ్యాగేజ్ డెలివరీ చేయకపోతే ప్రయాణికులు తనిఖీ చేసిన బ్యాగ్ ఫీజు వాపసు పొందవచ్చు. విమానంలో వైఫై లేదా ఎంటర్టైన్మెంట్ వంటి సేవల కోసం ఎవరైనా డబ్బు చెల్లించి వాటిని పొందకపోతే తిరిగి తమ డబ్బును రీఫండ్ కోరవచ్చు.ఇదీ చదవండి: ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్2020లో కొవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఎయిర్‌లైన్స్, టిక్కెట్ ఏజెంట్లు ప్రయాణికుల రీఫండ్లను తిరస్కరించారని పెద్దమొత్తంలో ఫిర్యాదులు అందాయి. రీఫండ్ ఆలస్యం అవుతుందని కూడా కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలా ఎయిర్‌లైన్స్ శాఖకు అందిన విమాన ప్రయాణ సర్వీస్ ఫిర్యాదుల్లో 87% రీఫండ్‌కు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. దాంతో స్పందించిన ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. -
నేడు జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 65,051 మంది స్వామివారిని దర్శించుకోగా 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల ► మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
మేడారం జాతరకు హెలికాప్టర్
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా... ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800. బుకింగ్ ఇలా..: హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్లైన్లో info@helitaxi. com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి. -
ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి తెలుసా?
IRCTC E-Ticket & I-Ticket: ఆధునిక కాలంలో ట్రైన్ జర్నీ సర్వ సాధారణమయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే రైలు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవి ఈ-టికెట్ & ఐ-టికెట్. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ-టికెట్ (E-Ticket) ఐఆర్సీటీసీ అందించే ఎలక్ట్రానిక్ టికెట్నే 'ఈ-టికెట్' అంటారు. ఈ టికెట్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందుబాటులో ఉంటే ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటెడ్ రూపంలో లభించదు. ఈ టికెట్‌తో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సీట్ నెంబర్, బెర్త్ వంటి వాటిని మీరే సెలక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఐ-టికెట్ (I-Ticket) ఐ-టికెట్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్ మీరు నేరుగా ఏదైనా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనికి ప్రత్యేక చార్జీలు ఉంటాయి. దీన్ని ప్రయాణానికి మూడు రోజులు ముందుగా అయినా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి కనీసం 48 గంటలు పడుతుంది. దీనిని క్యాన్సిల్ చేసుకోవాలనుంటే కూడా మీరు రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. -
ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు
దేశవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానున్న ఆదిపురుష్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని చాలా మంది ప్రముఖులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రామ్ చరణ్, కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, గాయని అనన్య బిర్లా 10,000 టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) ఇప్పుడు తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక జంట కూడా ఆ క్లబ్లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు వారు ఆదిపురుష్ సినిమాను చూపించాలని నిర్ణయించుకున్నారు. 'ఎలాంటి హద్దులు లేకుండా అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఆదిపురుష్. దీనిని మా జీవితకాలంలో వచ్చిన అవకాశంగా భావించాలి. ఆదిపురుష్.. ద్వారా ఇతహాస మహాగాధ రామాయణం గురించి తెలుసుకునేలా తెలుగు రాష్ట్రాల్లోని పలు అనాథ శరణాలయాల్లో ఉన్న 2500 పిల్లలకు చూపించాలని నిర్ణయించుకున్నాం. జైశ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్ని చోట్ల ప్రతిధ్వనించాలి' అని మంచు మనోజ్, భూమా మౌనిక అన్నారు. (ఇదీ చదవండి: కావాలనే చేస్తుందా?.. మరో టాప్ హీరోకు షాకిచ్చిన కంగనా రనౌత్?) -
తెలుగులోనూ రైల్వే టికెట్ బుకింగ్
సాక్షి, విశాఖపట్నం: జనరల్ టికెట్ కోసం ఆదరాబాదరాగా రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. చాంతాడంత పొడవు ఉండే క్యూలైన్లలో నిలబడి.. ఈలోపు తాము ఎక్కాల్సిన రైలు వెళ్లిపోతుందేమోనని ఆదుర్దా పడేవారే ఎక్కువ. ఇలా ఇబ్బందులు పడే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను తీసుకొచ్చి న సంగతి తెలిసిందే. యూటీఎస్ విధానంలో యాప్, వెబ్సైట్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇంగ్లిష్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రాంతీయ భాషలకు కూడా రైల్వే శాఖ విస్తరించింది. దీంతో తెలుగు సహా వివిధ ప్రాంతీయ భాషల్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాధారణ (జనరల్) రైలు టికెట్లను దిగువ శ్రేణి ప్రయాణికులు ఎక్కువగా తీసుకుంటారని.. వీరి కోసం ప్రాంతీయ భాషల్లో యాప్‌ని తీసుకొస్తే వినియోగం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి శ్రమ లేకుండా యాప్ నుంచే.. యూటీఎస్ యాప్ ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మొబైల్ ఫోన్ నుంచే జనరల్ టికెట్ పొందొచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇంగ్లిష్ మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామీణులు, పెద్దగా చదువుకోనివారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సులభంగా యాప్ వినియోగించేలా ప్రాంతీయ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, కన్నడం, మళయాలం, మరాఠీ, ఒడియా, తమిళ భాషల్లోనూ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా జనరల్ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్ కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్ సైతం చేసుకోవచ్చు. యూటీఎస్ యాప్‌లో ప్రాంతీయ భాషల అప్డేట్ వెర్షన్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. హార్డ్ కాపీ, పేపర్‌లెస్ టికెట్.. రెండు ఆప్షన్లు ఉన్నాయి. యూటీఎస్ యాప్ ఎన్ని భాషల్లో: తెలుగు, ఇంగ్లిష్, కన్నడం, మలయాళం, హిందీ, తమిళం, ఒడియా, మరాఠీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న రైల్వేస్టేషన్లు: 9,120 డౌన్లోడ్ చేసుకున్నవారు: 10 మిలియన్లకు పైగా యాప్ ద్వారా రోజుకు బుక్ అవుతున్న టికెట్లు: 2.34 లక్షలు రోజూ వినియోగిస్తున్న ప్రయాణికులు: 14.21 లక్షల మంది స్టేషన్‌కు 5 కి.మీ. పరిధిలో.. మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా యూటీఎస్ యాప్ పనిచేస్తోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. రైల్వేస్టేషన్ ఆవరణకు 30 మీటర్ల నుంచి 5 కి.మీ. పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాప్ ద్వారా 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజన్ టికెట్లను తీసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టికెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. – అనూప్‌కుమార్ సత్పతి, డీఆర్ఎం, వాల్తేరు -
ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటీ పోటీని తట్టుకునేలా, సంస్థను లాభాలబాట పట్టించేలా ఆర్టీసీ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అనువైన విధానాల కోసం వెతుకుతోంది. అందులో భాగంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. గురువారం ఇక్కడి బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్విసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్‌ను త్వరలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్విస్‌లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. సర్విస్ ప్రారంభమయ్యే గంటముందు వరకు ఆన్లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్నరోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తుచేశారు. సంస్థ అధికారిక వెబ్సైట్ www. tsrtconline. in లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు గోవర్దన్, సజ్జనార్ తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ అంటే... ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణచార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్ ధర ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్డ్ డేటా అనాలసిస్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మార్కెట్లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి. ప్రైవేట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చు. ఈ విధానంవల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణచార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది. -
గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
మీ రైల్వే స్టేషన్లో గమనిస్తే ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్ కౌంటర్ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవ.. కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ తీసుకొచ్చింది. యూటీఎస్ యాప్ ఇన్స్టలేషన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ పని చేస్తుంది. సబర్బన్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు తమ పరిధిలోని రైల్వే స్టేషన్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే.. ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ. యూటీఎస్ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి. ►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి. ►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి. ►అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది. ►ప్లాట్ఫారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి. ►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్ లెస్ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు. ►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్ టిక్కెట్‌ను బుక్ చేయలేరు. ►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్.. యూపీఐ చెల్లింపులపై లిమిట్! -
వామ్మో.. విడుదలకు ముందే అవతార్-2 రికార్డుల మోత!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండియాలో ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్లలో 15,000పైగా ప్రీమియం ఫార్మెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ‘అవతార్-2 ’ విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి స్పందన రావడం సంతోషంగా ఉందని పీవీఆర్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందాని అన్నారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము' అని అన్నారు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా ..‘అవతార్‌కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి’అని అన్నారు. -
అవతార్-2 టికెట్స్.. ధర వింటే సినిమా కనపడుద్ది..!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుక్సింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్లపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్) ఆ స్క్రీన్ల టికెట్ ధరలు చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్ 3డీ), దేశ రాజధాని దిల్లీలో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్ రూ.750, ఇండోర్ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ ధర రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), విశాఖ రూ.210 (3డీ ఫార్మాట్) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. త్వరలోనే సాధారణ థియేటర్స్‌లోనూ టికెట్ ధరలు అందుబాటులో ఉంచనున్నారు. అవతార్-2 లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు నటించారు. -
UTS App: రైలు ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. . రైలు బయలుదేరే సమయం దాకా క్యూలు తరగవు.. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. గతంలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణమంటే కచ్చితంగా స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ కోచ్‌లలో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సబర్బన్ స్టేషన్లకు సంబంధించి గతంలో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల గరిష్ట పరిధిలో యాప్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్లకు పెంచారు. అలాగే.. నాన్ సబర్బన్ స్టేషన్ల గరిష్ట పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు విస్తరించారు. స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి ఈ పరిధి లెక్కలోకి వస్తుంది. ఈ వెసులుబాటు లేక గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్లు. అన్ రిజర్వ్డ్ బోగీలో సీట్ల రిజర్వేషన్ ఉండదు. కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది తెలిసే ఉంటుంది. అలా ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ వివరాలు సంబంధిత ఫోన్‌కు మెసేజ్ రూపంలో అందుతాయి. రైళ్లలో టీటీఈలకు ఆ వివరాలు చూపితే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ రకాల వాలెట్లు.. ఆర్–వాలెట్, పేటీఎం,మోబిక్విక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. ఇదీ చదవండి: ఛలాన్లు కట్టకుంటే ‘మోత’ మోగుద్ది -
కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రీఫండ్ కోసం ఇక రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ రీఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్లైన్ ద్వారా రీఫండ్ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్ టికెట్లకు సైతం ఆన్లైన్ రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. అరగంట ముందు చాలు... ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ బుక్ చేసుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్లైన్ రీఫండ్ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 శాతం కౌంటర్ టికెట్లు ► ప్రతి ట్రైన్లో 30 శాతం వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్ లిస్టు జాబితా పెరిగిపోతుంది. ► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు. చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు -
‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్ -
‘21 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోండి’.. ఉద్యోగులకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: రైతులకు ఎరువులు భారీ స్థాయిలో రాయితీలకు ఇస్తుండటంతో ప్రభుత్వంపై పడిన సబ్సిడీ భారం, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు తదితరాల పథకాల ఆర్థికభారం నుంచి కాస్తంత ఉపశమనం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ నిమిత్తం చేసే విమాన, రైలు ప్రయాణాల్లో ఖర్చులు తగ్గించుకోవాలంది. ఆ సూచనలు.. ► అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి అధిక ధర చెల్లించేకన్నా 21 రోజుల ముందే తక్కువ ధరల శ్రేణి టికెట్లు బుక్ చేసుకోండి. ► అనవసరంగా టికెట్లు క్యాన్సిల్ చేయొద్దు. ► వేర్వేరు టైమ్–స్లాట్లుంటేనే, తప్పనిసరి అయితేనే రెండు టికెట్లు బుక్ చేయాలి. లేదంటే ఒక ప్రయాణానికి ఒక్కటే తీసుకోవాలి. ► విమాన టికెట్లను 72 గంటల్లోపు బుక్‌చేసినా, 24 గంటల్లోపు క్యాన్సిల్ చేసినా అందుకు కారణం తెలుపుతూ సంబంధిత విభాగానికి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ► తక్కువ క్లాస్ టికెట్‌తోనే ప్రయాణించండి. నాన్–స్టాప్ ఫ్లైట్ అయితే మరీ మంచిది. చదవండి👇 ఆర్మీలో అగ్నివీర్ తొలి నోటిఫికేషన్ విడుదల వందల సంఖ్యలో రైళ్లు రద్దు..రైళ్ల వివరాలు ఇవే.. -
ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్‌నే కొనేశారు!
Jr NTR Fans Buy Entire Theatre For RRR Movie: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ల మానియే కనిపిస్తుంది. మార్చి 11న రాధేశ్యామ్, మార్చి 25న ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ల బుకింగ్ ప్రారంభమై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈమూవీ కోసం ఇటూ మెగా ఫ్యాన్స్ అటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బజ్ నెలకొంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకా ఆర్ఆర్ఆర్ విడుదలకు రెండు వారాలపైనే సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే ఈ మూవీ టికెట్స్ ఓ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఏకంగా థియేటర్ మొత్తాన్నే కొన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది అమెరికాలో చోటుచేసుకోవడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఫ్లోరిడాలోని ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ చూసేందుకు ఏకంగా ఓ థియేటర్ అంతా బుక్ చేసుకున్నారట. చదవండి: జ్యోతిష్యాన్ని నమ్మను కానీ.. బాహుబలి విజయం తర్వాత ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్సెల్టౌన్లో సాయంత్రం 6 గంటల షో కోసం అన్ని ప్రీమియర్ టికెట్స్ బుక్ చేసుకొని ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అసలే భారీ సినిమా, పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒకే థియేటర్లో కూర్చొని ప్రీమియర్ చూస్తుంటే ఇక ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాగా దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో తారక్ కొమురంభీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కాగా.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
ఫ్యాన్స్ ముసుగులో యథేచ్చగా బ్లాక్ మార్కెట్!!
నరసరావుపేట టౌన్: సగటు మానవుడి వినోదం సినిమా. అభిమాన హిరో సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటాడు. కుటుంబ సమేతంగా వెళ్లి చూద్దామనుకుంటాడు. కాని బెనిఫిట్ షో, అదనపు షోల పేరుతో ధరల దోపిడీ చేస్తుంటారు. సినిమా చూసే పరిస్థితి ఉండేది కాదు. ఇదీ ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ధరలకు కళ్లేం వేశారు. అయితే థియేటర్ నిర్వాహకులు శుక్రవారం అక్రమాలకు తెరదీశారు. థియేటర్ల వద్ద యథేచ్ఛగా బహిరంగా టికెట్లు అమ్మిస్తూ సొమ్ము చోటుచేసుకున్నారు. మూడు బ్లాక్ టికెట్లు.. ఆరు షోలు శుక్రవారం విడుదలైన యువ హిరో సినిమా నాలుగు షోలకు బదులు ఐదు షోలు వేశారు. టికెట్లన్ని ఆన్లైన్లో విక్రయించాల్సి ఉండగా టికెట్ రూ.300 నుంచి రూ.500 వరకు బ్లాక్‌లో విక్రయించారు. నిబంధలనకు విరుద్ధంగా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమాలు ప్రదర్శించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. థియేటర్లలో తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు టికెట్లు, తినుబండారాలు విక్రయించినట్టు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –రమణానాయక్, తహసీల్దార్ ఫ్యాన్స్ ముసుగులో బ్లాక్ మార్కెట్ థియేటర్ల వద్ద యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. నిర్వాహకులను ప్రశ్నిస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు విక్రయించినట్టుగా చెబుతున్నారు. అధిక ధరలపై అధికారులు దృష్టి సారించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలి. –షేక్ ఫారూక్, ప్రేక్షకుడు జేబుకు చిల్లు ఫ్యామిలీతో సినిమాకు వెళితే రూ.2వేలు ఖర్చు అవుతోంది. అధిక ధరలకు టికెట్ కొనాల్సి వస్తుంది. దీంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు సినిమాకు వెళ్లాలి అంటేనే భయం వేస్తోంది. –షేక్‌గౌస్, ప్రేక్షకుడు చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
పేటీఎం బంపర్ ఆఫర్..! విమాన టికెట్లపై 50 శాతం వరకు తగ్గింపు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్‌పై ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది. పేటీఎం యాప్‌తో విమాన టికెట్ల బుకింగ్‌పై 15 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సాయుధ దళాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు, సీనియర్ సీటిజన్లకు అందుబాటులో ఉండనుంది. వీటిపై వర్తిస్తాయి..! పేటీఎం అందిస్తోన్న ఆఫర్స్ ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్, ఎయిర్ఎసియా సర్వీసులపై తగ్గింపు ధరలు వర్తిస్తాయి. కాలేజ్ విద్యార్థులు 10 కిలోల వరకు ఎక్స్ట్రా బ్యాగేజ్‌ను తీసుకునే సౌకర్యాన్ని కూడా పొందవచ్చును. చదవండి: పేటీఎం ఢమాల్..! రూ.38 వేల కోట్ల లాస్ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్..! ఈ సందర్భంగా పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.... “ ట్రావెల్ టికెటింగ్ మాకు చాలా ముఖ్యమైన సెగ్మెంట్. ట్రావెలింగ్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్లను రిజర్వ్ చేయడానికి సులభతరమైన అనుభూతిని వారికి అందిస్తున్నామని అన్నారు. పేటీఎం ప్రముఖ మేజర్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. కస్టమర్లు ఫ్లైట్ టికెట్లను, ఇంటర్సిటీ బస్సులను, రైల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి పేటీఎం వీలు కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితం విమాన ప్రయాణాలపై ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పేటీఎం ప్రారంభించింది. చదవండి: Paytm: 50 కోట్ల మంది టార్గెట్ -
RED RAIL: టిక్కెట్ల బుకింగ్ ఇప్పుడు ఇంకా ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ తాజాగా రెడ్రైల్పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. -
వారం రోజుల పాటు.. ఈ టైంలో రైల్వే రిజర్వేషన్లు బంద్! కారణమిదే
Indian Railway Big Update: ప్రయాణం చేయాలనుకునే వారికి ముఖ్య సూచన చేసింది రైల్వేశాఖ. మెయింటెన్స్‌లో భాగంగా వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదని పేర్కొంది. టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్ఆర్ ఎంక్వైరీ, టిక్కెట్ రద్దు తదితర సేవలు కూడా నిలిచిపోనున్నాయి. స్పెషల్ 2020 మార్చిల లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. సుమారు ఆర్నెళ్ల తర్వాత క్రమంగా ప్రత్యేక రైళ్ల పేరుతో కొన్ని రైళ్లను తిరిగి ప్రారంభించారు. ప్యాసింజర్ , లోకల్ రైళ్లను కూడా ప్రత్యేక రైళ్లుగానే నడుపుతూ వస్తున్నారు. దీంతో ఈ ప్రత్యేక రైళ్ల నంబర్లు మారాయి. అదే విధంగా హాల్టింగ్ స్టేషన్లలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఏడాది పాటు ఇదే విధానం కొనసాగింది. ఈ ప్రత్యేక నంబరు, స్టేషన్లు, ఛార్జీలకు తగ్గట్టుగానే రిజర్వేషన్ ప్రక్రియ నడిచింది. రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటం కరోనా ముప్పు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లకు పులిస్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రత్యేకం పేరుతో తిరుగుతున్న రైళ్లను తిరిగి రెగ్యులర్ రైళ్లుగా మారుస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి ఆశ్వినీ వైభవ్ ప్రకటించారు. అందుగు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల నంబర్లు, స్టేషన్ల హాల్టింగ్ , ఛార్జీల విషయంలో మార్పులు చేయాలి. దీనికి తగ్గట్టుగా టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పనిలో ఉంది రైల్వేశాఖ. సాఫ్ట్వేర్ అప్డేట్ టిక్కెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పనులను నవంబరు 14 నుంచి 22వ తేదీల మధ్యన చేపట్టాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన తేదీల్లో ప్రతీ రోజు రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:30 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు రిజర్వేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిలిపేస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకోవడం, రద్దు చేయడం, పీఎన్ఆర్ స్టేటస్, కరెంట్ బుకింగ్ స్టేటస్, ట్రైన్ రియల్‌టైం తదితర సేవలు నిలిచిపోనున్నాయి. ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 139 నంబరుకు ఫోన్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఇచ్చారు. The activity will be performed starting from the intervening night of 14 and 15-November to the night of 20 and 21-November starting at 23:30 hrs and ending at 0530 hrs. During this period, no PRS Services will be available. Read: https://t.co/8MPZw1cGXx — PIB India (@PIB_India) November 14, 2021 చదవండి: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. ఇక నో ‘ కొవిడ్ స్పెషల్’ రైళ్లు, టికెట్ ధరలు సైతం తగ్గింపు! -
వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్ నంబరు, ఆధార్ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్–టైమ్ పాస్‌వర్డ్‌తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించనక్కర్లేదు.