IRCTC E-Ticket & I-Ticket: ఆధునిక కాలంలో ట్రైన్ జర్నీ సర్వ సాధారణమయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే రైలు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవి ఈ-టికెట్ & ఐ-టికెట్. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ-టికెట్ (E-Ticket)
ఐఆర్‌సీటీసీ అందించే ఎలక్ట్రానిక్ టికెట్‌నే 'ఈ-టికెట్' అంటారు. ఈ టికెట్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందుబాటులో ఉంటే ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటెడ్ రూపంలో లభించదు. ఈ టికెట్‌తో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సీట్ నెంబర్, బెర్త్ వంటి వాటిని మీరే సెలక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..)
ఐ-టికెట్ (I-Ticket)
ఐ-టికెట్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్ మీరు నేరుగా ఏదైనా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనికి ప్రత్యేక చార్జీలు ఉంటాయి. దీన్ని ప్రయాణానికి మూడు రోజులు ముందుగా అయినా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి కనీసం 48 గంటలు పడుతుంది. దీనిని క్యాన్సిల్ చేసుకోవాలనుంటే కూడా మీరు రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment