train tickets
-
క్యూ ఆర్ స్కాన్‌తో సాధారణ రైలు టికెట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో విజయవాడ డివిజన్లో జనరల్ బుకింగ్ కౌంటర్ (అన్ రిజర్వ్డ్)లో క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్ బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, పిల్లలు/పెద్దల సంఖ్య, చార్జీలు వివరాలను బుకింగ్ క్లర్క్ నమోదు చేయగానే కౌంటర్ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని అక్కడ కనిపించే క్యూ ఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో టికెట్ జనరేట్ అవుతుందన్నారు. త్వరలోనే ఈ సౌకర్యాన్ని డివిజన్లోని అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. -
ఐఆర్సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి తెలుసా?
IRCTC E-Ticket & I-Ticket: ఆధునిక కాలంలో ట్రైన్ జర్నీ సర్వ సాధారణమయిపోయింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు ముందుగానే రైలు రిజర్వేషన్ చేసుకుంటారు. ఇలా ముందుగానే రిజర్వ్ చేసుకోవాలనుకునే వారు రెండు విధాలుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవి ఈ-టికెట్ & ఐ-టికెట్. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ-టికెట్ (E-Ticket) ఐఆర్సీటీసీ అందించే ఎలక్ట్రానిక్ టికెట్నే 'ఈ-టికెట్' అంటారు. ఈ టికెట్ ద్వారా ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్స్ అందుబాటులో ఉంటే ప్రయాణం చేసే ముందు రోజు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ సదుపాయం ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటెడ్ రూపంలో లభించదు. ఈ టికెట్‌తో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు కార్డుని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సీట్ నెంబర్, బెర్త్ వంటి వాటిని మీరే సెలక్ట్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 10 వేల జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు కోట్ల సామ్రాజ్యం - ఒక టీచర్ కొడుకు సక్సెస్ స్టోరీ..) ఐ-టికెట్ (I-Ticket) ఐ-టికెట్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ప్రింటెడ్ రూపంలో ఉంటుంది. ఈ టికెట్ మీరు నేరుగా ఏదైనా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు కొరియర్ ద్వారా ఇంటికి వస్తుంది. దీనికి ప్రత్యేక చార్జీలు ఉంటాయి. దీన్ని ప్రయాణానికి మూడు రోజులు ముందుగా అయినా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డెలివరీ కావడానికి కనీసం 48 గంటలు పడుతుంది. దీనిని క్యాన్సిల్ చేసుకోవాలనుంటే కూడా మీరు రైల్వే స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. -
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం క్యాషీ (CASHe)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలలలో ఈఎంఐల ద్వారా తర్వాత చెల్లించవచ్చు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం పేటీఎంలో పోస్ట్‌పెయిడ్ సదుపాయం ఉండటం వల్ల రైల్వే టికెటింగ్ సర్వీసుల్లో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ ను పేటీఎం యూజర్లు వినియోగించుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటీవలి కాలంలో పేటీఎం తమ యూజర్ల కోసం టికెట్ల బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ లలో బై నౌ పే లేటర్ సదుపాయాన్ని విరివిగా కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60 వేల వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది. టికెట్ బుకింగ్ ఇలా.. ఐఆర్సీటీసీ అధికారిక పోర్టల్ లేదా మొబైల్లో ఐఆర్సీటీసీ యాప్‌లో లాగిన్ అవ్వాలి. మీ వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణ తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత చెల్లింపు విభాగానికి వెళ్లి 'పే లేటర్'పై క్లిక్ చేయండి. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ని ఎంచుకుని, మీ పేటీఎం వివరాలతో లాగిన్ చేయండి. తర్వాత OTPని నమోదు చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! -
పేటీఎంతో ట్రైన్ టికెట్స్.. ఇంకా చాలా ఫీచర్స్
-
మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిందా? పేటీఎంలో చెక్ చేయండిలా!
దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పేటీఎం ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్, బుకింగ్ మూవీ టికెట్స్, పలు రకాలైన సేవల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే ఫీచర్‌ను పేటీఎం తన యాప్‌లో జత చేసింది. ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో ప్రయాణికులకు ఇకపై సులభం తత్కాల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వీటితో పాటు పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్, క్యాన్సిలేషన్‌పై టికెట్లపై ఇన్స్టంట్ రీఫండ్, ఫ్లాట్ ఫామ్ నెంబర్‌ను ట్రాక్ చేయడంతో పాటు ఐటీఆర్సీటీసీ బుకింగ్స్ సంబంధించిన అన్నీరకాల సర్వీసుల్ని యూజర్లు వినియోగించుకోవచ్చని పేటీఎం ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ కన్ఫామ్ లేదా అని తెలిపేలా ప్రిడిక్షన్స్ సైతం చూపిస్తుంది. అదే సమయంలో మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతానికి అదే సమయానికి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. ఉంటే సదరు ట్రైన్లలో సీట్లను కేటాయిస్తామని పేటీఎం హామీ ఇచ్చింది. ఐఆర్సీటీసీ ప్రయాణికులు సైతం పేటీఎం యాప్‌లో సమీప రైల్వే స్టేషన్లను, ట్రైన్ టికెట్లపై పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ సమయపాలనలో అంతరాయం ఉంటే ముందే చెప్పేస్తుంది. 24*7 పేటీఎం యాప్‌లో 10 లాంగ్వేజ్‌లలో సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు అనుగుణంగా వారికి కావాల్సిన విధంగా టికెట్ ధరల్ని అందిస్తుంది. పేటీఎంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? 👉యాప్ లో పేటీఎంలోకి లాగిన్ అవ్వండి లేదా paytm.com/train-tickets సందర్శించండి 👉మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి 👉ఆ తర్వాత జర్నీ డేట్ ఎంటర్ చేసి ఏయే ట్రైన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీ ట్రైన్, అందులో సీటు సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకొని మీకు కావాల్సిన సీటు, తరగతి, తేదీని ఎంపిక చేసుకోవాలి. 👉టికెట్లు బుక్ చేసుకోవడానికి బుక్ బటన్ మీద క్లిక్ చేసి, మీ ఐఆర్సీటీసీ లాగిన్ ఐడిని ఎంటర్ చేయండి. 👉మీకు లాగిన్ ఐడీ లేకపోతే ‘సైన్ అప్ విత్ ఐఆర్సీటీసీ’ ఆప్షన్‌పై ట్యాప్ చేయడం లేదా, ఐఆర్సీటీసీ ఫర్ గెట్ పాస్వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఐఆర్సీటీసీ ఐడీని రీసెట్ చేసుకోవచ్చు. 👉తరువాత, ట్రైన్ వివరాల్ని జత చేసి ‘బుక్’ ఆప్షన్మీద ట్యాప్ చేయండి. 👉ఇప్పుడు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు చెల్లించండి. 👉మీ బుకింగ్ పూర్తి చేయడానికి ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది. 👉ధృవీకరించడానికి పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి 👉టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పేటీఎం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి మీ టికెట్ల ఇమెయిల్ కూడా పంపుతుంది. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా?
హైదరాబాద్‌లో ఉంటున్న రాము - సోము ఇద్దరు రూమ్ మెట్స్. రేపు ఉదయం 10 గంటల కల్లా ఆఫీస్‌కు రావాలంటూ ఢిల్లీ నుంచి ప్రముఖ టెక్ కంపెనీ నుంచి రాముకి ఇంటర్వ్యూ కాల్. అదే సమయంలో సోముకు రేపు ఉదయం పెళ్లి చూపులు ఉన్నాయంటూ బెంగళూరులో ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి పిలుపు. వెంటనే ఆ స్నేహితులిద్దరూ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో నానా హైరానా పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకొని ఆలోచిస్తుండగా.. మీకు కావాల్సిన జర్నీ టికెట్స్‌ను ఉచితంగా మేం అందిస్తామంటూ ఓ సంస్థ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్‌తో ఎగిరి గంతేశారు. ఇంతకీ ఆ వాట్సాప్ మెసేజ్ పంపింది ఎవరు? ఉచితంగా ఫ్లైట్ టికెట్లు అందించే ఆ సంస్థ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం? అత్యవసర సమయాల్లో ట్రైన్ టికెట్ బెర్తు కన్ఫం కాని ప్రయాణికుల కోసం ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్‌మ్యాన్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో కన్ఫామైన ట్రైన్ టికెట్లను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లుగా ఒకవేళ ట్రైన్ టికెట్ కన్ఫం కానట్లయితే ప్రయాణీకులకు ఆయా రూట్లలో విమాన సదుపాయం ఉంటే ఫ్రీగా ఫ్లైట్ టికెట్లను అందిస్తామని ప్రకటించింది. ట్రిప్ అస్యూరెన్స్ ట్రైన్ మ్యాన్ యాప్ 'ట్రిప్ అస్యూరెన్స్' అనే కొత్త ఫీచర్‌ను డెవలప్ చేసింది. కొత్త ఫీచర్ రైల్వే ప్రయాణీకులకు, సీట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే..వారికి టికెట్లను కన్ఫం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ ప్రయాణీకుడు కన్ఫం టికెట్లను పొందనట్లయితే, యాప్ టికెట్ కన్ఫం అయ్యే అవకాశాలను ప్రిడిక్షన్ మీటర్లో చూపుతుంది. చార్ట్ తయారీకి ముందు టికెట్లు కన్ఫం కాకపోతే..ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్ రూట్లు, టికెట్ సదుపాయాల్ని గుర్తించి బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది. ఛార్జీ రూ.1 మాత్రమే? ప్రయాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే, యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుము రూ.1 వసూలు చేస్తుంది. ఒకవేళ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంటే, టికెట్ తరగతిని బట్టి కంపెనీ నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తుంది. ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫం అయినట్లయితే ఆ రుసుము కస్టమర్లకు రీఫండ్ చేయబడుతుంది. అయితే, టికెట్ బుక్ కాకపోతే ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్ టికెట్ బుక్‌చేస్తామని ట్రైన్ మ్యాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వినీత్ చిరానియా అన్నారు. కాగా, ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని ఐఆర్‌సీటీ రాజధాని రైళ్లలో, దాదాపు 130 ఇతర రైళ్లలో సేవల్ని అందిస్తోంది. చదవండి👉 మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! -
కాశీకి పోలేము రామాహరి!
సాక్షి, హైదరాబాద్: జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లిరావాలని చాలా మంది పెద్దల కోరిక. అంతదూరం ప్రయాణించాల్సి రావడంతో.. కాశీకి వెళితే కాటికి వెళ్లినట్టే అన్న సామెత కూడా పుట్టింది. ఇప్పుడు ఇంతగా ప్రయాణ సౌకర్యాలు పెరిగినా మన రాష్ట్రవాసులకు మాత్రం కాశీ యాత్ర కష్టాలు మాత్రం తప్పడం లేదు. అంత దూరం ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించలేక, విమాన ప్రయాణ ఖర్చులు భరించలేక.. రైళ్లను ఆశ్రయించే భక్తులు తిప్పలు పడుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ కోసం బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్టే ఉంటూ.. సగం మందికి కూడా సీట్లు మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. హైదరాబాద్ నుంచి రోజూ ఒక్క రైలు మాత్రమే ఉండటం దీనికి కారణం. అంతేకాదు కాశీ వెళ్లే భక్తులతోపాటు ఉత్తరాదికి వెళ్లే ఇతర ప్రయాణికులూ ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. దీనితో భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకుని మళ్లీ టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. డిమాండ్ ఉన్నా రైలు లేదు: కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగు వారే ఎక్కువ. నిత్యం రెండు వేల మంది వరకు కాశీకి వెళతారని ఒక అంచనా అందులో రైలు ద్వారా వెళ్లేవారు వెయ్యి మందికిపైగా ఉండగా.. మిగతా వారు రోడ్డు మార్గంలో, అతికొద్ది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. బిహార్ నుంచి వచ్చి, తిరిగి వెళ్లే కూలీలకూ ఈ రైలే దిక్కు. అయితే ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్టు ఎక్కువగా ఉన్నప్పుడు రైల్వే ఆయా మార్గాల్లో క్లోన్ రైళ్లను నడిపేది. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో మరో రైలును అదనంగా నడిపేది. దానితో కొంత వరకు వెయిటింగ్ లిస్టు ప్రయా ణికులకు అవకాశం దక్కేది. ఇలా సికింద్రాబాద్–దానాపూర్ మధ్య ఓ క్లోన్ రైలును నడిపేవారు. కానీ కరోనా ఆంక్షల సమయంలో నిలిపివేసిన ఆ రైలును మళ్లీ పునరుద్ధరించలేదు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం స్వయంగా రైల్వే బోర్డును కోరినా స్పందన రాలేదు. రైల్వే స్పందించి అదనపు రైలు వేయాలని, లేదా క్లోన్ రైలు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. -
సంక్రాంతికి ఊరెళ్లేదెలా!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ సందడే వేరు. ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో స్థిరపడిన వారు సైతం సంక్రాంతికి సొంతూరికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఈ పెద్ద పండుగకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా ఇప్పుడే రైళ్లలో రిజర్వేషన్లు భర్తీ కావడంతో సంక్రాంతికి ఊరెళ్లేదెలా అంటూ అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట: సంక్రాంతి పండుగకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. రైళ్లలో రిజర్వేషన్లు అప్పుడే నిండిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు. తెలంగాణ, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాలలో మన రాష్ట్రానికి చెందిన అనేక కుటుంబాల వారు స్థిరపడిపోయారు. వారు ఏడాదిలో ఒక్కసారి సంక్రాంతికి సొంతూళ్లకు రావాలనుకుంటారు. కానీ పండుగ ఇంకా నాలుగు నెలలు ఉండగానే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క పోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందురోజు ఓపెన్ అయ్యే తత్కాల్ మీదే ఆధారపడి ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 12, 13 తేదీలలో రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కమలాపురం, నందలూరు తదితర ప్రాంతాలకు వేలాది కుటుంబాలు సంక్రాంతి పండుగకు వచ్చేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వాసులు తిరిగి వెళ్లేందుకు కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నారు. కొంతమందికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. మరికొందరికి బెర్త్ దొరకలేని పరిస్థితులున్నాయి. ఇక చివరిగా రైల్వేశాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేకరైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశతో పలువురు ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు రైలులో వెళ్లాలనుకునే వారికి టికెట్లు దొరకక పోవడంతో ఇక ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. అయితే పండుగ సీజన్లో ఆర్టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ సాధారణం కంటే అధిక చార్జీలు వసూలు చేస్తాయి. దీంతో తక్కువ చార్జీతో రైలులో వెళ్లాలనుకునే వారికి కొంత నిరాశ అనే చెప్పుకోవాలి. డే ట్రైన్ రన్ చేయాలనే డిమాండ్ ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా అన్‌రిజర్వుడు డే ట్రైన్‌ను తెలంగాణకు నడిపించాలనే డిమాండ్‌ను ప్రజాప్రతినిధులు రైల్వేబోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును విజయవాడ మీదుగా నడిపిస్తున్నారు. ఇదే విధంగా రెగ్యులర్‌గా జిల్లా మీదుగా కూడా రైళ్లను నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో కొద్దివరకైనా సంకాంత్రి రద్దీని తట్టుకునేందుకు వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నుంచి హాల్టింగ్సమస్యలు కరోనా ఫస్ట్‌వేవ్ నుంచి అనేక రైళ్లను రద్దు చేశారు. తిరిగి పునరుద్ధరించిన తర్వాత పలు రైళ్లకు తరతరాలుగా కొనసాగుతున్న హాల్టింగ్స్‌ను ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే వారు సొంతూరికి చేరుకునే విషయంలో ఇక్కట్లకు గురికాక తప్పదు. బెర్త్ దొరకకపోయినా.. ఒక్కో రైలులో 500కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. కొన్ని రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్‌కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ఏదోలా ప్రయాణించేద్దామనుకునే వారికి ఆ అవకాశం కూడా లేకుండా వెయిటింగ్‌లిస్ట్ జాబితా చాంతాండంత ఉంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు మూడురైళ్లు తెలంగాణ నుంచి రెగ్యులర్‌గా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు మూడు రైళ్లే నడుస్తున్నాయి. అవి చితూర్తు – కాచిగూడ, నిజామాబాద్ – తిరుపతి, చెన్నై ఎగ్మోర్ టు సికింద్రాబాద్. వీటికి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సంక్రాంతి పండుగ సీజన్లో ఈ రైలులో బెర్త్ దొరికే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. సంక్రాంతికి రావాలంటే.. సంకాంత్రికి రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. రైలు ప్రయాణం చేయాలంటే కష్టతరమవుతోంది. కుటుంబ సభ్యులందరం రావాలంటే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదృష్టం ఉంటే బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే వెయిటింగ్ లిస్ట్. వైఎస్సార్, అన్నమయ్య జిల్లా మీదుగా నడిచే రైళ్లు యాత్రికులకే సరిపోవడంలేదు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడిపించాలి. –చింతల రాంప్రసాద్, బుల్లితెరనటుడు, హైదరాబాద్ వ్యయప్రయాసలు తప్పవు సంక్రాంతి పండుగకు రావాలన్నా తిరిగి వెళ్లాలన్నా వ్యయప్రయాసలకు గురికాక తప్పదు. రైలులో రిజర్వేషన్ ఉంటే తప్పవెళ్లలేం. జనరల్ బోగీలో ప్రయాణం ఇక చెప్పనకర్లేదు. గతంలో ఉన్న స్టాపింగ్స్ ఇప్పుడు లేవు. అదొక సమస్య. విమాన ప్రయాణం సులభంగా ఉందేమోకానీ రైలు ప్రయాణమే గగనంగా ఉంది. –పరిటాల ప్రసాద్, స్టోర్మేనేజర్, నాగార్జున కన్స్ట్రక్షన్,హైదరాబాద్ -
కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు టికెట్ రీఫండ్ కోసం ఇక రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్ రీఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొన్న ప్రయాణికులకు మాత్రమే తిరిగి ఆన్లైన్ ద్వారా రీఫండ్ చేసుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల ఆ సదుపాయాన్ని కౌంటర్ టికెట్లకు సైతం విస్తరించారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టికెట్ తీసుకొన్నా తమ సీటు నిర్ధారణ కాక వెయిటింగ్ లిస్టులో ఉంటే ప్రయాణికులు రిజర్వేషన్ కార్యాలయాల్లోనే రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవలసి ఉండేది. కానీ 15 శాతం మంది అలా వెళ్లలేకపోతున్నట్లు అంచనా. సకాలంలో వెళ్లలేక చాలామంది టికెట్ డబ్బును నష్టపోవలసి వస్తోంది. దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కౌంటర్ టికెట్లకు సైతం ఆన్లైన్ రీఫండ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచి్చంది. అరగంట ముందు చాలు... ఐఆర్సీటీసీ ద్వారా రిజర్వేషన్ బుక్ చేసుకొనే వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు తమ ప్రయాణం నిర్ధారణ కాని పక్షంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు వరకు కూడా టికెట్లు రద్దు చేసుకోవచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గా వారి ఖాతాలో చేరిపోతాయి. కానీ కౌంటర్ టికెట్లకు ఆ అవకాశం లేదు. తాజా మార్పుతో కౌంటర్లో టికెట్లు తీసుకున్న వాళ్లూ ఆన్లైన్ రీఫండ్ చేసుకోవచ్చు. రైలు సమయానికి అరగంట ముందు కూడా రద్దు చేసుకోవచ్చు. కానీ టికెట్ డబ్బులు తీసుకొనేందుకు మాత్రం రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. ‘ఇది ప్రయాణికులకు ఎంతో ఊరట. రిజర్వేషన్ నిర్ధారణ అవుతుందని రైలు బయలుదేరే వరకూ ఎదురు చూసేవాళ్లు చివరి నిమిషంలో కౌంటర్లకు వెళ్లి టికెట్ రద్దు చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారికిది చక్కటి అవకాశం’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30 శాతం కౌంటర్ టికెట్లు ► ప్రతి ట్రైన్లో 30 శాతం వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇవ్వొచ్చు.18 నుంచి 24 బోగీలు ఉన్న రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల సంఖ్య మేరకు 300 వరకు వెయిటింగ్ లిస్టు టికెట్లను ఇస్తారు. కానీ చాలా సందర్భాల్లో 400 వరకూ వెయిటింగ్ లిస్టు జాబితా పెరిగిపోతుంది. ► 70 శాతం మంది ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 30 శాతం మంది మాత్రమే కౌంటర్ల వద్దకు వెళ్తున్నారు. చదవండి: నేతన్నల బీమాకు వీడిన చిక్కు -
రూ.20 కోసం 22 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం!
మనలో చాలామంది ఏ చిన్న సమస్య వచ్చిన కోర్టు మెట్లెక్కడానికి ఇష్టపడం. మనకు ఏదైనా పని అవ్వడమే ముఖ్యం. జేబు చమురు వదిలించుకుని మరీ పని జరిపించుకుంటాం గానీ. ఎందుకు డబ్బులివ్వాలి అనడగం. పోతే పోనీలే అని సర్దుకుపోతాం. ఇక్కడో వ్యక్తి అలా కాదు. టిక్కెట్ ధర కంటే అదనంగా రూ.20 ఎక్కువ తీసుకున్నాడంటూ కోర్టు మెట్లెక్కాడు. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి మరీ గెలిచాడు. ఏం జరిగిందంటే....మధురకు చెందిన ఉత్తర ప్రదేశ్ వ్యక్తి తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 1999 డిసెంబర్లో మొరాదాబాద్‌కు రెండు టిక్కెట్లను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ టిక్కెట్ ధర రూ.70 కాగా టిక్కెట్ గుమస్తా అతని దగ్గర నుంచి రూ.90లు వసూలు చేశాడు. చతుర్వేది గమస్తాకి రూ.100 ఇస్తే తనకు రూ.30లు తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. తీరా చూస్తే రూ. 10 చేతిలో పెట్టి అంతే వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. ఈ ఘటన డిసెంబర్ 25, 1999న చోటు చేసుకుంది. చతుర్వేది అతనిని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై స్టేషన్ మాస్టర్ని కూడా కలిశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన న్యాయం కోసం భారత రైల్వేకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడూ ఏం చేయాలో అతనికి తెలుసు. పైగా అతను లాయరు, న్యాయ పరిజ్ఞానం మీద అవగాహన కలిగిన వ్యక్తి కావడం చేత ఈ విషయమై కోర్టులో కేసు వేశారు. ఆయన ఈ కేసు విషయమై సుమారు 22 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఎట్టకేలకు కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తక్షణమే రైల్వే శాఖ రూ.15,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఒక నెలలోపు చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం పై 15 శాతం వడ్డీని అదనంగా చెల్లించమని భారత రైల్వేకి స్పష్టం చేసింది. ఈ పోరాటంలో చాలా కష్టాలు అనుభవించానని చతుర్వేది చెప్పారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కేసు వదిలేయమని చెప్పారని అన్నారు. ఒకానొక దశలో ఈ కేసును కొట్టేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నించారు. ఈ కేసులో వందకు పైగా విచారణలు జరిగిన తర్వాత న్యాయం గెలిచిందని తెలిపారు. అయితే ఈ పోరాటంలో తాను కోల్పోయిన సమయం, శక్తికి వెలకట్ట లేనివని అవేదనగా చెప్పారు. (చదవండి: మోసం చేసిన భర్తకు బుద్ధి వచ్చేలా... ఓ రేంజ్లో రివైంజ్ తీర్చుకున్న భార్య) -
మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!
Paytm Buy Now Pay Later: అరెరె!! చేతిలో డబ్బులు లేవే. అర్జెంట్‌కు ఊరెళ్లాలి. ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తున్నారే. ఇప్పుడెలా? ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుంటే. ఊరెళ్తున్నాం కదా..వచ్చిన తరువాత ఇవ్వొచ్చులే. ఇదిగో ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. చేతిలో డబ్బులు లేకపోయినా సరే పేటీఎం సాయంతో ఐఆర్సీటీసీలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ డబ్బుల్ని పేటీఎం నిర్దేశించిన నిర్ణీత గడువు లోపు చెల్లించవచ్చు. పేటీఎం సంస్థ ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో 'బై నౌవ్, పే లేటర్' (బీఎన్‌పీఎల్) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో పేటీఎంలో డబ్బులు లేకుండా వన్ క్లిక్‌తో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతేనా ట్రైన్ టికెట్ల నుంచి నిత్యవసర వస్తువుల వరకు.. నిత్యవసర వస్తువుల నుంచి షాపింగ్ వరకు డబ్బులు లేకుండానే మనకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయోచ్చు. ఇందుకోసం పేటీఎం ఎటువంటి వడ్డీ లేకుండా రూ.60వేల వరకు ఆఫర్ చేస్తుంది. ఇక ఖర్చు చేసిన మొత్తాన్ని 30రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం అందిస్తామని పేటీఎం పేమెంట్ సర్వీస్ సీఈఓ ప్రవీణ్ శర్మ తెలిపారు. ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేయాలంటే? ♦ ముందుగా ఐఆర్‌సీటీసీలోకి వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో మీరు వెళ్లాల్సిన జర్నీ వివరాల్ని ఎంటర్ చేసి పేలేటర్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి ♦ పేలేటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్లో పేటీఎం పోస్ట్ పోయిడ్ ఆప్షన్ కనిపిస్తుంది ♦ ఆ పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా పేటీఎం యాప్ ఓపెన్ అవుతుంది ♦ అందులో మీ వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ -
సరుకు రవాణా మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: రైల్వేలో టికెట్‌యేతర ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలని రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వే ఆదేశించారు. సరుకు రవాణాను మరింత పెంచేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా చేసే సంస్థలతో లాజిస్టిక్స్ కంపెనీలతో మెరుగైన అనుసంధానం ఉండేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సరుకు రవాణా విషయంలో దక్షిణ మధ్య రైల్వే ముందు వరుసలో ఉండాల్సి ఉందని, ఇందుకు సరుకు రవాణా మరింత పటిష్టం కావాల్సిన అవసరముందని చెప్పారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. సీసీటీవీ నెట్వర్క్, భద్రత, కిసాన్ రైళ్లు, దూద్ దురంతో అంశాలను కూలంకషంగా చర్చించారు. కరోనా సమయంలో రైల్వే ఆస్పత్రి అందించిన సేవలను పాటిల్ ప్రశంసించారు. -
ప్యాసింజర్ చార్జీల మోత
సాక్షి, హైదరాబాద్: ప్యాసింజర్ రైలు ప్రయాణం ఇక నుంచి సామాన్యులకు భారంగా మారనుంది. సోమవారం నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్ల వేగంతోపాటే చార్జీల పెంపునకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి 22 నుంచి నిలిపివేసిన ప్యాసింజర్ రైళ్లను 16 నెలల తర్వాత పునరుద్ధరించారు. సోమవారం నుంచి 82 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు కేవలం రూ.50 లోపు చార్జీలతో రాకపోకలు సాగించిన ప్రయాణికులు ఇక నుంచి ఈ రైళ్లలో ఎక్స్‌ప్రెస్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ప్యాసింజర్ చార్జీలపైన 30 నుంచి 40% వరకు భారం పడనుంది. ఈ రైళ్లన్నిం టినీ అన్ రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చడంతో ఆటోమేటిక్‌గా చార్జీలు సైతం పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌కు ముందు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో నడిచిన ఈ రైళ్లు సోమవారం నుంచి గంట కు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. రైళ్లవేగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన రూట్లలో పట్టాల సామర్థ్యాన్ని పెంచింది. అన్ని చోట్ల అన్రిజర్వ్డ్ టికెట్లు ఇప్పటివరకు రిజర్వేషన్ టికెట్ల తరహాలోనే జనరల్ సీట్లకు సైతం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవలసి వచ్చింది. ఇక నుంచి అన్ని రైల్వేస్టేషన్లలో కౌం టర్ల ద్వారా ప్రయాణికులు అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని ప్రయాణం చేయవచ్చు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్(ఏటీవీఎం) యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చు. -
ఐఆర్సీటీసీ ఎస్బీఐ రుపే కార్డ్ : ఆఫర్లు
సాక్షి, ముంబై : భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డు వచ్చేసింది. భారతీయ రైల్వే ప్రయాణికులకు గరిష్ట లాభంతోపాటు, రిటైల్, భోజన, వినోదాలపై ప్రయోజనాలు, ఇతర లావాదేవీల మినహాయింపుల అందించేలా ఐఆర్సీటీసీ ఎస్బిఐ కార్డును రుపే ప్లాట్‌ఫాంపై విడుదల చేశాయి.ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైల్వేకు సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ గా సురక్షితంగా జరుగుతాయని రైల్వే మంత్రి పియూష్ గోయల్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రయోజనాలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సి)టెక్నాలజీ ద్వారా రైల్వేస్టేషన్‌లోని పీఓఎస్ మిషన్లలో కార్డును స్వైప్ చేయకుండానే కేవలం టచ్ ద్వారా సంబంధింత లావాదేవీలు పూర్తి చేయవచ్చు. 2021 మార్చి వరకు ఎలాంటి ఎంట్రీ రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఐఆర్సీటీసీ బుక్ చేసే టికెట్లపై ఒక శాతం డిస్కౌంట్ అందిస్తుంది. కొత్త ఐఆర్సీటీసీ-ఎస్బీఐ రుపే క్రెడిట్ కార్డుతో, వినియోగదారులు టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు ఆన్లైన్ షాపింగ్, డిస్కౌంట్ కూడా పొందవచ్చు. రైలు టిక్కెట్ల కొనుగోలు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ముఖ్యంగా బిగ్‌బాస్కెట్, ఆక్స్వై, ఫుడ్‌ఫర్ ట్రావెల్.ఇన్, అజియో, మొదలైన వాటిలో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. మెడ్ లైఫ్ ద్వారా మెడిసిన్స్ పై 20 శాతం దాకా డిస్కౌంట్. వినియోగదారులకు ఆల్‌రౌండ్ షాపింగ్ అనుభవాన్ని మరింతగా పొందేలా కార్లటన్, అరిస్టోక్రాట్, విఐపి, స్కైబ్యాగ్ , కాప్రీస్లలో షాపింగ్ చేసేటప్పుడు 10 శాతం తగ్గింపును అందిస్తోంది. మింత్రాలో 300 రూపాయలు ఆఫర్ క్యూమాత్పై 15 శాతం, బాటాపై 25 శాతం తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. వృత్తి, వ్యాపారరీత్యా తరచూ రైలు ప్రయాణం చేస్తున్న వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎన్నో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఏసీ, సెకండ్, థర్డ్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ చైర్, ఏసీ కార్ చైర్ వినియోగదారులకు 10శాతం వాల్యూ బ్యాక్ సదుపాయం. ఒక శాతం ఇంధన సర్‌చార్జ్ మినహాయింపు లభిస్తుంది. రైల్వే స్టేషన్లలో మూడు నెలలకు ఒకసారి ఏడాదిలో నాలుగు సార్లు ప్రీమియం లాంజ్ ఉచితం. అలాగే కార్డ్ హోల్డర్లు 350 బోనస్ రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ పొందుపర్చిన లింక్‌లో వ్యక్తిగత వివరాలు, మొబైల్ నంబర్, అడ్రస్ ప్రూఫ్ ఎంటర్ చేసి, దరఖాస్తు చేసుకోవాలి. One Credit Card, Multiple Benefits: Introducing IRCTC-SBI Cobranded RuPay Card, that lets you earn rewards while you spend. Discover never-ending benefits on shopping, fuel recharge, train ticket booking & more! 📝 Apply today & enjoy zero issuance fee: https://t.co/aDDkqEElid pic.twitter.com/yQjX3guzGL — Piyush Goyal (@PiyushGoyal) August 27, 2020 -
రైల్వే రిజర్వేషన్; తాజా అప్డేట్స్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లకు సంబంధించి ఇటీవల విధించిన నిబంధనలను రైల్వే మంత్రిత్వ శాఖ సవరించించింది. టిక్కెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును మళ్లీ 120 రోజులకు పెంచింది. అలాగే తత్కాల్ సేవలను పునరుద్ధరించింది. ఇది ఈనెల 31 తేదీ ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కరెంట్ బుకింగ్, తత్కాల్ కోటా సీట్ల కేటాయింపులు సాధారణ టైం టేబుళ్ల రైళ్లకు వర్తించే విధంగానే ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. (ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే) కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ప్రయాణికుల రైళ్లను నిలిపివేశారు. ఈ నెల 12 నుంచి 30 ప్రత్యేక రాజధాని రైళ్లను నడుపుతున్నారు. జూన్ 1 నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ 230 రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును అంతకుముందు 30 రోజులకు పరిమితం చేయగా, తాజాగా ఈ నిబంధనను సవరించి 120 రోజులకు పెంచారు. అలాగే పార్సిల్, లగేజీ బుకింగ్‌కు కూడా అనుమతి పునరుద్ధరించారు. (కోవిడ్ టెన్షన్; గంటకో మరణం!) విశాఖలో ఇలా.. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వచ్చేవారు 8వ నంబరు ప్లాట్‌ఫాంకు రావాల్సి ఉంటుంది. 1వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తారు. విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 1న వైజాగ్ నుంచి బయలుదేరుతుంది. న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు జూన్ 3 నుంచి పట్టాలెక్కుతుంది. హైదరాబాద్- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 1 నుంచి రాకపోకలు సాగించనుంది. విశాఖ- హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ జూన్ 2 నుంచి పునఃప్రారంభమవుతుంది. రైలు బయలుదేరే సమయానికి 2 గంటలు ముందగానే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఆహార ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలని తెలిపింది. (కార్మికుల రైలు బండికి ‘టైం టేబుల్’ లేదట!) -
లాక్డౌన్ పొడిగింపు; రైల్వేకు దెబ్బ
న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగించడంతో రైల్వేశాఖకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టిక్కెట్లను ముందుగానే తీసుకున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 3 మధ్య కాలానికి 39 లక్షల టికెట్లు రద్దు చేసుకునే అవకాశముందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ ఏప్రిల్ 14కు ముగుస్తుందన్న ఉద్దేశంతో 15 నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు అడ్వాన్స్ టిక్కెట్లు తీసుకున్నారు. లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయిన వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు భారీగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించడంతో మే 3 వరకు పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్టు రైల్వేశాఖ తెలిపింది. అలాగే టిక్కెట్ కౌంటర్లను ముసివేస్తున్నామని, అడ్వాన్స్ ఆన్లైన్ రిజర్వేషన్‌ను కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రద్దైన టిక్కెట్లను పూర్తి మొత్తం రిఫండ్ చేస్తామని వెల్లడించింది. సరకు రవాణా చేసే గూడ్స్, పార్శిల్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని తెలిపింది. కాగా, లాక్‌డౌన్‌తో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయిన రైల్వేశాఖ.. భారీ సంఖ్యలో టిక్కెట్ల రద్దుతో మరింత ఆదాయం నష్టపోనుంది. మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ? -
చుక్ చుక్ రైలు వస్తోంది..యాప్‌లో చూసి ఎక్కండి!
సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. ఏ రైలు ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోనుంది. రైళ్ల సమయ పాలనపైన ప్రయాణికులకు కచ్చిత మైన సమాచారం లభించనుంది. ఇప్పటివరకు కంట్రోల్ కేంద్రాల ద్వా రా మాత్రమే లభించే రైళ్ల రాకపోకల వివరాలు ఇక నుంచి ఆన్లైన్లో ప్రత్యక్షం కానున్నాయి. ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నిక్షిప్త మవుతాయి. ప్రయాణికులు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా రైళ్ల రాకపోకల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసు కోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం కోసం చేపట్టిన ‘రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’(ఆర్టీఐఎస్) ప్రాజెక్టు దక్షిణమధ్య రైల్వేలో తుది దశకు చేరుకుంది. శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా రైళ్ల రాక పోకల ప్రత్యక్ష సమాచారానికి అంతరాయం లేకుండా శాటిలైట్ కమ్యూనికేషన్స్ దోహదం చేస్తుంది. ఈ ఆర్టీఐఎస్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వేలోని 334 డీజిల్ లొకోమోటివ్లు, 186 ఎలక్ట్రికల్ లొకోమోటివ్ ఇంజన్లను ఆర్టీఐఎస్ డివైజెస్‌తో అనుసంధానం చేశారు. వచ్చే జనవరి నాటికి అన్ని ఎలక్ట్రిక్, డీజిల్ ఇంజన్లను ఈ ఆర్టీఐఎస్తో అనుసంధానం చేసి ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ‘హైలైట్స్’(హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్) మొబైల్ యాప్ ద్వారా 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తున్నట్లుగానే ఆర్టీఐఎస్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఎలా పని చేస్తుంది.. ఇప్పటివరకు రైళ్ల సమాచారానికి కంట్రోల్ కేంద్రాలే ఆధారం. రైలు బయలుదేరిన సమాచారాన్ని ఒక కంట్రోల్ రూమ్ నుంచి మరో కంట్రోల్ రూమ్‌కు చేరవేయడం ద్వారా మాత్రమే రైల్వేస్టేషన్లలో ఏ రైలు ఏ సమయానికి చేరుకుంటుంది.. అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుంది అనే సమాచారాన్ని అనౌన్స్మెంట్ చేసేవారు. కానీ ఆర్టీఐఎస్లో భాగంగా అన్ని లోకో ఇంజన్లలో జీపీఎస్ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. లోకో ఇంజన్‌కు బయటివైపు రూఫ్టాప్పైన ఏర్పాటు చేసే డివైజ్‌ను రైల్ ఎంఎస్ఎస్ టెర్మినల్ (ఆర్ఎంటీ) మొబైల్ శాటిలైట్ సర్వీస్ (ఎంఎస్ఎస్)తో, మరో రెండు 4జీ మొబైల్ నెట్వర్క్స్తో అనుసంధానం చేస్తారు. రైలు ఇంజన్ లోపలి భాగంలో లోకో పైలెట్‌కు అందుబాటులో ఇండియన్ రైల్ నావిగేటర్ (ఐఆర్ఎన్) అనే మరో డివైజ్‌ను ఏర్పాటు చేస్తారు. రైలు బయలుదేరడానికి ముందు లోకోపైలెట్ తన వద్ద ఉన్న జీపీఎస్ డీవైజ్లో ట్రైన్ నెంబర్, ఐడీ, బయలుదేరే సమయం, తదితర వివరాలను నమోదు చేసి ‘స్టాట్ జర్నీ’బటన్ నొక్కుతాడు. దీంతో ప్రతి 30 సెకన్లకోసారి రైలు కదలికలు నమోదవుతాయి. ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఢిల్లీల్లోని సెంట్రల్ లొకేషన్ సర్వర్ (సీఆర్ఐఎస్)కు చేరుతుంది. సెంట్రల్ సర్వర్‌కు అందిన సమాచారం ఆటోమేటిక్‌గా కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్‌కు వెళ్లిపోతుంది. ఇక్కడ్నుంచి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ద్వారా ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుంది. రైలు బయలుదేరినప్పటి నుంచి ఈ మొత్తం వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రైళ్ల నిర్వహణలో ఈ సమాచారం ఎంతో కీలకమైనది. ట్రైన్ నడిపే లోకోపైలెట్ ఎలాంటి అత్యవసర సమాచారాన్ని అయినా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరవేయవచ్చు. ప్రతికూల వాతావరణం, వరదలు, ముంపు పరిస్థితులు, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర అన్ని అంశాలపైన ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది. సమయం సద్వినియోగం.. ‘ప్రతిరోజు సుమారు 10 లక్షల మంది దక్షిణ మధ్య రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. వీరంతా ఇప్పటివరకు తాము బయలుదేరాల్సిన ట్రైన్ కోసం రైల్వే నుంచి లభించే సమాచారం పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, ఆలస్యానికి కారణాలు వంటి సమాచారం కూడా అందుబాటులో ఉండదు. ఇక నుంచి ప్రత్యక్షంగా ఈ సమాచారమంతా లభించడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని మరింత సమర్థంగా వినియోగించుకొనేందుకు అవకాశముంటుంది. అలాగే రైళ్ల నిర్వహణలో మరింత పారదర్శకతకు అవకాశం లభిస్తుంది.’ –దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ దక్షిణ మధ్య రైల్వేలో డీజిల్ లోకోమోటివ్స్ - 582 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 334 ఇంకా అనుసంధానం కావల్సినవి - 248 అనుసంధానం కావల్సిన లోకోమోటివ్స్ - 80 లాలాగూడ, విజయవాడ వర్క్ షాపుల్లో ఉన్న మొత్తం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్- 266 ఇప్పటివరకు అనుసంధానమైనవి - 186 -
గుంజీలు తీస్తే రైలు టిక్కెట్ ఫ్రీ!
-
యాప్‌లో అన్‌రిజర్వ్ సీట్లు అందుబాటులోకి
న్యూఢిల్లీ: రైళ్లలో రిజర్వుకాని టికెట్లను సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని గురువారం నుంచి దేశమంతటా అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. అన్ని రైల్వే జోన్లలోని అన్ని సబర్బన్ రైళ్లలో అన్‌రిజర్వుడు టికెట్లను ‘యూటీఎస్ మొబైల్ యాప్’ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన ధ్రువీకరణలను సమకూరిస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందుతాయి. వీటిద్వారా లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మార్చి నుంచి రైల్వే ఫ్లెక్సీ–ఫేర్ అమలు రైల్వే శాఖ ప్రతిపాదించిన ఫ్లెక్సీ–ఫేర్ మార్పులు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన ఫ్లెక్సీ–ఫేర్ విధానం ద్వారా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఖరీదైన రైళ్లలో వచ్చే మార్చిలో ప్రయాణించే వారు మొదటిసారిగా లబ్ధి పొందనున్నారు. -
ట్రైన్ టిక్కెట్లపై ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : ట్రైన్ జర్నీ చేయాలని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇదే సరియైన సమయమట. తన అధికారిక వెబ్సైట్ www.irctc.co.in ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అమేజింగ్ డిస్కౌంట్లను దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ ఆఫర్(ఐఆర్సీటీసీ) చేస్తుంది. పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చివరి నిమిషంలో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా.. అడ్వాన్స్‌గా బుక్ చేసుకునేలా డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. మొబిక్విక్ ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ పేమెంట్లు జరిపే వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. తన ప్లాట్‌ఫామ్‌పై టిక్కెట్ బుకింగ్స్ జరిపే వారికి 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా 100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ పొందడమెలా... ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctc.co.inకు వెళ్లాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మీ ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి, పేమెంట్ ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్‌లో, ఈ-వాలెట్ ఆప్షన్లను ఎంచుకోవాలి. వాలెంట్ కేటగిరీలో పేటీఎం, ఫ్రీఛార్జ్, మొబిక్విక్ ఎంచుకోవాలి. వీటికి ఐఆర్సీటీసీ ఆఫర్ వర్తిస్తుంది. -
మరింత చేరువలోకి రైల్వే టికెట్ల బుకింగ్
న్యూఢిల్లీ: రైల్వే టికెట్ల బుకింగ్‌ను సామాన్యులకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా సీఎస్సీ ఈ–గవర్నెన్స్‌తో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 2.9 లక్షల సాధారణ సేవా కేంద్రాలన్నింటిలోనూ (సీఎస్సీ) రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. సీఎస్‌సీని నిర్వహించే వారికి ప్రతి టికెట్‌పై రూ. 10 కమీషన్ లభిస్తుంది. ప్రస్తుతం 40,000 సీఎస్సీల్లో మాత్రమే ఈ సదుపాయం ఉందని, 8–9 నెలల్లో మిగతా అన్ని చోట్లా దీన్ని అందుబాటులోకి తెచ్చేలా ఐఆర్సీటీసీ చురుగ్గా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. అలాగే, సీఎస్సీల్లో ఎక్స్టెన్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించేందుకూ ముందుకు రావాలని బ్యాంకులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 60,000 పైచిలుకు వైఫై హాట్‌స్పాట్స్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటు టెలికం శాఖ 5,000 వైఫై చౌపల్స్ను ప్రారంభించింది. -
రైల్వే అడ్వాన్స్ బుకింగ్: భారీ డిస్కౌంట్
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు త్వరలోనే శుభవార్త అందనుంది. భారీగా డిస్కౌంట్లను అందించే విమానయాన సంస్థల మాదిరిగానే రైల్వే కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. విమాన టికెట్ల మాదిరిగానే అడ్వాన్స్ బుకింగ్ రైల్వే టికెట్లపై డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందించాలని కమిటీ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే రైల్వే ప్రయాణీకులకు భారీ ప్రయోజనం లభించనుంది. ఒక నెల రోజుల ముందు రైల్వే ప్రయాణీకులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభించనుంది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం 50శాతం నుంచి 20శాతం దాకా అడ్వాన్స్ బుకింగ్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. రైలులో ఖాళీగా ఉన్న సీట్లను బట్టి ఈ డిస్కౌంట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అంతేకాదు రైలు బయలుదేరడానికి ముందు రెండు రోజుల నుంచి రెండు గంటల వరకు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేయవచ్చని సూచించింది. అలాగే లోయర్ బెర్త్ కోరుకునే ప్రయాణీకులు మాత్రం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే వృద్ధులకు, మహిళలకు , పిల్లలకు లోయర్ బెర్త్ కేటాయింపు ఉచితమని పునరుద్ఘాటించింది. దీంతోపాటు అర్థరాత్రి , అపరాత్రి కాకుండా, కన్వీనియంట్ సమయాల్లో గమ్యానికి చేరే రైళ్లలో టికెట్ ధరలను పెంచాలని కూడా సూచించింది. -
సగం రైలు టికెట్లు నగదుతోనే..
న్యూఢిల్లీ: దేశంలో 50 శాతం రైలు టికెట్లు ఇప్పటికీ నగదు రూపంలోనే ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. రైలు, బస్సు ప్రయాణాలపై రైల్ యాత్రి అనే వెబ్ సంబంధిత కంపెనీ అధ్యయనం జరిపింది. దేశంలోని 25 నగరాల్లో సుమారు 50 వేల మంది ప్రయాణికులు, 800 ట్రావెల్ ఏజెంట్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ మేరకు అధ్యయన ఫలితాలను వెల్లడించింది. 65 శాతం రైల్వే ప్రయాణికులు టికెట్ కొనుగోలును డిజిటల్ రూపంలో చేస్తుండగా, 50 శాతం రైలు టికెట్లు ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతుండడం విశేషం. చాలా మంది ప్రయాణికులు స్థానిక ఏజెంట్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. టికెట్ కొనుగోలులో చెల్లించే 0.7 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలు ఏజెంట్లకు ఎంతో భారంగా మారినట్లు తేలింది. ఒక్కో ప్రొవైడర్‌ను బట్టి పేమెంట్ గేట్‌వే చార్జీలు 1.5 నుంచి 2 శాతం వరకు ఉన్నాయి. ఏజెంట్లు చెల్లించే 0.7 శాతంతో పాటు మిగిలిన మరో 0.7 శాతం పేమెంట్ గేట్‌వే చార్జీలను ప్రొవైడర్లకు తమ సొంత జేబుల్లో నుంచి చెల్లిస్తున్నారు. ఇది తలకు మించిన భారంగా మారింది. వీటికితోడు ప్రయాణికుల నుంచి రూ.20–40 కమీషన్‌గా ఏజెంట్లు తీసుకుంటున్నారు. ఈ కారణాలతో డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లకుండా ట్రావెల్ ఏజెంట్లు నగదు చెల్లింపులు చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాగా 22న వారణాసి నుంచి మూడో మహమన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. -
టికెట్ బుకింగ్: ఓ షాకింగ్ అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా , నగదు రహిత లావాదేవీలంటూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంటే.. రైల్వే టికెట్ బుకింగ్స్‌కు సంబంధించి ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కేంద్రం డిజిటల్ లావాదేవీలను భారీగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇప్పటికీ చాలా మంది వినియోగదారులు నగదు ద్వారానే టికెట్లు కొనుగోలు చేశారని అధ్యయనం వెల్లడించింది. దేశీయంగా రైలు టికెట్లలో కొనుగోళ్లలో యాభై శాతం లావాదేవీలు నగదు ద్వారా జరుగుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. వెబ్ ఆధారిత సంస్థ రైల్ యాత్రి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టికెట్ల బుకింగ్ విషయంలో డిజిటల్‌గా కంటే.. ఏజెంట్లపైనే ఎక్కువ ఆధారణపడుతున్నారని తెలిపింది. అందుకే నగదు కొనుగోళ్ళు భారీగా నమోదవుతున్నాయిని వివరించింది. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 50 వేల మంది ప్రయాణీకులు, 800మంది ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ సర్వే నిర్వహించింది. 65 శాతంమంది ప్రయాణీకులు డిజిటల్ పేమెంట్స్‌పై మొగ్గుచూపుతున్నప్పటికీ 50 శాతం మంది నగదు చెల్లింపులు చేస్తున్నారని సర్వే చెప్పింది. భారతదేశంలో ముఖ్యమైన వినియోగదారుల విభాగం వారి అవసరాలు సంక్లిష్టం ఎక్కువగా ఉన్నప్పుడు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా సరఫరా-డిమాండ్ అసమానతలు, ఇతర అనిశ్చితుల కారణంగా డిజిటల్ టికెట్ బుకింగ్ ధోరణి క్షీణిస్తోందని రైల్ యాత్రి కో-ఫౌండర్, సీఈవో మనీష్ రాఠి వ్యాఖ్యానించారు. గత ఐదు సంవత్సరాల్లో రైలు టికెట్ల 80 శాతానికిపైగా పెరిగితే, అనేక సంవత్సరాలుగా ట్రావెల్ ఏజెంట్ల కమిషన్ ఫీజు రూ. 20- 40 రూపాయలుగా ఉందని అధ్యయనం పేర్కొంది. దీంతోపాటు డిజిటల్ పేమెంట్స్‌కు ఊతమిచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా ఈ అధ్యయనం సూచించింది. -
దసరా రైళ్ల రిజర్వేషన్ అప్పుడే ఫుల్
సాక్షి, విజయవాడ : దసరా సందర్భంగా ప్రతి రైలుకూ టికెట్ల రిజర్వేషన్ ఇప్పుడే ఫుల్ అవడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ప్రయాణం ప్రహసనంగా మారనుంది. ముఖ్యంగా తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, సికింద్రాబాద్, హౌరా వైపు వెళ్లే పలు రైళ్లలో రిజర్వేషన్ పూర్తి అయి వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. విజయవాడ మీదుగా నిత్యం 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అన్ సీజన్లో లక్షమంది, సీజన్లో రెండు లక్షల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తుంటారు. సెప్టెంబరు 21 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. దీంతో తిరుపతితోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు కొన్ని నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకోవడంతో పలు రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయి ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది. విశాఖ వైపు వెళ్లే గోదావరి, హౌరా వైపు వెళ్లే ఫలక్నామా, కోరమండల్, భువనేశ్వర్ వైపు వెళ్లే కోణార్క్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. దళారులు ముందుగానే టికెట్లను బ్లాక్ చేయడంతో పలు రైళ్ల బుకింగ్స్ ఇప్పటికే ఫుల్ అయి వెయిటింగ్ లిస్ట్ కూడా చాంతాడంత ఉంది. మరోవైపు కన్ఫర్మ్ టికెట్లు కోసం దళారులకు చెల్లించి ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. దసరా ఉత్సవాలకు కోల్‌కతా వెళ్లే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో హౌరా వైపు వెళ్లే పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా అయిపోయింది. దీంతో ఆశలన్నీ తత్కాల్ టికెట్లపైనే పెట్టుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాలలో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.