
భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని భోపాల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక యువకుడు తండ్రి తన ఫోన్ రిపేర్ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలోని ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్ రిపేర్ చేయించలేననని, అలాగే కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పాడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతితో ఆ తండ్రి కుమిలిపోతున్నాడు.
ఏష్బాగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయీద్ ఖాన్(18) బాగ్ ఫర్హత్ అఫజ్ పరిధిలోని ఓకాఫ్ కాలనీలో ఉంటున్నాడు. 12వ తరగతి పాసయిన సయీద్ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కాలేజీలో చేరలేదు. నాలుగు రోజులుగా అతని ఫోను చార్జింగ్ కావడంలేదు. దీంతో ఆ ఫోనును రిపేర్ చేయించేందుకు మెకానిక్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను ఫోను రిపేరు(Phone repair)కు చాలా ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని అతను తండ్రికి చెప్పాడు. అయితే తండ్రి తన దగ్గర డబ్బులు లేవని, ఆ ఫోనుకు రిపేర్ చేయించలేనని, కొత్తది కొనివ్వలేనని చెప్పడంతో సయీద్ కలత చెందాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య