uts app
-
UTS App: రైలు ప్రయాణికులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. . రైలు బయలుదేరే సమయం దాకా క్యూలు తరగవు.. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. గతంలో అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణమంటే కచ్చితంగా స్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టికెట్ కొనాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఆ కోచ్‌లలో కూడా ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సబర్బన్ స్టేషన్లకు సంబంధించి గతంలో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల గరిష్ట పరిధిలో యాప్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఇప్పుడు 10 కిలోమీటర్లకు పెంచారు. అలాగే.. నాన్ సబర్బన్ స్టేషన్ల గరిష్ట పరిధిని 10 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు విస్తరించారు. స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి ఈ పరిధి లెక్కలోకి వస్తుంది. ఈ వెసులుబాటు లేక గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవాళ్లు. అన్ రిజర్వ్డ్ బోగీలో సీట్ల రిజర్వేషన్ ఉండదు. కేవలం టికెట్ మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నది తెలిసే ఉంటుంది. అలా ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ వివరాలు సంబంధిత ఫోన్‌కు మెసేజ్ రూపంలో అందుతాయి. రైళ్లలో టీటీఈలకు ఆ వివరాలు చూపితే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు, సీజన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ రకాల వాలెట్లు.. ఆర్–వాలెట్, పేటీఎం,మోబిక్విక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరపొచ్చు. ఇదీ చదవండి: ఛలాన్లు కట్టకుంటే ‘మోత’ మోగుద్ది -
రైలు ప్రయాణం.. యూటీఎస్ యాప్‌లో జనరల్ టికెట్ల బుకింగ్ ఇలా!
సాక్షి, ఖమ్మం : రైలు ప్రయాణమంటే హడావుడి అంతాఇంత కాదు. ఇంటి నుంచి స్టేషన్‌కు పిల్లలు, లగేజీతో చేరుకోవడం.. తీరా టికెట్ కౌంటర్ల వద్ద చాంతాడంత క్యూలో నిల్చొని టికెట్ తీసుకోవడం.. ఇంతలోనే ఎక్కాల్సిన రైలు ఒక్కోసారి వెళ్లిపోవడం.. టికెట్ లేకుండా రైలు ఎక్కితే జరిమానా కట్టాల్సి రావడం.. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేలా రైల్వే శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరి చేతుల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన స్మార్ట్ పోన్లు ఉంటున్న నేపథ్యంలో ఎంచక్కా ఇంటి నుంచే జనరల్ టికెట్ బుక్ చేసుకుని సమయానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లే అవకాశం కల్పించారు. యూటీఎస్(అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం) మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి రాగా, జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో యాప్ ఉపయోగించుకునేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవీ నిబంధనలు.. ప్రధాన రైల్వేస్టేషనల్లో పండుగ సెలవులు, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా యాప్ ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రచారం చేస్తున్నారు. కాగా, ప్రయాణికులు రైలు ప్రయాణం చేసే రోజునే ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ అయిన గంటలోపే రైలు ఎక్కాల్సి ఉండగా, ఎక్కాల్సిన రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో రైలు ఉన్నప్పుడే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ అవుతుంది. అలాకాకుండా రైలు ఎక్కాక టికెట్ బుక్ కాదు. అలాగే, స్మార్ట్ ఫోన్లో జీపీఆర్ఎస్ యాక్టివేషన్లో ఉండాలి. చదవండి: చెల్లిని వదిలేసిన భర్త.. న్యాయం కోసం ఎడ్లబండిపై సుప్రీంకోర్టుకు.. యాప్‌లో నమోదు, బుకింగ్ ఇలా.. జీపీఆర్ఎస్ యాక్టివేషన్ ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేశాక ఫోన్ నంబర్, పేరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసుకుని వచ్చే ఓటీపీ ఆధారంగా ఖాతా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆతర్వాత యాప్ తెరిచి ఫోన్ నంబరు, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అయితే సాధారణ బుకింగ్, క్విక్ బుకింగ్, ఫ్లాట్‌ఫాం టికెట్, సీజన్ టికెట్, క్యూఆర్ బుకింగ్, కేన్సల్ టికెట్ తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఎక్కాల్సిన స్టేషన్, గమ్యస్థానం తదితర వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇక నగదు చెల్లింపునకు ఆర్–వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ ఉపయోగించుకోవచ్చు. కాగిత రహిత టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ కలెక్టర్లకు స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకున్న టికెట్ చూపిస్తే సరిపోతుంది. లేదా ముద్రించిన టికెట్ ఆప్షన్ ఎంచుకుంటే రైల్వేస్టేషన్‌లోని ఏటీవీఎం, కో–టీవీఎం, ఓసీఆర్ యంత్రాలు, ఓటీఎస్ బుకింగ్ కౌంటర్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. ఖమ్మం స్టేషన్లో అవగాహన.. ఖమ్మం మామిళ్లగూడెం: యూటీఎస్(అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టమ్)పై రైల్వే అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు జనరల్ టికెట్లతో పాటు సీజన్ టికెట్లు, పాస్ తీసుకునే అవకాశముందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్లో మంగళవారం అవగాహన కల్పించిన అధికారులు సాధారణ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేయడమే కాక స్టేషన్ పరిసరాల్లో కూ ఆర్ కోడ్ స్కానర్లు అమర్చారు. చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ జె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
లైన్ అక్కర్లేదు..ఆన్లైన్ చాలు!
సీతంపేట: ఓ వైపు ప్లాట్‌ఫారంపై రైలు ఉంటుంది. ఇటు చాంతాడంత క్యూ ఉంటుంది. నిత్యం రైళ్లలో ప్రయాణించే వారికి లైన్లో నించుని టికెట్ తీసుకోవడం ప్రహసనమే. దీంతో పాటు ప్లాట్‌ఫాం తీసుకోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. చిన్నపాటి దూరానికి రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. రద్దీగా ఉండే స్టేషన్లలో అప్పటికప్పుడు వీరికి టికె ట్ తీసుకోవడం కష్టమైన పనే. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అరచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి ఐదు కిలోమీట ర్ల లోపు దూరంలో ఉండి సాధారణ టికెట్, ప్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేసేందుకు యూటీఎస్ యాప్‌ను రూపొందించింది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం, సాధారణ టికెట్ కొనుగోలు చేయాలంటే రైలు సమయాన్ని బట్టి యుద్ధం చేయాల్సిందే. టికెట్ కొనే సమయానికి రైలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించేందుకు రైల్వేశాఖ ఈ యాప్‌ను సిద్ధం చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఆన్లైన్ టి కెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్ర మే పరిమితం. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని ఇకపై జనరల్ టికెట్‌కూ విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ–టికెట్ వినియోగం ద్వారా పేపరు రహిత రైలు టికెట్ విధానం అమల్లోకి రానుంది. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం సీజన్ టికెట్లు పొందే వెసులు బాటు రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ ద్వారా టికెట్ పొందే విధానంలో కొన్ని నిబందనలు/షరతులను మా త్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంటుంది. అన్ని రైళ్లకూ జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర రై ళ్లలో క్షణాల్లో జనరల్ టిక్కెట్లు బుక్ చేసు కోవచ్చు. ఒక వేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్ లేకుంటే బుకింగ్ ఐడీ నంబర్, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద టికెట్ పొందే అవకాశం ఉంది. ప్రత్యేకతలు రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం లేకుండా ఇంటి నుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరే లోపే స్మార్ట్ ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్ పొందవచ్చు. ఈ యాప్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిదిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్, ప్లాట్ఫారం, జనరల్ టిక్కెట్లు పొందవచ్చు. ఒకేసారి నాలుగు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. షో టికెట్ ఆప్షన్ ద్వారా టీసీకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. యాప్ డౌన్లోడింగ్ ఇలా.. 4 ఈ యాప్‌ను ఉచితంగా ఆండ్రాయిడ్ విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. 4 మొబైల్ నంబర్, ఓ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత వివరాలతో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. నిబంధనలు.. ఏ ప్రయాణ టిక్కెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్ర యాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా టికెట్ బుక్ చేద్దామంటే ఈ యాప్ పనిచేయదు. అలాగే టికెట్ బుక్ చేసిన సమయానికి మూడు గంటలు దాటితే టికెట్ పనిచేయదన్నమాట. ఏ రైల్వే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. దూరాన్ని జీపీఎస్ ద్వారా లెక్కిస్తుంది. ఏ ఫ్లాట్ ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీ టర్ల లోపు దూరంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే అర్హులు. ఏ పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చూపించి పొందవచ్చును. ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
యాప్ టికెట్.. టాప్
సాక్షి, సిటీబ్యూరో: కాగిత రహిత డిజిటల్ సేవల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్రిజర్వ్డ్ టిక్కెట్ సిస్టమ్ (యూటీఎస్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. గత జూన్ నాటికి యూటీఎస్ వినియోగదారుల సంఖ్య గత జూన్ నాటికి 3.87 లక్షలకు చేరుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ నాటికి 60 వేలు ఉన్న యూటీఎస్ వినియోగదారులు ఏడాది కాలంలోనే ఏకంగా 545 శాతం పెరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనరల్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్, తదితర సర్వీసుల కోసం టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూల్లో పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016లో ప్రయోగాత్మకంగా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడంతో గతే డాది జూలైలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని సాధారణ రైళ్లకు, అన్రిజర్వ్డ్ బోగీలకు విస్తరించారు. నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ యూటీఎస్ ద్వారా సబర్బన్, నాన్ సబర్బన్ రైళ్లతో పాటు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు కూడా తీసుకోవచ్చు. యూటీఎస్‌ను వినియోగిచుకొనేందుకు ప్రయాణి కులు తమ మొబైల్ ఫోన్లలో రైల్వే వాలెట్‌ను (ఆర్–వాలెట్)ను కలిగి ఉండాలి. ఈ వాలెట్ ద్వారా బుక్ చేసుకొనే అన్రిజర్వ్డ్ టిక్కెట్లపైన 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. విస్తృత ప్రచారం... యూటీఎస్ పై ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు దక్షిణమధ్య రైల్వే విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రత్యేకించి ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో‘ లైన్లలో నిరీక్షించకుండా ఆన్లైన్లో టిక్కెట్లు తీసుకొని ప్రయాణించాలంటూ’ ఫేస్బుక్, వాట్సప్, యూట్యూట్, తదితర సోషల్ మీడియా మాద్యమాల ద్వారా చేపట్టిన ప్రచారం సత్ఫలితాలను ఇచ్చింది. అదే సమయంలో కమర్షియల్ విభాగం సైతం అన్ని స్టేషన్లలో విస్తృత ప్రచారం కల్పించింది. యూటీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు. -
యాప్‌లో అన్‌రిజర్వ్ సీట్లు అందుబాటులోకి
న్యూఢిల్లీ: రైళ్లలో రిజర్వుకాని టికెట్లను సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని గురువారం నుంచి దేశమంతటా అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. అన్ని రైల్వే జోన్లలోని అన్ని సబర్బన్ రైళ్లలో అన్‌రిజర్వుడు టికెట్లను ‘యూటీఎస్ మొబైల్ యాప్’ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, అవసరమైన ధ్రువీకరణలను సమకూరిస్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అందుతాయి. వీటిద్వారా లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మార్చి నుంచి రైల్వే ఫ్లెక్సీ–ఫేర్ అమలు రైల్వే శాఖ ప్రతిపాదించిన ఫ్లెక్సీ–ఫేర్ మార్పులు 2019 మార్చి నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన ఫ్లెక్సీ–ఫేర్ విధానం ద్వారా రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఖరీదైన రైళ్లలో వచ్చే మార్చిలో ప్రయాణించే వారు మొదటిసారిగా లబ్ధి పొందనున్నారు. -
అన్ రిజర్వ్డ్ టికెట్లు కూడా అన్లైన్లో..
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీపి కబురు తెలిపారు. ఇకపై రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేయాలంటే.. ప్రయాణికులు టికెట్ కౌంటర్లను ఆశ్రయించాల్సిన సంగతి తెలిసిందే. రద్దీ సమయాల్లో అన్ రిజర్వ్డ్ టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్లైన్లో కూడా టికెట్లను విక్రయించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లను విక్రయించే విధానాన్ని నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌ను విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా అన్ రిజర్వ్డ్ రైల్వే టికెట్లను నేరుగా అన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని 15 జోన్లలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కాగా, నవంబర్ 1 నుంచి దేశావ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారు రైల్వే ట్రాక్ నుంచి కనీసం 25 మీటర్ల దూరంలో ఉండాలి. యూటీఎస్ యాప్ ద్వారా కేవలం అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైల్వే పాస్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. యాప్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్‌తో ఇతర ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. నాలుగేళ్ల క్రితం కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అంతగా స్పందన రాలేదు. -
10 రోజులు.. పది లక్షలు
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): ఇంటి వద్ద నుంచే సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన పది రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీల్లో పయనించేందుకు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పది రోజుల కాలంలో ఏకంగా 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో 60 వేల మంది ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలోని సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, పండుగలు, వరస సెలవుల కారణంగా సకాలంలో టిక్కెట్లు దొరక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ బుకింగ్ సదుపాయాన్ని యూటీఎస్ ద్వారా అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకు విస్తరించారు. దీంతో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణానికి 3 గంటలు ముందు స్మార్ట్ఫోన్లలో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ వెరీ యూస్ఫుల్... దక్షిణమధ్య రైల్వేలోని సుమారు 600 రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల మంది స్లీపర్, ఏసీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తుండగా, 9 లక్షల మంది సాధారణ ప్రయాణికులే. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే ప్రతి రోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్, కాజీపేట్, వంటి పెద్ద స్టేషన్లతో పాటు, చిన్న స్టేషన్ల నుంచి రోజువారీ అవసరాల కోసం సమీప స్టేషన్ల నుంచి ప్రధాన పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారూ లక్షల్లోనే ఉంటారు. వీరందరూ జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. యూటీఎస్ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా, లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణానికి 3 గంటల ముందు ఇంటి దగ్గర నుంచే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. 130 స్టేషన్లలో వినియోగం... దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లతో పాటు పొరుగు జోన్లకు రాకపోకలు సాగించే రైళ్లలో సైతం యూటీఎస్ ద్వారా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 10 రోజుల్లో 130 స్టేషన్ల నుంచి 50 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నగరంలోని లింగంపల్లి, హైటెక్‌సిటీ, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లు, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి పెద్ద స్టేషన్ల నుంచి కూడా యూటీఎస్ రాకపోకలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ప్రయాణికులు తాము బయలుదేరే రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉంటే చాలు. ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకున్న తరువాత 3 గంటల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఒక్క పరిమితిని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్‌ను వినియోగించుకోవాలి. ఆర్–వాలెట్‌పై 5 శాతం బోనస్... ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్, ఇతర సదుపాయాల నుంచి యూటీఎస్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు. అయితే దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఆర్–వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే టిక్కెట్ చార్జీలపైన 5 శాతం బోనస్ లభిస్తుంది. -
రైల్వే యూటీఎస్ యాప్‌లో మరో రెండు ఫీచర్లు
ముంబై: రైల్వే శాఖ తన అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం(యూటీఎస్) యాప్‌కు మరో రెండు ఫీచర్లను జతచేసింది. తొలి యాప్ లో... ప్రైవేట్ ఆన్లైన్ పేమెంట్ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ రీచార్జ్ చేస్తాయి. ఇక రెండో యాప్ ద్వారా ముద్రించిన అన్రిజర్వ్డ్ టికెట్ పొందవచ్చు. ఇప్పటి వరకు కస్టమర్లు కౌంటర్ల వద్ద పేపర్ టికెట్లను మాత్రమే పొందుతున్నారు.