
న్యూఢిల్లీ: రైళ్లలో రిజర్వుకాని టికెట్లను సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని గురువారం నుంచి దేశమంతటా అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. అన్ని రైల్వే జోన్లలోని అన్ని సబర్బన్ రైళ్లలో అన్‌రిజర్వుడు టికెట్లను ‘యూటీఎస్ మొబైల్ యాప్’ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన ధ్రువీకరణలను సమకూరిస్తే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అందుతాయి. వీటిద్వారా లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
మార్చి నుంచి రైల్వే ఫ్లెక్సీ–ఫేర్ అమలు
రైల్వే శాఖ ప్రతిపాదించిన ఫ్లెక్సీ–ఫేర్ మార్పులు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన ఫ్లెక్సీ–ఫేర్ విధానం ద్వారా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఖరీదైన రైళ్లలో వచ్చే మార్చిలో ప్రయాణించే వారు మొదటిసారిగా లబ్ధి పొందనున్నారు.