ఈ–వాలెట్ ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: త్వరలో పేటీఎం, జియోమనీ, ఎయిర్‌టెల్‌మనీ లాంటి ఈ–వాలెట్ సర్వీసుల ద్వారా అన్ రిజర్వ్‌డ్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కాగిత రహిత మొబైల్ టికెటింగ్‌ను పెంచేందుకు ఈ–కామర్స్ రంగంపై రైల్వేశాఖ దృష్టిసారించింది.
రిజర్వేషన్ లేని టికెట్ల ఫారమ్‌ల నిర్వహణ సమస్యగా తయారైందని పేపర్‌లెస్ వ్యవస్థ దిశగా అడుగులేసేందుకే ఈ–వాలెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. టికెట్లను విక్రయించిన ఈ–వాలెట్ సంస్థల నుంచి రైల్వేకి కమీషన్ల రూపంలో ఆదాయం సమకూరనుంది.