క్యూ ఆర్‌ స్కాన్‌తో సాధారణ రైలు టికెట్లు  | Regular train tickets with QR scan | Sakshi
Sakshi News home page

క్యూ ఆర్‌ స్కాన్‌తో సాధారణ రైలు టికెట్లు 

Published Sat, Apr 6 2024 2:43 AM | Last Updated on Sat, Apr 6 2024 11:41 AM

Regular train tickets with QR scan - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): డిజిటల్‌ చెల్లిం­పు­లు, నగదు రహిత లావాదేవీలను ప్రో­త్సహించే క్రమంలో విజయవాడ డివిజన్‌లో జనరల్‌ బుకింగ్‌ కౌంటర్‌ (అన్‌ రిజర్వ్‌డ్‌)లో క్యూఆర్‌ కోడ్‌ ప్రవేశపెట్టినట్లు సీనియర్‌ డీసీఎం వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్‌లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్‌ బుకింగ్‌ కౌంటర్‌లలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

కౌంటర్‌ వద్ద టికెట్‌ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, పిల్లలు/పెద్దల సంఖ్య, చార్జీలు వివరాలను బుకింగ్‌ క్లర్క్‌ నమోదు చేయగానే కౌంటర్‌ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని అక్కడ కనిపించే క్యూ ఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌లోని పేమెంట్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేయడంతో టికెట్‌ జనరేట్‌ అవుతుందన్నారు. త్వరలోనే ఈ సౌకర్యాన్ని డివిజన్‌లోని అన్ని స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకురాను­న్నట్లు సీనియర్‌ డీసీఎం తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement