న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల నుంచి ముందస్తుగా బుక్ చేసుకున్న రైల్వే టికెట్లను రద్దు చేయడం చాలా సులభం కానుంది. కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా టికెట్లను రద్దు చేసుకునే సౌలభ్యాన్ని రైల్వే సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ముందుగా బుక్ చేసుకున్న టికెట్‌ను నిర్ణీత గడువులోపు రైల్వే కౌంటర్ల వద్దకు వెళ్లి క్యాన్సిల్ చేసుకొని.. టికెట్ డబ్బు వాపస్ తీసుకోవడమంటే ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారుతోంది.
ఈ నేపథ్యంలో 139 నంబర్‌కు డయల్ చేసి కన్ఫర్మ్ అయిన టికెట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా కాన్సిల్ చేసుకోగానే వారికి ఒన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అదే రోజు ఏ సమయంలోనైనా రైల్వే కౌంటర్ వద్దకు వెళ్లి ఓటీపీ తెలియజేయడం ద్వారా టికెట్ డబ్బుని వాపస్ తీసుకోవచ్చు' అని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. డబ్బు వాపస్ పొందే నిబంధనలను ఇటీవల రైల్వే మార్చింది. దీంతో చాలామంది ప్రయాణికులు నిర్ణీత గడువులోపు కౌంటర్ల వద్దకు వెళ్లి.. రిజర్వు చేయించుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో చాలామంది టికెట్ క్యాన్సిల్ చేయించుకున్న డబ్బు వాపస్ పొందడం లేదు. ఈ నేపథ్యంలో ఫోన్ నంబర్ సౌలభ్యాన్ని రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా నిజంగా అవసరమున్న ప్రయాణికులకే రిజర్వేషన్ టికెట్ లభించేందుకు వీలుగా టికెట్ క్యాన్సిలేషన్ చార్జీని రైల్వే రెట్టింపు చేసింది. దీంతో అనవసరంగా ముందస్తుగా బుక్ చేసేవారికి, బ్లాక్ మార్కెట్లలో రిజర్వేషన్ టికెట్లు అమ్మేవారికి చెక్ పడుతుందని భావిస్తోంది.
ఫోన్ కొట్టు.. టికెట్ రద్దు చేయ్!
Published Sun, Mar 27 2016 12:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement
Advertisement