డైరెక్ట్ ఫ్లయిట్ సరీ్వసులు అవసరం
వీసా ప్రక్రియలు సులభంగా మారాలి
బుకింగ్ డాట్ కామ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్‌లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది.
వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్‌కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్‌ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు.
మూడింట ఒక వంతు భారత్‌తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్‌తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్‌కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్‌కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment